Pages

Saturday, 30 August 2014


సంజీవని

బంధాలతో ఆరోగ్యం పదిలం

  • డాక్టర్ ఎన్.బి.సుధాకర్ రెడ్డి - Psychologist nbsreddi@gmail.com
  •  
  • 27/08/2014
ఆత్మీయత, అనుబంధం అంతా ఒక బూటకం అంటుంటారు కొందరు. అయితే చక్కటి ప్రేమానురాగాలు, సామాజిక సంబంధాలు స్వంతం చేసుకున్నవారు దీర్ఘాయుష్కులుగా జీవిస్తున్నట్టు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. స్నేహ బంధాలు, కలివిడితనం ఖర్చులేని ఔషధంలా పనిచేస్తున్న దాఖలాలు ఉన్నాయి. మంచి ఇరుగు, పొరుగు ఉన్నవారు ఉల్లాసంగా, ఉత్సాహంతో పనిచేస్తుంటారన్నది కాదనలేని సత్యం. ఒంటరితనంతో ఉన్నవారికంటే జంటగా ఉన్నవారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటున్నారని పరిశోధకులు అంటున్నారు. సానుకూల సంబంధాలు కలవారిలో గుండెపోటు, ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలు వెల్లడించాయి. సామాజిక సంబంధాలవల్ల కలిగే ప్రయోజనాలపై ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాలు పరిశోధనలు పై విషయాలను ధృవీకరిస్తున్నాయి.
ఒత్తిడి తగ్గడమే అసలు రహస్యం
సామాజిక సంబంధాలవల్ల మానసిక ఒత్తిడి తగ్గడంవల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని మానసిక నిపుణులు విశే్లషిస్తున్నారు. ఆధునిక జీవన విధానంవల్ల సమాజంలో అధికశాతం వ్యక్తులు మానసిక ఒత్తిళ్ళకు గురవుతున్నారు. తీరికలేని పనులు, సరదాలు లేని ఉద్యోగాలు, పని ఒత్తిళ్ళు ఒంటరి బ్రతుకులు, ఇతర సమస్యలు ఒత్తిడికి కారణమవుతుంటాయి. భయం, ఆందోళన, అసంతృప్తి, విసుగు, సంఘర్షణ, ప్రతికూల భావాలు ఒత్తిడికి మూలాలుగా పరిణమిస్తుంటాయి. దీర్ఘకాలం కొనసాగే మానసిక ఒత్తిడివల్ల మానసిక శారీరక రుగ్మతలు తలెత్తుతుంటాయి. ఒత్తిడి తీవ్రత పెరిగితే డిప్రెషన్ తలెత్తుతుంది. దీంతో నిద్రాహారాలకు దూరమవుతాయి. నిరాశా నిస్పృహలు దగ్గరవుతాయి. ఆత్మహత్యాభావాలు చెలరేగుతాయి. అలాగే ఫోబియా, ఆందోళన, అబ్సెసివ్ కంపల్సిన్ డిజార్డర్ (ఒసిడి) భయాలు, భ్రాంతులు, ఉద్యోగ లోపాలు తలెత్తుతుంటాయి. మానసిక ఒత్తిళ్ళు శరీరాన్ని నిర్వీర్యం చేస్తుంటాయి. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో మనో శారీరక రుగ్మతలైన రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు, కీళ్ళనొప్పులు అల్సర్లు తదితర రుగ్మతలు బయటపడతాయి. దీంతోపాటు శృంగార లోపాలు తలెత్తి భార్యాభర్తల అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో మనిషి సుఖ సంతోషాలకు దూరమయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అలాగే ఆరోగ్య సమస్యలు తీవ్రమై అకాల మృత్యువాత పడవలసి వస్తుంది. అయితే మంచి సంబంధ బాంధవ్యాలు నిర్వహించేవారిలో మానసిక ఒత్తిళ్ళు తగ్గిపోతాయి. తమకు ఎదురయ్యే సమస్యలు బాధలను ఆత్మీయులతో పంచుకుంటే వాటి తీవ్రత తగ్గిపోతాయి. పైగా నలుగురితో చర్చించడంవల్ల సమస్యలకు పరిష్కారం దొరికి ఒత్తిడి తగ్గిపోతుంది. *

No comments:

Post a Comment