Pages

Friday, 19 September 2014


సూక్ష్మక్రిములే పెను సవాల్!

    TAGS:
కీటక జనిత వ్యాధులైన మలేరియా, చికున్‌గున్యా, జపానిస్ ఎన్‌సెఫలైటీస్ (మెదడువాపు), డెంగీ, ఫైలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు మనిషికి దోమల ద్వారా వ్యాపించి ఏటా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలను హరిస్తున్నాయి. మలేరియా లక్షణాలతో బాధపడే లక్షలాది మంది ప్రజలు దోమ అంటే విపరీతంగా భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ వ్యాధి దోమల్లో ఎనాఫిలస్ అనే దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ప్లాస్మోడియం జాతికి చెందిన రెండు క్రిముల వల్ల ఈ రోగం వచ్చే అవకాశం ఉంది. ఇందులో ‘వైవాక్స్’ మలేరియా తక్కువ ప్రాణాంతకమైతే ఫాల్సోఫెరం మలేరియా తీవ్రంగా బాధించడంతో పాటు ఒక్కోసారి ప్రాణాలను కూడా హరిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ఫాల్సోఫెరం మలేరియా, మైదాన, పట్టణ ప్రాంతాల్లో వైవాక్స్ మలేరియా అధికంగా ప్రబలుతుంది. చిన్న పిల్లలకు, గర్భిణీలకు ప్రాణాంతకంగా చెప్పవచ్చు. ఆనాఫిలస్ రకం దోమ కుట్టడం ద్వారా వ్యాధికారక ‘ప్లాస్మోడియం’ పరాన్నజీవి ద్వారా ఒకరినుండి ఒకరికి వ్యాపిస్తుంది. దోమకాటు లేనిదే మలేరియా రాదు. వర్షాకాలంలో కలుషిత పరిసరాలు, వాతావరణంతో ఈ వ్యాధి ప్రబలుతుంది.
మెదడువాపు వ్యాధి...
ఈ వ్యాధి మెదడు, నాడీ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. రోగికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులతో అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. శ్వాసపీల్చడం కష్టమై మెడ బిగుసుకుపోతుంది. జెయి దోమల ద్వారా జంతువులకు సంభవించే ఈ వ్యాధి పక్షులు, జంతువుల ద్వారా మనుషులకు ఆకస్మికంగా ప్రవేశిస్తాయి. ఈ వ్యాధిని కలిగించే వైరస్ జపనీస్, బిఆర్బోవైరస్, ఇవి క్యూలెక్స్ జాతికి చెందిన విష్ణువాయి, ట్రైటనోరింకస్ వంటి దోమల ద్వారా వ్యాపిస్తాయి. ఈ వైరస్ ట్రాన్‌మిషన్ సైకిల్(వ్యాది వ్యాప్తి చక్రం) పందులు, గుర్రాలు, కొంగలు, పాంగ్ హెరాన్స్, కోళ్లు, పావురాళ్లు, బాతులు తదితర పక్షులు జెయి వైరస్‌కు స్థావరాలుగా ఉంటాయి. జెయి వైరస్ కలిగి ఉండే దోమల్ని వెక్టార్ దోమ, క్యూలెక్స్ దోమలు పంటపొలాలు, వరిపొలాలు, గుంతలు, నీటి మడుగులు, నీటి ఊట ప్రాంతాలు వీటి స్థావరాలు, పశువులు, పిట్టలు జెయి వైరస్ ప్రయాణం చేసే స్వాభావానికి వలయం. వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా ఈ వ్యాధి ఉంటుంది. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు ఈ వ్యాధి ప్రబలుతుందని వైద్యులు చెబుతున్నారు. పక్షులు, పశువుల నుండి వైరస్ ప్రవేశించిన తర్వాత దోమలు కుట్టడం వల్ల 9 నుండి 12 రోజుల తర్వాత మనిషిలో ఈ వైరస్ సంక్రమిస్తుంది. 5 నుండి 15 రోజుల వ్యవధిలో మనిషిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. 24గంటల కంటే ఎక్కువ కాలం రోగి తీవ్ర జ్వరం, ఆకస్మాత్తుగా వణుకు, ప్రవర్తనలో మార్పు, జ్ఞానం కోల్పోవడం వంటి జరుగుతాయి. ఈ వ్యాధి మూడు దశల్లో ఉంటుంది. 1. ప్రోడ్రోమల్, 2. ఆక్యూట్ ఎన్‌సెఫలైటీస్, 3. కన్‌వెల్సెంట్ అనే మూడు స్థాయిలు ఉంటాయి. ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేదు.
డెంగ్యూ జ్వరం...
ఇది హఠాత్తుగా తీవ్ర జ్వరంతో మొదలై కండ్లు కదిలించలేని పరిస్థితి, ఎముకలు, కండరాల్లో నొప్పి, శరీరంపై పొక్కులు, వాంతులు, వికారం, రక్తంలో కూడిన మలవిసర్జన వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఇది ‘ఎడిస్’ దోమల ద్వారా వ్యాపించే వ్యాధి. చిన్నగా, నల్లగా ఉండే ఈ దోమలు తెల్లని మచ్చలు కలిగి ఉంటాయి. వీటిని టైగర్ దోమలు అని కూడా అంటారు. ఇవి పగలు, రాత్రి కూడా కుడతాయి. ఈ వ్యాధి వైరస్ వలన కలుగుతున్నందున పూర్తి స్థాయి చికిత్స లేదు. ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు అంటున్నారు. దీనిని నయం చేయడం కన్నా నివారణే మిన్నని వైద్యులు సూచిస్తున్నారు.
చికున్‌గున్యా వ్యాధి...
ఈ వ్యాధి ఆల్ఫా వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఇది కూడా ఎడిస్ అనే టైగర్ దోమల ద్వారా వ్యాపిస్తాయి. డెంగ్యూ వ్యాధి లక్షణాలు, రోగ నిర్థారణ వంటివి కూడా చికున్‌గున్యాకు వర్తిస్తాయి. ఈ వ్యాధికి కూడా పూర్తిస్థాయి చికిత్స లేదు. ఇది రోగిని తీవ్రంగా బాధించే వ్యాధి తప్ప ప్రాణాంతకం కాదు.
ఫైలేరియా వ్యాధి...
ఈ వ్యాధి దోమల ద్వారా వ్యాపించే ‘మైకో ఫైలేరియా’ సూక్ష్మ క్రిమి ద్వారా వ్యాపిస్తుంది. క్యూ లెక్స్ దోమలు ఈ వ్యాధిని వ్యాప్తిస్తాయి. ఈ వ్యాధి సోకిన వ్యక్తిలో ఫైలేరియా పరాన్నజీవి సూక్ష్మదశలో ఉపాతి రక్త వ్యవస్థలో మైక్రో ఫైలేరియాలను ఉత్పత్తి చేస్తుంది. సదరు వ్యక్తుల రక్తాన్ని పీల్చిన దోమల్లో మైక్రో ఫైలేరియా ఉంటుంది. గ్రామగ్రామాల్లో ప్రతి ఒక్కరు భారీ మొత్తంలో మాత్రలు పంపిణీ ద్వారా వాడితే సూక్ష్మ ఫైలేరియా నిర్మూలనతో పాటు రోగం వ్యాప్తి కాకుండా నిరోధించబడుతుంది. *

No comments:

Post a Comment