Wednesday 28 January 2015

Kidney stones - Solutions with Auyarveda



కిడ్నీలో రాళ్లు అనగానే చాలా మంది ఆపరేషన్‌కు పరుగెత్తుతారు. నిజానికి రాళ్లు ఏర్పడే శరీరతత్వం మారనంత వరకు ఆపరేషన్‌ చేసినా రాళ్లు తిరిగి ఏర్పడుతూనే ఉంటాయి. అయితే శరీరతత్వాన్ని మార్చే చికిత్స ఆయుర్వేదంలో ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసినపుడు ఆయుర్వేద చికిత్స తీసుకోవడం ద్వారా సులభంగా బయటపడవచ్చని అంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు డాక్టర్‌ మనోహర్‌.
గత 20 ఏళ్ల నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. సాధారణంగా 20 నుంచి 40 ఏళ్ల వయస్సు వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. ఆయుర్వేదానుసారం అశ్మరీ అనగా రాళ్లు. ఇవి మన శరీరంలో కిడ్నీల్లో, మూత్రాశయంలో, మూత్రనాళం నందు ఏర్పడతాయి. మూత్రవిసర్జనక్రియలో కిడ్నీలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మూత్రసంబంధ వ్యాధులలో అశ్మరీ ఒకటి(రీనల్‌ కాలిక్యులై).
వ్యాధి కారకాలు
 అధిక మాంసాహారం తీసుకోవడం
 పీచుపదార్థాలు తక్కువగా తీసుకోవడం
 మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం
 రక్తపోటు ఎక్కువగా ఉండటం
 అశ్మరీ ఏర్పడటానికి తోడ్పడే పదార్థాలు అనగా మెగ్నీషియం, సిట్రేట్‌, ఫాస్పేట్స్‌, ఆక్సిలేట్స్‌, కొన్ని రకాల డైయూరిటిక్స్‌, యాంటాసిడ్స్‌ వాడటం అధికమైనపుడు అశ్మరీ ఏర్పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 మూత్రంలో పీహెచ్‌ మార్పు వచ్చినపుడు, గౌట్‌ వ్యాధితో బాధపడే వారిలో కూడా అశ్మరీ ఏర్పడుతుంది.
వ్యాధి లక్షణాలు
 మూత్రవిసర్జన సమయంలో మంట, ఏదో అడ్డుపడినట్లుండటం, నొప్పి ఉంటాయి.
 రక్తం పడటం
 వాంతిరావడం, వచ్చినట్లుండటం
 చలితో జ్వరం
 కడుపు నొప్పి, నడుం నొప్పి
 నడుం నొప్పి వెనక భాగం నుంచి ఉదర కింది భాగం వరకు ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
 మంచి నీరు, బార్లీ నీరు తాగాలి.
 మాంసాహారం తక్కువగా తినాలి.
 పాలకూర, టమాటా, క్యాబేజీ, క్యాలిఫ్లవర్‌, పాలపదార్థాలు తగ్గించాలి.
 విటమిన్‌ సి, విటమిన్‌ డి ఉన్న పదార్థాల వాడకం తగ్గించాలి.
 నూనె పదార్థాలను తగ్గించాలి.
 ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవాలి. దినచర్యలో మార్పులు చేసుకోవాలి.
చికిత్స
అశ్మరీ సమస్యకు ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలున్నాయి. ఆయుర్వేదానుసారం ప్రత్యేక ఔషధ చికిత్సలున్నాయి. చికిత్సా కాలం అశ్మరీ పరిణామం బట్టి ఆధారపడి ఉంటుంది. చికిత్సను ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే అశ్మరీ వ్యాధిని పూర్తిగా నివారించుకోవచ్చు. అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నట్లయితే కిడ్నీలో రాళ్ల సమస్యను సులభంగా అధిగమించవచ్చు.

No comments:

Post a Comment