Pages

Wednesday, 3 December 2014

who can do liver donation?

కాలేయ దానం ఎవరైనా చేయొచ్చు..

య్యలేక ఈ అవయవాల్ని తీసేసి, వేరే అవయవాల్ని పెట్టక తప్పదు. మరి అప్పుడు అవయవాలు కావాలి, అవయవాలు లేకపోతే ‘మార్పిడి’ అనే మాటకి అర్థమే లేదు.
ఇప్పుడు ఏ అవయవం కోసమైనా ఎదురుచూసే వాళ్ళ సంఖ్య ఎక్కువే, దాతల సంఖ్య చాలా తక్కువ. ఇది బాధపడాల్సిన పరిస్థితి. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల కలిగే స్థితి.
ఒక వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయితే అతని అవయవాలతో దాదాపు 9 మంది కొత్త జీవితాన్ని పొందుతారు. రెండు కళ్ళు, రెండు కిడ్నీలు, రెండు ఊపిరితిత్తులు, గుండె, ఫాంక్రియాస్, లివర్‌లని దానం చేయవచ్చు. ఒక్కో అవయవం ఒక్కరికి అమరుస్తారు కాబట్టి 9 మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు.
ఇక్కడ మరో టెక్నికల్ విషయం గురించి ఆలోచించాలి. గుండె తీసిన 4 గంటలలోపే అమర్చి, కొట్టుకునేట్టు చెయ్యాలి. అలాగే కాలేయం 8 గంటల లోపు, కిడ్నీలు 24 గంటలలోపు.. ఇలా ఒక్కో అవయవాన్ని అమర్చేందుకు కచ్చితమైన కాలవ్యవధి ఉంది. అందుకని అవయవాలు దొరుకుతున్నాయంటే వాటి కోసం ఎదురుచూస్తున్న వాళ్ళలో, ప్రాణాపాయం ఉన్నవాళ్ళని ముందు సిద్ధం చేస్తారు.
గుండె కొట్టుకుంటుంటే, రక్తప్రసరణ జరుగుతుండడంతో అన్ని అవయవాల్ని తీసుకోవచ్చు. అన్ని అవయవాల్ని తీసేసిన తర్వాత ఆఖరుకి గుండెని తీస్తారు. కానీ అమర్చేటపుడు గుండెని ముందు అమర్చాలి. కాలేయాన్ని సమయం మించకుండా అమర్చాలి.
ఇలా బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అవయవదానం చేస్తే ‘కెడావరిక్ డొనేషన్’ అంటారు. అలా కాకుండా బతికున్న వాళ్ళనుంచి కొన్ని అవయవాలు లేక అవయవ భాగాలు తీసుకోవచ్చు. దానిని ‘లివింగ్ డోనర్ డొనేషన్’ అంటారు. అంటే బ్రతికున్నవాళ్ళనుంచి దానం జరుగుతుందన్నమాట. రెండు కిడ్నీలుంటే ఒక కిడ్నీ దానం చేయవచ్చు. కానీ ఒక లివర్ వున్నా దాంట్లో కొంత భాగాన్ని దానం చేయవచ్చు. లివర్ రెండేసి రెండేసి ఉన్న ఎనిమిది భాగాలు, ఎనిమిది భాగాలకి రక్తప్రసరణ వేరుగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కో ఫ్లోర్‌లో రెండేసి ఫ్లాట్లున్న నాలుగంతస్థుల భవనం లాంటిది లివర్. ఏ ఫ్లాట్‌కి ఆ ఫ్లాట్‌కి డ్రైనేజ్, తాగు, వాడుక నీరు సరఫరా వేరుగా ఉంటుంది. అలాగే లివర్ కూడా. లివర్‌లో 1/3 వంతు ఉన్నా లివర్ చేసే పనులన్నీ చేయగలదు. పైన 4 లోబులని దానం చేస్తే అవతలి మనిషి బ్రతుకుతాడు. రెండు నెలల్లో ఇద్దరి లివర్లు పూర్తి స్థాయికి పెరుగుతాయి. చనిపోయేంతవరకు పెరిగే అవయవం లివర్ ఒక్కటే. లివర్ పెద్ద రసాయన కర్మాగారం. ఆ రసాయనాల్ని బయట తయారుచేయాలంటే ఫ్యాక్టరీని కొన్ని ఎకరాలలో పెట్టాలి. రక్తాన్ని శుద్ధిలో ఉంచే అవయవం- లివర్. అటువంటి లివర్ దెబ్బతింటే వేరేది పెట్టుకోవడం తప్పదు! ఇలా బ్రతికి ఉన్నవాళ్ళ దగ్గర్నుంచి లివర్ స్వీకరించడం ‘లివింగ్ డోనర్ డొనేషన్’ అంటారు.
‘కెడావరిక్ డొనేషన్స్’ సంఖ్య పెరిగితే, ‘లివింగ్ డోనర్ డొనేషన్స్’ తగ్గు తాయి. లివింగ్ డోనర్ డొనేషన్స్‌లో ఇద్దరికి, రెండు శస్త్ర చికిత్సలు జరగాలి. కెడావరిక్ డొనేషన్ అయితే జరిగేది ఒక్కటే శస్తచ్రికిత్స. రెండో వ్యక్తికి రిస్క్ ఉండదు.
ఇప్పుడు మన హైదరాబాద్‌లో ఎంతోమంది డాక్టర్లు ‘కాలేయ మార్పిడి’ని విజయవంతంగా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి శస్తచ్రికిత్సల కోసం హైదరాబాద్ దాటి వెళ్ళనక్కరలేదు.
ఒకప్పుడు ఇలాంటి పెద్ద శస్తచ్రికిత్సలకి విదేశాలకి వెళ్ళేవారు. ఇప్పుడు విదేశాలవాళ్ళు, ఈ పెద్ద కొత్త శస్తచ్రికిత్సలకోసం మన దేశానికి వస్తున్నారు. ఇది ‘రివర్స్ ట్రెండ్’. ఇక్కడ తక్కువ ఖరీదుతో చికిత్స జరుగుతుందని, అక్కడ చేసేది ఇక్కడివాళ్ళే, ఇప్పుడు వెనక్కి వచ్చేశారని, వాళ్ళ సామర్థ్యం, పెరిగిన టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయిలో చికిత్సలు జరుగుతున్నాయని తెలిసి ఇక్కడికి జనం వస్తున్నారు. మెడికల్ టూరిజం పెరుగుతోంది. ఇంకా అనేక విషయాల గురించి తెలుసుకుంటేనే అవయవ దానంపై తగిన అవగాహన ఏర్పడుతుంది.

No comments:

Post a Comment