Mana TELUGU ni brathikinchu ..... TELUGU vadigaa Jeevinchu....
Pages
▼
Sunday, 1 February 2015
Orange.....better fruit for health
కమలా పండే బెటర్
ఉల్లి
చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అలాగే కమలాపండు జ్యూసు చేసే మేలు ఏదీ
చేయదంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ రసంలోని యాంటాక్సిడెంట్ యాక్టివిటీని
పరిశీలించిన అధ్యయనకారులు అందులో యాంటాక్సిడెంట్ యాక్టివిటీ బాగా
ఉండడాన్ని వెల్లడించారు. ఈ స్టడీని యూనివర్సిటీ ఆఫ్ గ్రెనడా
శాస్త్రవేత్తలు చేశారు. పెద్దప్రేగు ఆరోగ్యంగా ఉండడానికి ఇందులోని
యాంటాక్సిడెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. గ్రెనడా
యూనివర్సిటీకి చెందిన జోస్ యాంజిల్ రఫ్లాన్ హెన్‌రెస్ బృందం ‘గ్లోబల్
యాంటాక్సిడెంట్ రెస్పాన్స్’ అనే టెక్నిక్‌ని కనుగొన్నారు. ఇందులో
గాసో్ట్రఇంటస్టైనల్ డైజిషన్‌కు సంబంధించిన ఇన్ విట్రో సిమ్యులేషన్ కూడా
ఉంది. దీన్నిబట్టి కమలాపండు జ్యూసులో ఉన్న యాంటాక్సిడెంట్ యాక్టివిటీ
తొలుత ఊహించినదాని కన్నా కూడా పది రెట్లు ఎక్కువ ఉందని తేలింది. కమలాపండే
కాదు అన్ని రకాల జ్యూసుల్లో, ఫుడ్స్‌లో ఉండే యాంటాక్సిడెంట్ విలువను ఈ
పద్ధతి ద్వారా కనుక్కోవచ్చు. డైటీషియన్స్ కూడా తమ దగ్గరకు వచ్చేవారికి
వారు తీసుకునే ఆహారంలో యాంటాక్సిడెంట్స్ విలువలు ఎంత ఉన్నాయో ఈ టెక్నిక్
సహాయంతో నిర్థారించి చెప్పవచ్చు.
No comments:
Post a Comment