Monday, 6 July 2015

Rangeela puri

రంగీలా పూరీ

Rangeela_Poorisకావలసిన పదార్థాలు...
గోధుమ పిండి - 500 గ్రాములు
పసుపు - కొద్దిగా
ఆయిల్‌ - ఫ్రై చేసేందుకు సరిపడినంత
ఉప్పు - రుచికి తగినంత
టొమాటో జ్యూస్‌ - 100 గ్రాములు
పాలకూర గుజ్జు - 4 టేబుల్‌ స్పూన్లు
నెయ్యి - వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం...
గోధుమ పిండి జల్లించి మూడు ముద్దలుగా చేయాలి. ఒక్కో భాగంలో ఒక్కో రంగు వచ్చేలా... టొమాటో జ్యూస్‌, పసుపు, పాలకూర గుజ్జు కలపాలి. తరువాత ఒక్కో ముద్దకు తగినన్ని నీళ్లు కలిపి పూరీ పిండిలా చేయండి. పసుపు ముద్దను పొడవుగా, చూపుడు వేలు మందంలో తాడులా చేయండి. తరువాత పాలకూర కలిపిన పిండిని, దానికన్నా కొంచెం పెద్దగా చేసి, అట్టకర్రతో వత్తి పసుపు రంగు ఉన్న పిండి చుట్టూ పూర్తిగా చుట్టండి. వీటిపైన టోమాటో జ్యూస్‌ కలిపిన పిండిని పై రీతిలోనే చుట్టాలి. ఇలా చేసేటప్పుడు పూరీ పిండి మధ్యలో పసుపు రంగు వచ్చేలా చూసుకోవాలి. దీన్ని ముక్కలుగా చేసి పూరీల్లో వత్తి, నూనెలో పొంగేలా వేయించాలి. రంగు రంగు రంగీలా పూరీ సిద్ధం. 


No comments:

Post a Comment