Pages

Saturday 30 August 2014


ప్రశ్న - జవాబు -- మలబద్ధకంతో బాధ

  • 27/08/2014
మలబద్ధకంతో బాధ
ప్ర:నా వయస్సు 39 సంవత్సరాలు. శారీరక శ్రమ లేకుండా, మలబద్ధకంతో బాధపడుతూ తరచుగా మలబద్ధకం నివారణ మాత్రలు వాడుతుంటాను. అలాగే తరచుగా మలవిసర్జన చేయాలనిపించడం, తీరా మలవిసర్జనకు వెళితే మలం సాఫీగా జరుగక బాధాకరంగా అనిపిస్తుంది. దగ్గరలో ఉన్న సర్జన్‌ను సంప్రదించగా పైల్స్ అని చెప్పారు. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు.
ప్రతాప్, గుడివాడ
జ: మీ సమస్యకు ‘నక్స్‌వామిక’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో మీరు వారం రోజులపాటు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున ఒక వారం పాటు వాడగలరు. అనంతరం ప్లాసిబో 30 అనే మందును ఉదయం 8, సాయంత్రం 8 గోళీల చొప్పున 15 రోజులపాటు వాడగలరు. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4 నుండి 5 లీటర్లు). ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. రోజూ మలవిసర్జన సాఫీగా జరుగునట్లుగా చూసుకోవాలి. మద్యం అతిగా సేవించుట, ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు, మాంసాహారం, చిరుతిండ్లు తినటం మానుకోవాలి. మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్ చేయాలి.
పొట్టలో నొప్పి-తేన్పులతో ఎలా?
ప్ర: నా వయసు 22 ఏళ్లు. నాకు పొట్టలో నొప్పి వుండి తేన్పులు ఎక్కువగా వస్తుంటాయి. తిన్న తర్వాత పొట్టలో నొప్పి ప్రారంభమవుతుంది. నేను మానసిక స్థాయిలో ఆందోళన చెందుతుంటాను. ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినా ఎవరైనా వస్తున్నారని తెలిసినా ఏదైనా పని తలపెట్టినా గందరగోళంలో పడిపోతాను. నా సమస్యకు సరైన సలహా ఇవ్వగలరు.
-చంద్రకాంత్, నల్గొండ
జ: మీ సమస్యకు ‘అర్జెంటం నైట్రికం-200’ అనే మందును రోజుకు 3సార్లు చొప్పున ఒక మూడురోజులు వాడగలరు. తరువాత రెండు వారాల పాటు ప్లాసిబో 30 అనే మందును ఉదయం, సాయంత్రం 6 గోళీల చొప్పున వాడితే మంచి ఫలితం వుంటుంది. అలాగే ఫాస్ట్ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి. ఆల్కహాలు అలవాటు వుంటే మానివేయాలి. నిలువ వుంచిన పచ్చళ్లు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. నీరు సరిపడినంత తాగాలి. మానసిక వత్తిడిని నివారించడానికి యోగ, మెడిటేషన్ వంటివి చేయాలి. టీ కాఫీలు మానివేయాలి. *

No comments:

Post a Comment