Pages

Wednesday, 3 December 2014

High blood pressure

అధిక రక్తపోటు.. దంతాలకూ సమస్యే..!

బరువు పెరిగినకొద్దీ గుండెకి ఎక్కువ దూరం రక్తనాళాలలో రక్తాన్ని నెట్టాల్సిన భారం పడుతుంది. అందుకని గుండె గట్టిగా మూసుకుని తెరుచుకోవాల్సి వస్తుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. గుండె గదులు పెద్దవవుతాయి. గదుల్లోని రక్తం పూర్తిగా పంప్ కాక మిగిలిపోతుంటుంది. శరీరంలోనే కాదు, రక్తంలోనూ కొవ్వు పెరుగుతుంది. రక్తనాళాల, గుండె జబ్బులొస్తాయి. అధిక రక్తపోటుతోపాటు అధిక బరువువల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటిస్ వస్తుంది.
అధిక రక్తపోటు ప్రభావం పళ్లమీదా పడుతుంది. అందుకని దంతవైద్యం కోసం వెళ్లినపుడు అధిక రక్తపోటుంటే చెప్పాలి.
అధిక రక్తపోటున్నవాళ్లకి దంత, చిగుళ్ల శస్త్ర చికిత్సలలో రక్తస్రావం ఎక్కువవుతుంది. అందుకని ముందే తెలుసుకుంటే జాగ్రత్తపడవచ్చు.
నోట్లో ఆహారాన్ని జీర్ణం చేయడానికే కాదు, క్రిముల్ని నాశనం చేయడానికి లాలాజలం తోడ్పడుతుంటుంది. అధిక రక్తపోటువల్ల నోరెండిపోతున్నట్లుంటుంది. దాంతో చిగుళ్ల వ్యాధులూ వస్తాయి. అందుకని రక్తపోటుని అదుపులో ఉంచుకోవాలి. రక్తపోటుని అదుపులో ఉంచుకోవాలంటే అధిక బరువుని తగ్గించుకోవాలి.
శరీరంలో కొవ్వు పెరిగినప్పుడు రక్తంలోనూ కొవ్వు పెరుగుతుందనుకున్నాం! దాంతో ఎథిరోస్క్లీరోసిస్ వచ్చి రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం రావచ్చు. ముఖ్యంగా దంతాల చిగుళ్లకి రక్తం సరఫరా చేసే నాళాలలో అడ్డంకులవల్ల చిగుళ్ల జబ్బులు రావచ్చు. అధిక రక్తపోటుకి వాడే మందులవల్ల నోటికి రుచి తెలియదు. దానినే ‘డిస్‌గేసియా’ అంటారు. అంటే మందుల ప్రభావం నోటి మీదుంటుందనేగా.
దంతవైద్యుడి దగ్గరకు వచ్చే ప్రతి విజిట్‌లోను రక్తపోటు చూసుకుంటుండాలి. రక్తపోటుని బట్టి దంత చికిత్సని వైద్యుడు ప్లాన్ చేస్తాడు. పొడిగించి చేసినా ఫరవాలేదనుకున్న చికిత్సల్ని తర్వాత చేస్తాడు. ఏ మందులు వేసి తగ్గించాలో కూడా వైద్యుడే నిర్ణయిస్తాడు.
ఈ ఇబ్బందులన్నీ పడి దంత చికిత్స చేయించుకునే బదులు బరువుని అదుపులో ఉంచుకోవడం మంచిది! కాబట్టి బరువుని అదుపులో ఉంచుకోవడంవల్ల అన్ని అవయవాలు అనారోగ్యం పాలవకుండా జాగ్రత్తపడవచ్చు. అన్ని చికిత్సలకి అందుబాటులో ఉండవచ్చు. బరువు పెరగడం ఆరోగ్యానికి భారం.. అనారోగ్యానికి ఆలవాలం.

No comments:

Post a Comment