Pages

Sunday, 1 February 2015

thyroid symtoms

ఈ లక్షణాలు ఉంటే.. థైరాయిడ్‌ కావచ్చు

తలనొప్పి, కడుపులో ఇబ్బందిగా అనిపించడం, నీరసం... ఇలాంటి లక్షణాలు రోజూ ఉంటున్నాయా? పని ఒత్తిడి మూలంగా ఇవన్నీ వస్తున్నాయని తేలిగ్గా తీసిపారేయకండి. ఈ లక్షణాలు థైరాయిడ్‌ సమస్యకు సంకేతాలు కావచ్చు. ఒకవేళ మీలో అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? చెక్‌ చేసుకోండి.
నీరసం : పని చేయకపోయినా రోజూ మధ్యాహ్నం వేళ నీరసంగా ఉంటోందా? అయితే అనుమానించాల్సిందే. థైరాయిడ్‌ సమస్య ఉన్న వారిలో కనిపించే ప్రధాన లక్షణం నీరసం.
జీర్ణసమస్యలు : డయేరియా లేక మలబద్ధకం థైరాయిడ్‌లో కనిపించే మరో లక్షణం. కడుపు ఉబ్బరం కూడా ఉంటుంది.
బరువులో తేడా : థైరాయిడ్‌ గ్రంధి జీవక్రియలను నియంత్రిస్తుంది. బరువు తగ్గుతున్నట్లయితే హైపర్‌థైరాయిడిజం, బరువు పెరుగుతున్నట్లయితే హైపోథైరాయిడిజంగా భావించాలి. మెటబాలిజం లెవెల్స్‌ పెరగడం, తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది.
శ్వాసకోశ సమస్యలు : సోయా, నట్స్‌, క్యాబేజి వంటి ఆహారపదార్థాలు థైరాయిడ్‌ పనితీరును తగ్గిస్తాయి. ఈసారి మీరు ఇవి తిన్నప్పుడు శ్వాస సమస్యలు తలెత్తినట్లయితే ఒకసారి చెక్‌ చేయించుకోండి.
డిప్రెషన్‌ : శరీర పనితీరుపైనే కాకుండా మానసిక పనితీరుపై కూడా హార్మోన్ల ప్రభావం ఉంటుంది. ఎటువంటి కారణం లేకుండా మూడ్‌ బాగా లేదని అంటున్నారంటే థైరాయిడ్‌ గురించి ఆలోచించాల్సిందే.
గాయిటర్‌ : థైరాయిడ్‌ గ్రంధి పెరగటాన్ని గాయిటర్‌ అంటారు. ఎటువంటి చికిత్స తీసుకోని వారిలో థైరాయిడ్‌ గ్రంధి బాగా పెరిగి గొంతు దగ్గర స్పష్టంగా వాపు కనిపిస్తుంది.
హార్ట్‌రేట్‌ : ఉద్వేగభరితమైన సంఘటనలు ఏమీ లేకపోయినా హార్ట్‌బీట్‌ పెరిగిపోతుంటే కనుక థైరాయిడ్‌ సమస్య ఉందేమో చెక్‌ చేసుకోవాలి.
ఆకలి లేకపోవడం : థైరాయిడ్‌ సమస్య ప్రారంభదశలో కనిపించే లక్షణం ఆకలి లేకపోవడం. బరువు తగ్గుతున్నా, పెరుగుతున్నా ఏమీ తినాలనిపించదు. ఆకలి లేకుండా పోతుంది. ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే థైరాయిడ్‌ చెకప్‌ చేసుకుని సందేహాలను నివృత్తి చేసుకోవడం ఉత్తమం.

No comments:

Post a Comment