Pages

Friday, 19 June 2015

Telugu Jokes


షార్ట్‌హ్యాండ్‌ 
మా ఆయన ఈ మధ్య మరీ తెలివి మీరిపోతున్నారు తెలుసా చెప్పింది రాధ ఏమయ్యిందే ఎందుకిలా అంటున్నావు ఆరా తీసింది అమల.
నాకు షార్ట్‌ హ్యాండ్‌ తెలియదన్న ధీమాతో ఆయన స్టెనోకి షార్ట్‌ హ్యాండ్‌లో ప్రేమ లేఖలు రాస్తున్నాడు.
ముడతలు
కుమార్‌: మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవ పడడం లేదు
రమేష్‌: ఆమెతో ఏమన్నావేమిటి?
కుమార్‌: నువ్వు కోప్పడ్డినప్పడల్లా నీ ముఖం పై ముడతలు కనిపిసున్నాయని అన్నానంతే. 
చెంపకాయ
రాము: ఆస్పత్రిలో పన్ను పీకడానికి వంద రూపాయలట నేను చీప్‌గా పన్ను పీకమన్నాను.
సోము: ఎలా పీకాడేంటీ?
రాము: నర్స్‌ చేత చెంప మీద ఒక్కటి కొట్టించి పాతిక రూపాయలు తీసుకున్నాడు.
జలాంతర్గామి
మా తమ్ముడు జలాంతర్గామిలో పని చేసేవాడు వాణ్ణి ఉద్యోగంలోంచి సస్పెండ్‌ చేశారు అన్నాడు బాధగా చక్రి.
దేనికి? అడిగాడు సుధీర్‌
వాడిది వేడి శరీరం. గాలి కావాల్సినప్పుడుల్లా కిటికీిిలు తెరవడం వాడి అలవాటు అందుకే ! చెప్పాడు దిగులుగా చక్రి.
జైలు భోజనం 
ఎల్లమ్మ: భోజనం బాగోలేదంటూ అబ్బాయి ఉత్తరం రాశాడండి.
తిక్కన్న: అలాంటప్పుడు వేరే హోటల్‌ కెళ్లి తినొచ్చు కదా?
ఎల్లమ్మ: అలా తినడం జైల్లో కుదరదటండి.
హిస్టరీ
ఇంట్లో ఒక్క క్షణం ఉండలేకపోతున్నాను బాధగా చెప్పాడు రమేష్‌
ఏం రా ఏమయింది? అడిగాడు సుందర్‌
నా భార్యకు కోపం వస్తే హిస్టారికల్‌గా అరుస్తోంది.
హిస్టారికల్‌ కాదు.. హిస్టీరికల్‌ సవరించాడు సుందర్‌
అది కాదు రా నా గతన్నంతా తవ్విస్తోంది
నీరసంగా చెప్పాడు రమేష్‌
ప్రమోషన్‌
మా బాస్‌ నాకు ప్రమోషన్‌ ఇచ్చారు తెలుసా? చెప్పాడు భర్త
''అవునా ఆఫీసులో చాలా బాగా పని చేస్తున్నటున్నారే అడిగింది భార్య
కాదే ఆయన ఇంట్లో పని చేసినందుకే ప్రమోషన్‌ ఇచ్చాడే.
అసలు విషయం చెప్పాడు భర్త బాధగా.
ఫీజు 
న్యాయమూర్తి: మామూలు తాళంతో బాటు కాంబినేషన్‌ లాక్‌ ఉన్న ఆ బీరువాను నువ్వు ఎలా తెరవగలిగావు.....?
ముద్దాయి:(కాస్త సందేహిస్తూ) ఇలాంటి కిటుకులు చెప్పడానికి సాధారణంగా వెయ్యి రూపాయలు వరకూ ఫీజు తీసకుంటా...
ఓరి గాడిద!
టీచర్‌ ః మనిషికి గాడిదకు తేడా ఏంటి?
స్టూడెంట్‌ ః మనిషి గాడిదవగలడు కానీ, గాడిద మనిషి కాలేదు సార్‌.
టీచర్‌ ః ఓరి గాడిదా!
స్టూడెంట్‌ ః చూశారా సార్‌. నేను చెప్పింది నిజమే.

సెల్‌ సామెతలు
ఎఎంత చెట్టుకు అంతగాలి - ఎంత రీచార్జీకి అంత టాక్‌టైం.
ఎపిండికొద్ది రొట్టే - ఫోన్‌ కొద్ది ఫీచర్స్‌.
ఎముందొచ్చిన కొమ్ములకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి - ఇంట్లో ల్యాండ్‌ ఫోన్‌ కన్నా చేతిలో సెల్‌ఫోన్‌ పైనే మోజెక్కువ.
ఎఆరిపోయే దీపానికి వెలుగెక్కువ - చైనా పీసుకి స్టాండ్‌ బై ఎక్కువ.
ఎపిట్ట కొంచెం కూత ఘనం - మొబైల్‌ చిన్నది, మెమొరీ గొప్పది.

చీకటి
ఇద్దరు ఫ్యాక్టరీ వర్కర్స్‌ ఇలా మాట్లాడుకుంటున్నారు.
మొదటివాడు: నేను ఎలాగైనా ఓనర్‌ చేత ఇవ్వాళ సెలవు ఇప్పించుకుంటా.
రెండవవాడు: అదెలాగా?
(ఇంతలో ఆ ఫ్యాక్టరీ ఓనర్‌ రావడం గమనించి మొదటివాడు ఫ్యానుకి వేలాడుతుంటాడు.)
యజమాని: అక్కడేం చేస్తున్నావ్‌?
మొదటివాడు: నేను లైటుని....
యజమాని: నీకు పనెక్కువ చెయ్యడం వల్ల బుర్ర పాడైనట్టుంది గానీ ఇంటికి వెళ్లి రెస్ట్‌ తీసుకో.
రెండవవాడు కూడా మొదటివాడిని అనుసరిస్తూ బయలుదేరాడు.
యజమాని: నువ్వెక్కడికిరా?
రెండవవాడు: ఇంటికి వెళ్తున్నా అయ్యగారు. నేనీ చీకటిలో పనిచెయ్యడం నా వల్ల కాదు.

ఒకటే పాట
తండ్రి: డాక్టర్‌గారు.. డాక్టర్‌ గారు! ఏమైందో ఏమో కానీ, నిన్నట్నించి మావాడు ఒకే పాటను మాటిమాటికీ పాడేస్తున్నాడు. ఆ పాట వినలేక చస్తున్నాం.
ఆస్పత్రిలో కుర్రాడి ఛాతీ, ఉదరం పరిశీలించాడు డాక్టర్‌.
డాక్టర్‌: మీవాడు సెల్‌ఫోన్‌ మింగాడయ్యా. దానికి ఫోన్లు వచ్చినపుడల్లా కడుపులో రింగ్‌టోన్‌ మోగుతోంది. కొన్నాళ్లు ఫోన్లు రాకుండా చూడండి.

బామ్మ -కుక్కపిల్ల
ఆఫీసు పని మీద నెల రోజులు క్యాంపువెళ్ళిన జంబు లింగానికి ఫోన్‌ చేశాడు కొడుకు సోమ లింగం.
''అందరూ బాగున్నారు కదా!'' అడిగాడు తండ్రి జంబు లింగం.
''మన కుక్క పిల్ల చనిపోయింది నాన్నా'' చెప్పాడు కొడుకు.
షాక్‌ తిన్నాడు జంబు లింగం. మెల్లిగా తేరుకొని ''ఇలాంటి వార్తలను ఒక్కసారిగా చెప్పకూడదు. ముందు కుక్క పిల్ల గోడెక్కింది అని చెప్పాలి. తరువాత అక్కడి నుండి పడింది. కాలు విరిగింది హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. లాభం లేకపోయింది. అని మెల్లగా చెప్పాలి. సర్లే ఏం చేస్తాం. ఇంతకీ బామ్మ ఎలా ఉంది'' అడిగాడు జంబులింగం.
ఒక్క క్షణం ఆలోచించి ''బామ్మ గోడెక్కింది నాన్నా!'' చెప్పాడు సోమలింగం.

మండే సూర్యుడు
ప్రసాద్‌, సూర్య మగధీర సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.
అందులో అఘోరా చెప్పిన డైలాగ్‌ని సూర్యతో చెబుతున్నాడు ప్రసాద్‌.
''వాడు మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు...''
ఇంతలో...
''మరి ట్యూస్‌డే ఎలా ఉంటాడు?'' అడిగాడు సూర్య. 
ఒళ్ళు మండిన ప్రసాద్‌ నువ్వింకొక నాలుగొందలేళ్లయినా మారవా అన్నాడు.
జీరో
తండ్రి: ఏరా జీరో మార్కులోచ్చాయన్న బాధైనా లేకుండా శుభ్రంగా ఆడుకుంటున్నావు?
కొడుకు: మన పీఎం మోడీ గారికే జీరో మార్కులొచ్చాయి నాన్నా. ఆయనేమైనా బాధపడుతున్నాడా చెప్పు?
ఆటగాడు
''మంచి ఆటగాడు అని చెపితే ఏదో పెద్ద ప్లేయరు అని పెళ్లి చేసుకున్నా తీరా చేసుకున్న తరువాత తెలిసింది'' విచారంగా అంది సుమలత
''ఏమైంది? మరి ఆటగాడు కాదా అతను'' అడిగింది శ్రీదేవి.
''ఆటగాడే....పేకాటలో నెం1 అట. ఏడ్చింది సుమలత.
రోలు వేశాను
మొన్న రిలీజైన కొత్త సినిమాలో ఒక రోలు వేశానన్నావు.
ఫస్ట్‌డే - ఫస్ట్‌ షో చాలా జాగ్రత్తగా చూశాను.ఎక్కడా
కనిపించలేదే?''
''పిచ్చోడా? ఆ సినిమాలో హీరోయిన్‌ పెళ్ళి సీన్‌లో పేరంటాళ్లు దంచిన పసుపు ''రోలు'' సెట్లో వేసిందెవరకున్నావు నేనే.
అన్నిటా ఫస్టే
ఒరే శేఖర్‌ బాగా చదువుతున్నావట్రా అడిగాడు తండ్రి
బాగానే చదువుతున్నాను. డాడీ నాకన్నీ ఫస్టు మార్కులే.
గుడ్‌ అలా చదవాలి.
ఇంతకీ ఏఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయి? అడిగాడు తండ్రి.
'ఇంగ్లీషులో ఒకటి. తెలుగులో ఒకటి. లెక్కలో ఒకటి. సైన్స్‌లో ఒకటి.
ఇలా అన్ని సబ్జెక్టుల్లో ఫస్టు మార్కులే డాడీ!
స్వీటు
శాంతం: ఏమే కాంతం మీ అబ్బాయి మావాడి చేత రాళ్ళు తినిపిస్తున్నాడు చూశావా?
కాంతం: నిక్షేపం లాంటి మైసూరు పాక్‌ ముక్కల్ని పట్టుకుని రాళ్శంటారేమిటి?
డబ్బు-అనుభవం
''అనతి కాలంలోనే ధనవంతుడిగా ఎలా అయ్యావ్‌?'' అడిగాడు రాజు.
''ఒకతని పార్టనర్‌గా చేరాను. అతని దగ్గర డబ్బుండేది. నా దగ్గర 
అనుభవముండేది. అందుకే రిచ్‌ మ్యాన్‌ అయ్యాను!''
''అదే ఎలా? అర్థమయ్యేలా చెప్పు'' మళ్లీ ప్రశ్నించాడు రాజు.
''ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది...అతని దగ్గర అనుభవం ఉంది..!'' అసలు విషయం చెప్పాడు తాపీగా.
ఎక్కడికి?
బాటసారి: బాబూ ! ఈ రోడ్డెక్కడికిపోతుంది!
వ్యక్తి: తిన్నగా పోతే దక్షిణానికి . అటు తిన్నగా పోతే ఉత్తరానికి, తర్వాత తూర్పుకు, ఆఖరకు పడమరకు తిరిగి చివరకు ఇక్కడికే వస్తుంది బాబూ!
చోరీ
(పరీక్ష హాల్లో ఒక విద్యార్థిని చూసి )
ఇన్విజిలేటర్‌: పరీక్ష రాయకుండా ఏడుస్తున్నావేంటి బాబూ?
విద్యార్థి: (మరింత బిగ్గరగా ఏడుస్తూ) నేను కష్టపడి రాసి తెచ్చుకున్న స్లిప్పులు ఎవరో కొట్టేశారు సారు...
ప్లానింగ్‌
అప్పారావు: (ఆఫీసర్‌తో) ఈమె నా భార్య సార్‌ ..మంచి ప్లానింగ్‌ ఉంది. ఇవాల్టి పనిని నిన్ననే చేస్తుంది.
సుబ్బారావు: (ఆఫీసర్‌) వెరీగుడ్‌.... భోజనం చాలా బాగుందమ్మా.
అప్పారావు: వంట కూడా అంతే సార్‌. ఇవాళ మిమ్మల్ని పిలిచానని చెప్పగానే నిన్నే చేసేసింది!
సుబ్బారావు: ఆ!!!


అసలు విషయం
(ఎమ్‌.ఎమ్‌.టి.సిలో ఒక ముసలావిడ రోజు ఒక కాలేజ్‌ కుర్రాడికి రోజు 4-5 డ్రై ప్రూట్స్‌ ఇస్తూ ఉంటుంది. ఆ కుర్రాడు వాటిని తీసుకునే వాడు)
ఒక రోజు కుర్రాడికి బాగా ఉత్సుకత పెరిగి రోజు ఇలా డ్రై ప్రూట్స్‌ ఎందుకిస్తున్నావని ఆ ముసలావిడని అడిగాడు.
అందుకావిడ కొంచెం ఎమోషనల్‌గా మొహం పెట్టి
నాకు క్యాడ్‌బెర్రి డ్రై ప్రూట్స్‌ అంటే బాగా ఇష్టం కానీ వాటిని నమలాలంటే నాకు పళ్ళన్నీ ఊడిపోయాయి.
చాక్లెట్‌ చీకేసి నీకు డ్రై ప్రూట్స్‌ ఇస్తాను అంటు చల్లగా అసలు విషయం చెప్పింది.


మందుబాబులు
ఇద్దరు స్నేహితులు బాగా మందు కొట్టి కార్లో తిరిగి వెళ్తున్నారు. కారు దూసుకుపోతుంది. శశాంక్‌ అరవడం మొదలు పెట్టాడు. చూడు స్తంభం ...ముందు చూసుకో స్తంభం.. జాగ్రత్త రేరు..బండి తిప్పు..తిప్పరా! అని అరిచాడు. అయినా కారు స్తంభానికి గుద్దుకుంది. శశాంక్‌ ఆసుపత్రి పాలయ్యాడు. తెల్లారి స్నేహితుడు శశాంక్‌ను పలకరించడానికి వచ్చాడు.
'నేను చెబుతూనే ఉన్నానా కారు తిప్పమని' అంటూ కోప్పడ్డాడు శశాంక్‌.
'నేనెలా తిప్పనురా నువ్వు డ్రైవ్‌ చేస్తుంటే' అన్నాడు ఆ మిత్రుడు.


సియం 
ఒక కామన్‌మేన్‌ చేపను పట్టి తెచ్చి భార్యకిచ్చి వండమంటాడు. 
భార్య: గ్యాస్‌ లేదు, కిరోసిన్‌ లేదు, కరెంటు లేదు, నూనె లేదు ఎలా వండేది?
కామన్‌మేన్‌ చేపను తీసుకెళ్లి మళ్ళీ చెరువులోనే చేపలు వదిలేస్తాడు.
చేప ఒడ్డుకొచ్చి... గట్టిగా 'సియం (కామన్‌ మేన్‌)కిజై! సియం కి జై! అరుస్తుంది

స్నేహితుడు
పున్నారావు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌లో ఉన్నాడు. బంధువులంతా చుట్టూ చేరారు. పక్కనే ఉన్న స్నేహితుడికి సైగ చేసి ఒక పెన్నూ పేపర్‌ తెమ్మన్నాడు. సరే ఏదో చివరి కోరిక నోటితో చెప్పలేక రాసి చూపిస్తాడని తెచ్చి ఇచ్చారు. అతి కష్టం మీద రెండు వాక్యాలు రాసి ప్రాణాలు విడిచాడు పున్నారావు.
సరే చనిపోయిన వెంటనే దాన్ని చదవడం ఎందుకని జేబులో పెట్టుకున్నాడు. దహన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆయన ఇంటికొచ్చి అందులో ఏం రాశాడో చదవాలని మడత విప్పి చదివాడు అందులో 
''నా తల దగ్గర కూర్చున్నాయన నా ఆక్సిజన్‌ ట్యూబ్‌ మీద కూర్చున్నాడు, నాకు ఊపిరి ఆడటం లేదు'' అని వుంది. 

అర్ధ రూపాయి
భిక్షగాడు: గుడ్డివాణ్ణి ఓ అర్ధరూపాయి దానం చేయండి బాబయ్య.
వ్యక్తి: నువ్వు గుడ్డివాడివేంటి? నీకు ఒక కన్ను
బాగానే ఉందే? 
భిక్షగాడు: అయితే పావలా ధర్మం చేయండి బాబ.
కరెంట్‌ పోతే!
అమెరికాలో కరెంటు పోతే వాళ్ళు కరెంటాఫీస్‌కు ఫోన్‌ చేస్తారు.
జపాన్‌లో కరెంటు పోతే వాళ్ళు మొదట ఫ్యీజు చెక్‌ చేస్తారు.
అదే మన దేశంలో కరెంటు పోతే పక్కింట్లో చెక్‌ చేస్తాం.
ఓహో అందిరింట్లో పోయిందా.. ఐతే ఒకే..


బ్యాలన్స్‌
చలపతి: హలో... కస్టమర్‌ కేరా?
కస్టమర్‌ కేర్‌: అవును చెప్పండి సార్‌, నేను మీకెలాగ ఉపయోగపడగలను?
చలపతి: సార్‌! మా వాడు సిమ్‌ కార్డు మింగేశాడండీ..
క.కే: అయ్యో! కానీ దానికి నేనేం చేయగలనండి?
చలపతి: ఆ సిమ్‌కార్డులో వంద రూపాయల బ్యాలన్స్‌ ఉంది.
క.కే: ఐతే నేనేం చేయగలనో చెప్పండి సార్‌!
చలపతి: ఏం లేదు. వాడు మాట్లాడుతుంటే బ్యాలన్స్‌ కట్‌ అవుతుందా? 
క.కే: ఆ!!!!!!

ఫ్రిజ్‌
(ఓ కొంటె కుర్రాడు ఒక తెలియని నెంబరుకు కాల్‌ చేస్తాడు)
కుర్రోడు: హెల్లో, ఇంట్లో ఫ్రిజ్‌ ఉందా.
సమాధానం: హ , ఉంది.
కుర్రాడు:నడుస్తుందా.
సమాధానం: హ నడుస్తుంది.
కుర్రోడు: గట్టిగా పట్టుకోండి, లేకపోతే పారిపోతుంది.
(ఫోన్‌ పెట్టేస్తాడు. కొంతసేపయ్యాక మళ్లీ ఫోన్‌ చేసి)
కుర్రోడు: హెల్లో, ఇంట్లో ఫ్రిజ్‌ ఉందా?
సమాధానం: లేదు 
కుర్రోడు: ఇందాకే చెప్పా కద పట్టుకోమని. చెబితే వింటే కదా!

టైం వేస్ట్‌
(ఒక ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి ఎలాంటి పని లేకుండా నేల చూపులు చూస్తుంటాడు)
ఫ్యాక్టరీ సిఇఒ: నీ జీతం ఎంత ?
వ్యక్తి: ఆరు వేలు సారు.
సిఇఒ: నేను వర్కర్లకు జీతం ఇచ్చేది పని చెయ్యడానికి. టైం వేస్ట్‌ చెయ్యడానికి కాదు. ఇదిగో 18,000. మూడు నెలల జీతం. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు.
(ఆ వ్యక్తి డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోతాడు) 
సిఇఒ: (మిగతా వర్కర్లతో) ఎవరా వ్యక్తి?
వర్కర్లు: అతను పిజ్జా బారు సార్‌.

పోలిక 
తల్లి: ఏమైందమ్మా ఎందుకంత డల్‌గా ఉన్నావు?
కూతురు: అమ్మా నేను
పిచ్చిదానిలా ఉంటానా?
తల్లి: లేదే!
కూతురు: నా ముక్కు చింతపిక్కలా ఉంటుందా?
తల్లి: లేదమ్మా
కూతురు: నేనే ఓదరు కప్పలా ఉంటానా?
తల్లి: లేదే, ఇంతకి ఎవరేమన్నారు నిన్ను?
కూతురు: మరి అందరూ నన్ను మీ అమ్మలా ఉన్నా వంటారెందుకు?
తల్ల్లి: ఆ......


No comments:

Post a Comment