Pages

Saturday, 30 August 2014


లివర్‌కు వరం.. ‘కీహోల్’ విధానం

  • -డా.టామ్ చెరియన్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్
  •  
  • 27/08/2014
==========
లివర్ శస్తచ్రికిత్సలు చాలా కష్టతరమైనవి. ఎవరుపడితే వారు చేయలేరు. అందుకు ఎంతో పరిజ్ఞానం ఉండాలి. ఈఅవయవం ద్వారా ఎంతో రక్తం ప్రసరిస్తుంటుంది. అందుకు రక్తస్రావం ఎక్కువకాకుండా శస్తచ్రికిత్స చేయాలి. అలాగేలివర్‌కి ఎన్నో అనుసంధానాలుంటాయి. అవేవీ దెబ్బతినకుండాను చేయాల్సి ఉంటుంది. అందుకే కీహోల్ సర్జరీ మిగతా అవయవాలకు పదిహేనుసంవత్సరాల క్రితమేప్రారంభమైనా, లివర్‌కి ఇప్పుడు ప్రారంభమైంది
==========
గాల్‌బ్లాడర్స్ తొలగించడం దగ్గర నుంచి హెర్నియా శస్త్ర చికిత్స వరకు ఇప్పుడు కీహోల్ ద్వారానే చేస్తున్నారు. ఇలా కీహోల్‌తో చేయడం వల్ల గాయం త్వరగా మానుతుంది. ఆసుపత్రిలో ఎక్కువ రోజులుండక్కరలేదు. ఖర్చు తగ్గుతుంది. ఇన్‌ఫెక్షన్స్ ఉండవు. అందుకే పూర్తిగా కోసి చేసే శస్త్ర చికిత్సలు తగ్గిపోతాయి. ఇప్పుడు లివర్ శస్త్ర చికిత్సల్ని కూడా కీహోల్‌తో చేస్తున్నారు. ఇది ఆరోగ్య రంగం సాధించిన మరో ప్రగతి.
లివర్ శస్తచ్రికిత్సలు చాలా కష్టతరమైనవి. ఎవరుపడితే వారు చేయలేరు. అందుకు ఎంతో పరిజ్ఞానం ఉండాలి. ఈ అవయవం ద్వారా ఎంతో రక్తం ప్రసరిస్తుంటుంది. అందుకు రక్తస్రావం ఎక్కువ కాకుండా శస్త్ర చికిత్స చేయాలి. అలాగే లివర్‌కి ఎన్నో అనుసంధానాలుంటాయి. అవేవీ దెబ్బతినకుండాను చేయాల్సి ఉంటుంది. అందుకే కీహోల్ సర్జరీ మిగతా అవయవాలకు పదిహేను సంవత్సరాల క్రితమే ప్రారంభమైనా, లివర్‌కి ఇప్పుడు ప్రారంభమైంది. మరో విషయం గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు 3వేలకి పైగా కీహోల్ శస్త్ర చికిత్సలు విజయవంతమయ్యాయి. ఈ మధ్యనే హైదరాబాద్‌లో లివర్ కీహోల్ శస్త్ర చికిత్సల్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆ నైపుణ్యాన్ని సంపాదించగలిగారు. కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాలి. ఏమాత్రం నైపుణ్యం, మంచి అనుభవం లేనివారితో శస్త్ర చికిత్సలు చేయించుకోకూడదు.
ఈ కీహోల్ శస్త్ర చికిత్సలవల్ల నొప్పి తక్కువ, రక్తస్రావం తక్కువ, గాయం త్వరగా మానుతుంది. ఆసుపత్రిలో ఉండే రోజులు తక్కువ. ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ. మచ్చలుండవు.
రోగి పరిస్థితి లాంటి విషయాల్నిబట్టి విజయం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కీహోల్ శస్త్ర చికిత్సల్లో మరణం 0.3 శాతం కన్న తక్కువ అని 2009లో సేకరించిన గణాంకాలు చెబుతున్నాయి. ఓపెన్ శస్త్ర చికిత్సకన్నా కీహోల్ లివర్ శస్త్ర చికిత్సలో మరణం శాతం చాలా తక్కువ.
కంతి రకాన్ని బట్టి కీహోల్ సర్జరీ ఎలా చేయాలో నిర్ధారించుకుంటారు. కాన్సర్‌లకి ఈ చికిత్స ఎంతో ఉపయోగం. ముఖ్యంగా కొన్ని రకాల కాన్సర్‌లకు! గత ఏడు సంవత్సరాల గణాంకాల్ని పరిశీలించినప్పుడు లివర్ కాన్సర్‌ని తొలగించడానికి 58 శాతం కీహోల్ సర్జరీలనే విజయవంతంగా చేసారు. కీహోల్ సర్జరీలు సురక్షితం. పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ తక్కువ.
ఈ అధునాతన కీహోల్ సర్జరీ సరైన శిక్షణ పొందిన వారితోనే చేయించుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. వైద్యుడికి ఈ కీహోల్ సర్జరీలు చేయడానికి ముందు వందైనా ఓపెన్ మేజర్ లివర్ సర్జరీలు చేసిన అనుభవం ఉండి తీరాలి.
లివర్ కాన్సర్స్ తొలగించడానికి కీహోల్ శస్త్ర చికిత్సలు బాగా ఉపకరిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు లివర్ డోనార్ ఆపరేషన్‌ని కూడా కీహోల్ సర్జరీతో చేస్తున్నారు. ఇది డోనార్స్‌కి వరంలాంటిది. ఆధునిక శస్త్ర చికిత్సల్ని ఆహ్వానిద్దాం. కాకపోతే వాటిలో అనుభవం ఉన్నవాళ్ల దగ్గరకే వెళ్లి చికిత్స చేయించుకుందాం. లేకపోతే ఇబ్బంది పడడమే కాక నూతన విధానాలంటే ప్రజలు భయపడిపోతారు. లివర్ కాన్సర్‌లను ప్రారంభ దశలోనే గుర్తించగలగాలి. భయపడాల్సిన పనిలేదు. కీహోల్ ద్వారా కాన్సర్ భాగాన్ని తీసివేయవచ్చు. మరో రెండు నెలల్లో లివర్ మళ్లీ పూర్తిస్థాయికి పెరుగుతుంది. లివర్ లోపల కాన్సర్‌లుంటే లివర్ మార్పిడి శస్తచ్రికిత్సతో స్వస్థత చేకూర్చవచ్చు.

No comments:

Post a Comment