Pages

Friday, 19 September 2014


పింపుల్స్ పీడ వదలాలంటే..

సాధారణంగా యుక్తవయస్సు వచ్చిన యువతీ యువకుల్లో కొవ్వు పదార్థం చేరిన చిన్న చిన్న మొటిమలు ముఖంపై ఎక్కువగానూ, ఛాతీ, వీపులపై తక్కువగానూ రావడం జరుగుతుంది.
ఇలా యుక్త వయస్సులో మొటిమలు రావడం సహజమే అయినప్పటికీ, మొటిమలు ఏర్పడగానే తాము అందవిహీనులమవుతామని వారు భావిస్తారు.
అంతేకాకుండా, మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోషన్‌లను రాసుకోవడం, మొటిమలను గిల్లడం మొదలైనవి చేయడంవల్ల మొటిమలు తగ్గకపోగా ఇన్‌ఫెక్షన్‌కు గురై చీము కారడం మచ్చలు ఏర్పడటం, గుంటలు పడటం జరుగుతుంది.
మొటిమలు 12 సంవత్సరాల వయస్సు నుంచి 24 సంవత్సరాల వయస్సు వరకూ వస్తుంటాయి. కాని కొందరిలో హార్మోన్ల అసమతుల్యతవల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడివల్ల స్ర్తిలలో బహిష్టులు సక్రమంగా లేకపోవడంవల్ల, కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలవల్ల వయస్సుతో నిమిత్తం లేకుండా ఇవి వస్తుంటాయి.
నివారణకు జాగ్రత్తలు
-మొదటగా మొటిమలను గిల్లడం, గిచ్చడం చేయకూడదు.
-గోరువెచ్చని నీటితో రోజుకు 4 నుండి 6 సార్లు శుభ్రపరచుకోవాలి.
-డాక్టర్ సలహా లేకుండా రకరకాల క్రీములను, లోషన్‌లను వాడకూడదు.
-సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
-్ఫస్ట్ఫుడ్స్, ఆయిల్‌ఫుడ్స్, స్వీట్స్, నిలువున్న ఆహార పదార్థాలు తినకూడదు.
-ప్రకృతి సిద్ధమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలను, ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి.
-మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
-ప్రతిరోజూ విధిగా కొంత సమయం యోగా, వ్యాయామం చేయడంవల్ల అధిక ప్రయోజనం పొందవచ్చు.
మందులు
మొటిమలకు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన మందులను ఈ క్రింద పొందుపర్చడం జరిగింది.
కాలిబ్రోమేటం: మొటిమలకు ఇది ముఖ్యమైన మందు. టీనేజ్‌లో వచ్చే అన్ని రకాల పింపుల్స్‌ను ఈ మందు తగ్గిస్తుంది. మొటిమలు ముఖంపై, ఛాతిపై వచ్చి చీము ఉండటం, దురదగా అనిపించడం ఈ మందులులో గమనించదగిన లక్షణం.
బెర్బెరిస్ ఆక్విఫోలియం: ఈ మందును మదర్ టించర్ రూపంలో దూదితో తీసుకుని మొటిమలపై పూతగా రాయాలి. అలాగే పోటెన్సీ రూపంలో లోనికి తీసుకోవటంవల్ల గరకుగా ఉన్న చర్మం నునుపుగా మారుతుంది. పింపుల్స్ త్వరగా తగ్గుతాయి.
ఆర్సినికం బ్రోమేటం: ఈ మందు కూడా యుక్తవయస్సు వచ్చే పింపుల్స్‌కు బాగా పనిచేస్తుంది. పింపుల్స్ ఎక్కువగా ముక్కుపై రావడం, ఎక్కువగా స్ప్రింగ్ సీజన్‌లో వస్తాయి. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
కార్బోవెజ్: ఆరంభ దశలో వచ్చే పింపుల్స్‌కు ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఎఖినీషియా: పింపుల్స్ ఇన్‌ఫెక్షన్‌కు గురై బాధిస్తున్నపుడు ఈ మందు మాత్రు ద్రావణాన్ని దూదితో తీసుకుని పైపూతగా రాయడంవల్ల ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది. ఈ మందు ఆంటిసెప్టిక్‌గా పనిచేసి ఇన్‌ఫెక్షన్ త్వరగా తగ్గిస్తుంది.
సైలీషియా కాల్కేరియా ఫ్లోర్: మొటిమలవల్ల ఏర్పడిన మచ్చలను ఈ మందులు తొలగిస్తాయి. ఇన్‌ఫెక్షన్ కూడా నివారిస్తాయి.
ఈ మందులే కాకుండా రస్‌టాక్స్, తూజా, బెల్లడోనా, లైకోపోడియం తదితర మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి మందులను వాడిన పింపుల్స్ బాధనుండి విముక్తి పొందవచ్చు.

No comments:

Post a Comment