Pages

Friday, 19 June 2015

Crocodile in Indian city roads..

న‌డిరోడ్డు పై ముస‌లి : అదిరిప‌డిన అధికారులు

బెంగళూరు: నిత్యం నిర్లక్షంగా వ్యవహరించే బీబీఎంపీ అధికారులు, సిబ్బందికి ఒక కళాకారుడు చుక్కలు చూపించాడు. నడి రోడ్డు మీద కేవలం ఒక్క పెయింటింగ్ వేశాడు. అంతే బీబీఎంపీ అధికారులు పరుగున వచ్చి ఆ ప్రాంతంలోని గుంతలను పూడ్చి వేశారు.
బెంగళూరు నగరంలోని సుల్తాన్ పాళ్యలో మెయిన్ రోడ్డు పక్కన 12 అడుగుల పెద్ద గొయ్యి ఉంది వర్షా కాలం వస్తున్నదని, పిల్లలు స్కూలుకు వెళుతున్నారని, ప్రమాదవశాత్తు ఈ గుంతలో పడితే ప్రాణాలకే ప్రమాదమని స్థానికులు బీబీఎంపీ అధికారులకు అనేక సార్లు మనవి చేశారు.అయితే ఎప్పటిలాగే బీబీఎంపీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేశారు. తరువాత చూద్దాంలే అనుకున్నారు. ఈ విషయం కళాకారుడు బాదల్ నంజుండస్వామి చెవిలో పడింది. అంతే ఆయన గురువారం సుల్తాన్ పాళ్య మెయిన్ రోడ్డు దగ్గరకు వెళ్లాడు.
పెద్ద గొయ్యి ఉన్న చోట ఒక పెయింటింగ్ వేశాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో సంచరించే వాహన చోదకులు సైతం నంజుండ స్వామికి సహకరించారు. పెయింటింగ్ పూర్తి అయ్యింది. నడి రోడ్డు మీద ఒక మొసలి ఈత కొడుతున్నట్లు ఉన్న ఆ చిత్రం చూసి అందరూ ఆశ్చర్య పోయారు.దానిని ఫోటో తీసిన నంజుండస్వామి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఆ పెయింటింగ్ ఎందుకు వెయ్యవలసి వచ్చిందో వివరించాడు. అంతే ఫేస్ బుక్ లో, సోషల్ మీడియాలో బీబీఎంపీ అధికారుల పని తీరుపై మండిపడ్డారు. వేల సంఖ్యలో విమర్శలు వచ్చాయి.
శుక్రవారం బీబీఎంపీ అధికారులు సుల్తాన్ పాళ్యకు పరుగు తీశారు. 12 అడుగుల గుంతతో పాటు ఆ పరిసర ప్రాంతాలలోని గుంతలను పూడ్చి వేశారు. నంజుండస్వామి తీసుకున్న చొరవను పలువురు అభినందించారు.

No comments:

Post a Comment