Pages

Wednesday, 6 May 2015

Telugu tips for Beautiful home

ఇల్లు అందంగా ఉండాలంటే.. 
ఇల్లు పరిశుభ్రంగా, అందంగా ఉండాలంటే కొన్ని టిప్స్‌ తప్పకుండా పాటించాలి. అవి...
- ఇంట్లో దుమ్ము చేరకుండా చూసుకోవాలి. దుమ్ము లేకుండా ఉండాలంటే ఇంట్లో ఎక్కువ సామాను చేర్చకూడదు.
- బెడ్‌ రూములో పక్కమీద బట్టలన్నీ చెల్లాచెదురుగా పడేస్తుంటారు కొందరు. అలసిపోయి బెడ్‌ మీద నడుం వాల్చాలని వచ్చిన వారికి ఆ సీను ఎంతైనా కోపం తెప్పిస్తుంది. అందుకే బెడ్‌ మీద బట్టలు చిందరవందరగా పడేయొద్దు. విడిచిన బట్టలను విడిగా ఒక టబ్‌లో పడేయడం అలవాటుచేసుకోవాలి.
- వంటిల్లు విషయానికి వస్తే ఎంగిలి ప్లేట్లు, అంటగిన్నెలను సింకులో ఎక్కువ సేపు ఉంచితే వంటిల్లు శుభ్రంగా ఉండదు. అందుకని అంట ప్లేట్లను, గిన్నెలను ఎప్పటికప్పుడు కడిగేసి పొడిగుడ్డతో తుడిచి రాక్స్‌లో పెట్టుకోవాలి.
- మనం రోజులో ఎక్కువ సేపు గడిపేది లివింగ్‌రూములోనే . అందుకని ఆ గదిలో సహజంగానే దుమ్ము ఎక్కువగా చేరుతుంది. అందుకే రోజూ రాత్రి పడుకోబోయే ముందర లివింగ్‌ రూమ్‌లోని సోఫాపై, కుర్చీలపై పరిచిన గుడ్డలను బాగా దులపాలి. వారానికొకసారి దిండు కవర్లను మార్చాలి. లివింగ్‌రూమ్‌లోని కాఫీ టేబుల్‌ మీద పడిన కాఫీ మరకలు, టీమరకలు, కూల్‌డ్రింకు మరకలను గుడ్డపెట్టి బాగా తుడిచేయాలి. అంతేకాదు వీధుల్లో నడిచిన చెప్పులతోనే ఇంట్లో నడవొద్దు. ఇలా చేయడం వల్ల హాలులో పరిచిన కార్పెట్‌ మీద దుమ్ము చేరుతుంది. చెప్పులకంటుకున్న దుమ్ము వల్ల ఫ్లోర్‌ మీద గీతలు పడే అవకాశం ఉంటుంది.
- బాత్‌రూములను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సబ్బును స్టాండులో పెట్టకుండా కిందపెట్టేయడం, విడిచిన బట్టలు దండెంమీద అలాగే ఉంచడం, టూత్‌పేస్టు మూత తీసి పక్కనపడేయడం, బాత్‌రూమ్‌ను సబ్బు నురగతో వదిలేయడం వంటివి కూడా మంచి అలవాట్లు కావు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో బాత్‌రూమ్‌ను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే రకరకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కనీసం రెండు మూడు రోజులకొకసారి బాత్‌రూమ్‌ను బాక్టీరియాలేమీ ఉండకుండా శుభ్రంగా కడగాలి. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు బాత్‌రూమ్‌ గోడలపై సబ్బు, షాంపు మరకలు పడకుండా కడిగేస్తుండాలి

No comments:

Post a Comment