Pages

Wednesday, 28 January 2015

Diet for Pregnant women

గర్భిణులకు డైట్‌..

బిడ్డకు తల్లినవుతున్నానని తెలిసినపుడు ప్రతి సీ్త్ర ఎంతో ఆనందిస్తుంది. కానీ ఆ నవ మాసాలూ ఆరోగ్యవిషయంలో మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కడుపులో శిశువు పెరిగేటప్పుడు శారీరకంగా ఎన్నో మార్పులు సంభవిస్తాయి. ఆ సమయంలో పోషకవిలువలతో కూడిన ఆహారాన్ని వీళ్లు తీసుకోవాలి. శిశువు పెరుగుదలకు గర్భిణీలు ఎలాంటి డైట్‌ తీసుకోవాలో ఈ వారం తెలుసుకుందాం...
సీ్త్రలు గర్భం ధరించినపుడు కడుపులో పెరుగుతున్న శిశువుకి ఆహారం ఎక్కువగా అందాలి. ఇందుకోసం గర్భిణీలకు అదనపు శక్తి కావాలి. ఎక్కువ కాలరీలతో కూడిన ఆహారం వీళ్లు తీసుకోవాలి. రోజుకు ఎన్ని కాలరీలు తీసుకోవాలనేది వాళ్ల శరీర బరువు, చేస్తున్న వ్యాయామాలు, తినే ఆహారం బట్టి ఉంటుంది. టిష్యు సింథసిస్‌, యుటిరస్‌, బ్రెస్ట్‌, బ్లడ్‌ వాల్యూమ్‌ల పెరుగుదలకు ప్రొటీన్లు చాలా అవసరం. ప్రొటీన్లలో ఎమినో యాసిడ్స్‌, నైట్రోజన్‌ పుష్కలంగా ఉంటాయి. కడుపులో ఉన్న పిండం పెరుగుదలకు తల్లికి అదనపు శక్తి అవసరమవుతుంది. ఇందుకోసంగర్భిణీలు కాల్షియం బాగా తీసుకోవాలి. ఐరన్‌ కూడా వీళ్లకి చాలా అవసరం. ఐరన్‌ కడుపులో పెరుగుతున్న శిశువుకి ఆక్సిజన్‌ అందేట్లు చేస్తుంది. ఫోలిక్‌ యాసిడ్‌ కూడా గర్భవతులకు చాలా అవసరం. పేద, సంపన్న వర్గాలన్న తేడా లేకుండా గర్భిణీలందరూ తప్పనిసరిగా ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ సప్లిమెంట్లు తీసుకోవాలి. గర్భిణీలలో ఎక్కువమంది మార్నింగ్‌ సిక్‌నె్‌సతో బాధపడుతుంటారు. అలాంటి సందర్భాలలో ఉదయం డ్రైఫ్రూట్స్‌ తింటే మంచిది. బిస్కట్లు, ఇడ్లీ కూడా తినొచ్చు. నూనె పదార్థాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఇవి తొందరగా అరగవు. పచ్చికూరగాయలు, సగం ఉడికిన పదార్థాలు కూడా తినకూడదు. అలర్జీకి దారితీసే వేరుశెనగపప్పు లాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తినడం వల్ల ఆహారం అరగక జీర్ణశక్తి దెబ్బతింటుంది. గుండె ల్లో మంటలా అనిపిస్తుంది. ఆకలివేస్తోందని ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా రోజులో కొద్ది కొద్దిగా ఎక్కువ మార్లు తింటే మంచిది.
గర్భిణికి శాంపిల్‌ మెనూ 
 ఉదయాన్నే అయిదు బాదంపప్పులు, అయిదు ఖర్జూరం పళ్లు తినాలి.
 బ్రేక్‌ఫా్‌స్టగా ఒక ఎగ్‌ వైట్‌, రసం లేదా చట్నీతో రెండు ఇడ్లీలు తినాలి.
 మధ్యాహ్నం ఒక గ్లాసు పాలు తాగాలి. ఏదైనా ఒక పండు తినాలి
 భోజనంలో వెజ్‌సలాడ్‌, అన్నం, చిరుధాన్యాలతో చేసిన కూర, మజ్జిగ తీసుకోవాలి.
 స్నాక్‌గా వెజ్‌ చీజ్‌ శాండివిచ్‌ తినొచ్చు. దాంతోపాటు ఒక గ్లాసు పళ్లరసం తాగాలి.
 డిన్నర్‌లో ఒక కప్పు సూప్‌, గుడ్డు, రెండు పుల్కాలు, వెజిటబుల్‌ రైతా, ఫ్రూట్‌ సలాడ్‌లు తీసుకోవాలి

Childcare - homework

హోంవర్క్‌ చకచకా ఎలా?

ప్రతిరోజూ పిల్లలతో హోంవర్క్‌ పూర్తి చేయించడం తల్లిదండ్రులకు ఓ సవాల్‌గానే ఉంటుంది. తల్లిదండ్రులు సాధారణంగా ఎదుర్కొనే సమస్య ఇది. దీన్ని అధిగమించాలంటే ఈ సూచనలు ఫాలో అయిపోండి.
 ప్రతిరోజూ పిల్లలు స్కూల్‌ నుంచి రాగానే టీచర్లు ఏం చెప్పారు? చేయాల్సిన హోంవర్క్‌ ఏంటి? అనే విషయాలను తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలి.
 హోంవర్క్‌ చేసే సమయంలో పిల్లలకు చాలా సందేహాలు వస్తుంటాయి. అటువంటప్పుడు దగ్గరుండి వారి సందేహాలను నివృత్తి చేయాలి. దీంతో మరింత ఉత్సాహంగా హోంవర్క్‌ పూర్తి చేస్తారు.
 పిల్లలు నలుగురైదుగురు కలిసి ఒకేచోట కూర్చుని హోంవర్క్‌ చేసుకొనేలా చేస్తే మరీ మంచిది. ఒకరిని చూసి ఒకరు హోంవర్క్‌ కంప్లీట్‌ చేస్తారు.
 సమయంలోగా హోంవర్క్‌ కంప్లీట్‌ చేసుకోవాలని షెడ్యూల్‌ పెట్టాలి. దీనివల్ల పిల్లలకు షెడ్యూల్‌లో పనిపూర్తి చేసుకునే అలవాటు అబ్బుతుంది.
 పిల్లలు హోంవర్క్‌ చేసే సమయంలో పక్కన కూర్చుని ఫోన్‌ మాట్లాడటం చేయకూడదు. దానివల్ల వారి ఏకాగ్రత దెబ్బతింటుంది.
 గణితానికి సంబంధించి హోంవర్క్‌ చేసే సమయంలో పిల్లలకు బాగా సందేహాలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు మీరు సందేహాన్ని నివృత్తి చేసే సరి. లేదంటే ట్యూషన్‌ మాస్టారుతో లేదా క్లాస్‌ టీచర్‌తో మాట్లాడి సందేహాలు తొలగిపోయేలా చూడాలి.
 ఉదయం త్వరగా లేచి హోంవర్క్‌ పూర్తి చేస్తాను. ఇప్పుడు ఆడుకుంటాను అని పిల్లలు మారాం చేస్తుంటారు. కానీ పిల్లలు ఉదయం త్వరగా లేవరని గుర్తుపెట్టుకోవాలి. సాయంత్రం వేళలోనే హోంవర్క్‌ పూర్తయ్యేలా చూడాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల హోంవర్క్‌ విషయంలో
ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 

Kidney stones - Solutions with Auyarveda



కిడ్నీలో రాళ్లు అనగానే చాలా మంది ఆపరేషన్‌కు పరుగెత్తుతారు. నిజానికి రాళ్లు ఏర్పడే శరీరతత్వం మారనంత వరకు ఆపరేషన్‌ చేసినా రాళ్లు తిరిగి ఏర్పడుతూనే ఉంటాయి. అయితే శరీరతత్వాన్ని మార్చే చికిత్స ఆయుర్వేదంలో ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసినపుడు ఆయుర్వేద చికిత్స తీసుకోవడం ద్వారా సులభంగా బయటపడవచ్చని అంటున్నారు ఆయుర్వేద వైద్యనిపుణులు డాక్టర్‌ మనోహర్‌.
గత 20 ఏళ్ల నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. సాధారణంగా 20 నుంచి 40 ఏళ్ల వయస్సు వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. ఆయుర్వేదానుసారం అశ్మరీ అనగా రాళ్లు. ఇవి మన శరీరంలో కిడ్నీల్లో, మూత్రాశయంలో, మూత్రనాళం నందు ఏర్పడతాయి. మూత్రవిసర్జనక్రియలో కిడ్నీలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మూత్రసంబంధ వ్యాధులలో అశ్మరీ ఒకటి(రీనల్‌ కాలిక్యులై).
వ్యాధి కారకాలు
 అధిక మాంసాహారం తీసుకోవడం
 పీచుపదార్థాలు తక్కువగా తీసుకోవడం
 మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం
 రక్తపోటు ఎక్కువగా ఉండటం
 అశ్మరీ ఏర్పడటానికి తోడ్పడే పదార్థాలు అనగా మెగ్నీషియం, సిట్రేట్‌, ఫాస్పేట్స్‌, ఆక్సిలేట్స్‌, కొన్ని రకాల డైయూరిటిక్స్‌, యాంటాసిడ్స్‌ వాడటం అధికమైనపుడు అశ్మరీ ఏర్పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 మూత్రంలో పీహెచ్‌ మార్పు వచ్చినపుడు, గౌట్‌ వ్యాధితో బాధపడే వారిలో కూడా అశ్మరీ ఏర్పడుతుంది.
వ్యాధి లక్షణాలు
 మూత్రవిసర్జన సమయంలో మంట, ఏదో అడ్డుపడినట్లుండటం, నొప్పి ఉంటాయి.
 రక్తం పడటం
 వాంతిరావడం, వచ్చినట్లుండటం
 చలితో జ్వరం
 కడుపు నొప్పి, నడుం నొప్పి
 నడుం నొప్పి వెనక భాగం నుంచి ఉదర కింది భాగం వరకు ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
 మంచి నీరు, బార్లీ నీరు తాగాలి.
 మాంసాహారం తక్కువగా తినాలి.
 పాలకూర, టమాటా, క్యాబేజీ, క్యాలిఫ్లవర్‌, పాలపదార్థాలు తగ్గించాలి.
 విటమిన్‌ సి, విటమిన్‌ డి ఉన్న పదార్థాల వాడకం తగ్గించాలి.
 నూనె పదార్థాలను తగ్గించాలి.
 ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవాలి. దినచర్యలో మార్పులు చేసుకోవాలి.
చికిత్స
అశ్మరీ సమస్యకు ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలున్నాయి. ఆయుర్వేదానుసారం ప్రత్యేక ఔషధ చికిత్సలున్నాయి. చికిత్సా కాలం అశ్మరీ పరిణామం బట్టి ఆధారపడి ఉంటుంది. చికిత్సను ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే అశ్మరీ వ్యాధిని పూర్తిగా నివారించుకోవచ్చు. అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నట్లయితే కిడ్నీలో రాళ్ల సమస్యను సులభంగా అధిగమించవచ్చు.

Fresh skin - Beatroot

చర్మానికి ‘బీట్‌’ వేస్తే...

బీట్‌రూట్‌లో ఆరోగ్యాన్ని కాపాడే ఔషధగుణాలున్నాయి. నైట్రేట్‌ నిల్వలు అధికంగా ఉన్న బీట్‌రూట్‌ రసం తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది. శరీరంలో కొవ్వుశాతం తగ్గించి హార్ట్‌అటాక్‌ రాకుండా చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, క్యాన్సర్‌ కణితులని నిర్మూలిస్తుంది బీట్‌రూట్‌. బీట్‌రూట్‌ రసం నూతనోత్తేజాన్నిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఆరోగ్యంతో పాటు అందానికీ తోడ్పడుతుంది బీట్‌రూట్‌.
చర్మానికికాంతిని ఇవ్వడంలో బీట్‌రూట్‌ ‘రూటే’ వేరు. బీట్‌రూట్‌ ఫేస్‌ప్యాక్‌ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అదెలాగంటే...
కావాల్సిన పదార్థాలు
బీట్‌రూట్‌ రసం- రెండు టీ స్పూన్లు, పెరుగు - ఒక టీ స్పూన్‌, నిమ్మరసం- ఒక స్పూన్‌, శెనగపిండి- రెండు టీస్పూన్లు.తయారీ
ఒక గిన్నెలో బీట్‌రూట్‌ రసాన్ని తీసుకోవాలి. నిమ్మరసం, పెరుగు, శెనగపిండి వీలైతే ఒక స్పూన్‌ తేనె కూడా వేసి బాగా కలపాలి.
తయారుచేసుకున్న బీట్‌రూట్‌ పేస్ట్‌ని ముఖంపై రాయాలి. పావుగంట తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి.
మచ్చలు పోగొట్టేందుకు...
ఈ ప్యాక్‌ వేసుకోవడం వల్ల చర్మం మెరుపును సంతరించుకుంటుంది. చర్మంపై ఉండే నల్లమచ్చలు మాయమైపోతాయి. చిన్న చిన్న రంధ్రాలేమైనా ఉంటే పూడిపోతాయి. నెలకి రెండుసార్లు బీట్‌రూట్‌ ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే ముఖం కాంతివంతమవుతుంది.
ఆరు స్పూన్ల బీట్‌రూట్‌ రసాన్ని ముఖంపై రాసుకుని, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

Becareful with Bathroom current

బాత్‌ రూమ్‌ కరెంట్‌తో జాగ్రత్త

ఇంట్లో బాత్రూమ్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని అందరికీ తెలుసు. కానీ బాత్రూమ్‌ శుభ్రత విషయంలో చాలా మంది అజాగ్రత్త చేస్తుంటారు. దీంతో పాటు బాత్రూమ్‌లో ఉండే ఎలకి్ట్రక్‌ వస్తువుల గురించి చూసిచూడనట్లు కొందరు వదిలేస్తుంటారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. బాత్రూమ్‌లో కరెంట్‌ షాక్‌కి తావు లేకుండా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించాలి.
 ముందు బాత్రూమ్‌ బయటే విద్యుత్‌ గృహోపకరణాలు అమర్చుకోవాలి. బాత్రూమ్‌లో వాటర్‌ హీటర్‌ని వాడకపోవటం మంచిది.
 బాత్రూమ్‌లో ఎలకి్ట్రక్‌ షేవర్‌, హైర్‌ డ్రయర్స్‌, ఎలకి్ట్రకల్‌ హీటర్‌ వాడటం అంత శ్రేయస్కరం కాదు.
 చేతులు తడిగా ఉన్నపుడు విద్యుత్‌ ఉపకరణాలను, స్విచ్‌లను తగలకూడదు.
 కిచెన్‌ లేదా బాత్రూమ్‌లో తేమశాతం ఎక్కువ ఉన్న స్థలంలో పాత కరెంటు వైర్లని, బోర్డులని తొలగించాలి.
 ఎక్స్‌టెన్షన్‌ యూనిట్లను, అడాప్టర్స్‌ని బాత్రూమ్‌లో వాడకండి.
వాటర్‌హీటర్‌ని ఎలా వాడాలంటే ...
 ఎలకి్ట్రక్‌ వాటర్‌హీటర్‌ లైసెన్స్‌డు ప్లంబర్‌ లేదా నిపుణుడితో మాత్రమే బిగించాలి.
 వాటర్‌ హీటర్‌కి సంబంధించిన బోర్డు, వేడి నీళ్ళు వచ్చే పైప్‌, ఉష్ణతాకం, ప్రెజర్‌ రిలీఫ్‌ వాల్వుని తర్వాత్తర్వాత కూడా ఏ సమస్యా రాకుండా ముందుగానే జాగ్రత్తగా పిట్‌ చేయించుకోవాలి.
 వాటర్‌ హీటర్‌ వాడిన తర్వాత స్విచ్ఛాఫ్‌ చేయటం మర్చిపోకండి.
 స్టీమ్‌లో ఏదైనా తేడా వచ్చిందని గమనించిన వెంటనే నిపుణుల సహాయంతో సమస్యని పరిష్కరించుకోండి.
 వాటర్‌ హీటర్‌ని మైంటైన్‌ చేయటం, రిపేర్లు వచ్చినపుడు చూసుకునే వారు దాని గురించి ప్రాథమిక విషయాలు తెలుసుకోకుండా దాని జోలికి వెళ్ళటం
ప్రమాదకరం.
చిన్నపిల్లలు జాగ్రత్త
 చిన్న పిల్లలు స్నానం చేసేటపుడు ఆటలాడనివ్వద్దు.
 120 డిగ్రీలకంటే ఎక్కువ నీళ్ల ఉష్ణోగ్రత ఉండకూడదు.
 పాప లేదా బాబుని ఒంటరిగా బాత్రూమ్‌లో వదిలేసి బయటికి వెళ్లరాదు.
 టబ్‌లో మొదట చల్లని నీళ్లు నింపాలి, తర్వాతనే వేడినీళ్ళు పోయాలి.
 పిల్లలకి అందేట్లు షాంప్స్‌, హెయిర్‌ కలర్స్‌, డ్రయర్స్‌ లాంటివి ఉంచరాదు.
 చాలామంది బాత్రూమ్‌లో బకెట్‌లో హీటర్‌ వేసి తమ పనిలో నిమగ్నమవుతారు. పిల్లలు వెంటనే బకెట్‌లో చేయి పెట్టి కరెంట్‌ షాక్‌కి గురయ్యే ప్రమాదముంది.
 డోర్‌కి, గోడలకి మేకులు, బోల్టులు ఉంటే తీసేయండి.

Immunity power - Pollution effects

రోగనిరోధక వ్యవస్థకు కాలుష్యం దెబ్బ


మనిషిని రోగాల బారి నుంచి కాపాడేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ. మరి ఆ రోగ నిరోధక వ్యవస్థను నిరోధించేది వారసత్వంగా వచ్చే జన్యువులు.. ఇది ఇప్పటిదాకా అందరు భావిస్తున్న అంశం. కానీ, దానికి మన జన్యువులు కారణమే అయినా రోగనిరోధక వ్యవస్థను నిరోధించేది మన చుట్టూ ఉండే ‘పర్యావరణం’ అని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. ఈ విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్లు, ఇతర ఇమ్యూనిటీ ప్రభావాలపై పరిశోధనలు చేస్తే పర్యావరణం, కొన్ని రకాల సూక్ష్మజీవుల ప్రభావం కనిపించిందని చెప్పారు.
‘‘ఉద్యోగాలు చేసే మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు దీర్ఘకాలిక ఒత్తిడి బారిన పడుతున్నారు. ఉద్యోగుల్లో మూడో వంతు మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు’’ అంటోంది అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌ స్టడీ నివేదిక. ఇందులో వెల్లడయిన ఫలితాల్ని పక్కన పెడితే ఎంతో సామర్థ్యంగా ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నాలు చేయడంలో కూడా మహిళలే ముందున్నారు. అవేంటంటే...

maleria

వీటితో మలేరియా తీవ్రం!

బెడ్‌ నెట్లు, వ్యాక్సిన్లను కలిపి ఉపయోగిస్తే మలేరియాకు చరమగీతం పాడొచ్చు! అది నిన్నటి మాట.. ఆ రెండింటిని కలిపి వాడినా ప్రయోజనం ఉండదని, పైగా ఆ రిస్క్‌ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని మిచిగాన్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ప్రత్యేకించి కొన్ని రకాల వ్యాక్సిన్లు, బెడ్‌నెట్ల వాడకం వల్ల వృద్ధుల్లో తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని, ఒక్కోసారి మరణాలూ సంభవిస్తాయని తమ అధ్యయనంలో తేలినట్లు చెప్పారు. మలేరియా వ్యాక్సిన్లు మూడు కేటగిరీల్లో తయారుచేస్తారని.. ఆ కేటగిరీల ప్రకారం వ్యాక్సిన్లను వాడినా మలేరియా వ్యాప్తిని అడ్డుకోజాలమని తెలిపారు.

Word will mesmerise us

మాటలు ‘మాయ’ం చేస్తాయి

దాదాపుగా అందరికీ వ్యాయామం అనేది కామన్‌ థెరపీ. రన్నింగ్‌, వాకింగ్‌, యోగ వంటి వ్యాయామాలు చేయడం వల్ల మహిళలు పని ప్రదేశాల్లో ఒత్తిడి మోతాదును తగ్గించుకోగలుగుతున్నారు.
వ్యాయామం: ఒత్తిడి నుంచి బయటపడేందుకు వ్యాయామం మంచి మందు. దాదాపుగా అందరికీ వ్యాయామం అనేది కామన్‌ థెరపీ. రన్నింగ్‌, వాకింగ్‌, యోగ వంటి వ్యాయామాలు చేయడం వల్ల మహిళలు పని ప్రదేశాల్లో ఒత్తిడి మోతాదును తగ్గించుకోగలుగుతున్నారు. శారీరక వ్యాయామాలు నరాలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. దీని వల్ల ఒత్తిడినుంచి బయటపడటమే కాకుండా శరీరాకృతి కూడా బాగుంటుంది.
మాట్లాడాలి: చాలామంది మగవాళ్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటారు. కాని ఆడవాళ్లు అలా కాదు కాస్త ఎక్కువ మాట్లాడతారు. గమనిస్తే మనసు విప్పి మాట్లాడిన తరువాత ఆడవాళ్లు మనసు భారాన్ని దించుకున్నట్టు కనిపిస్తారు. ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు కొరకరాని కొయ్యల్లా ఉండే బాస్‌లు, ఏ మాత్రం సహకరించని సహోద్యోగుల వల్ల తలనొప్పి రావడం ఖాయం. ఇలాంటప్పుడు స్నేహితులతో మాట్లాడితే మనసుకు ఉపశమనం లభిస్తుంది. మనసు విప్పి మాట్లాడారంటే ఆ సమస్యలన్నీ కిటికీలో నుంచి వెళ్లి గాల్లో కలిసిపోవాల్సిందే. పనికి సంబంధించిన విషయాలు స్నేహితులతో ఏం మాట్లాడతాం అంటున్నారా... ఆ విషయాలే మాట్లాడాలనేం లేదు. మీ స్నేహితులకి, మీకు కామన్‌గా నచ్చిన విషయాలేవైనా మాట్లాడుకోవచ్చు. కాసేపు అలా మాట్లాడితే చాలు మనసు తేలికపడుతుంది. అందుకే మాట్లాడండి...
మనసుకు నచ్చింది: మనసుకు నచ్చిన పనిచేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. చదవడం, రాయడం, సినిమాలు చూడడం, ఫోటోలు తీయడం, వండడం, తోటపని చేయడం... ఇలా ఏదైనా కావొచ్చు. ఇవి చేయడం వల్ల మనసు తేలికపడుతుంది. నచ్చిన పనులు చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది అంటున్నారా? ఈ మాటలను పక్కన పెట్టేయాలి. ఆఫీసు నుంచి ఇంటికెళ్లాక కొద్ది సమయాన్ని మీకోసం కేటాయించుకుని మనసుకు నచ్చిన పని చేయాలి.
మైండ్‌సెట్‌ మార్చుకోవాలి: మైండ్‌సెట్‌ మార్చుకుంటే మంచి భావన కలుగుతుంది. ఆఫీసులోకి సానుకూల ధోరణితో అడుగుపెట్టాలి. ‘ఇవ్వాళ నాకు మంచి రోజు’ అనుకోవాలి. చేసే పని పట్ల వ్యతిరేక భావనలు ఉండొద్దు. ఒకవేళ ఉన్నా తుడిచేయాలి. అలాగే మీ డెస్క్‌ దగ్గర చేయాల్సిన పనుల్ని, ముఖ్యమైన విషయాలను స్టిక్‌ నోట్స్‌ రాసుకుని అతికించుకోవాలి. ఇలాచేస్తే చేయాల్సిన పనులు మర్చిపోరు. ఆ తరువాత పనికాలేదన్న ఒత్తిడికి గురికావాల్సిన పరిస్థితీ రాదు. సానుకూల ధోరణి ఒత్తిడిని దూరం చేయడంలో ఎంతో సాయపడుతుంది.
టేక్‌ ఎ బ్రేక్‌: ఆడవాళ్లు కష్టపడి పనిచేస్తారనే విషయం తెలిసిందే. అందుకని చేసే పని రొటీన్‌ అయిపోయి బోర్‌ కొట్టకుండా ఉండేందుకు తప్పక బ్రేక్‌ తీసుకోవాలి. పనిచేసే మూడ్‌ లేదనిపించినప్పుడు సెలవు పెట్టి ఎంజాయ్‌ చేయాలి. తిరిగొచ్చాక రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం గ్యారెంటీ.
చివరిదే అయినా అతి ముఖ్యమైనది అద్దం ముందు నిల్చొని చిరునవ్వుతో పలకరించుకోండి. ఈ చిరునవ్వు ఇచ్చే కిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అయిన వాళ్లకే తెలుస్తుంది.

Telugu moral story


ఆమె ఓ అందమైన యువతి. అంతకన్నా ఎక్కువ స్థితిమంతురాలు. చాలా ఖరీదైన దుస్తులని వేసుకుంది. ఓ మానసిక శాస్తవ్రేత్తని కలిసి తన జీవితం చాలా వృధాగా మారిపోయిందని, తన జీవితంలో ఏమీ లేదని చెప్పింది. ఎలాంటి సంతోషం కూడా లేదని చెప్పింది. సంతోషం పొందే మార్గాలు చెప్పాలని అతన్ని కోరింది.
వెంటనే అతను తన ఆఫీసుని ఊడ్చి శుభ్రపరిచే ఒక స్ర్తిని పిలిచాడు. సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడ మీకు చెబుతుందని ఆ అందమైన యువతికి చెబుతాడు. మీరు ఆమె చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వినాలి. అదే మిమ్మల్ని నేను కోరుతున్నానని కూడా ఆమెకు చెబుతాడు.
తన చేతిలో చీపురుని ఓ మూలన పడేసి ఆ స్ర్తి ఆ యువతి ముందు వున్న కుర్చీలో కూర్చుని ఈ విధంగా చెప్పింది.
‘‘నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు. ఆ తర్వాత మూడు నెలలకి నా ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాకు ఏమీ మిగల్లేదు. నిద్రపోలేకపోయాను. అంతా దుఃఖం. ఏమీ తినలేకపోయాను. ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. ఎవరు పలకరించినా చిన్న చిరునవ్వుతో వారిని పలకరించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వున్నప్పుడు ఓరోజు మా ఇంటి ముందు చిన్న కుక్కపిల్లను గమనించాను. చాలా చలిగా ఉంది. ఆ కుక్కపిల్లని నా ఇంటిలోకి రానిచ్చాను. కొన్ని వేడిపాలని ఓ గినె్నలో పోసి దాని ముందుపెట్టాను. అది ఆ పాలను తాగింది. ఆ గినె్నను కూడా నాకేసింది. ఆ తరువాత నా దగ్గరికి వచ్చింది. నా కాళ్లని చాలా ప్రేమతో నాకింది. తన ఒంటి మీద వున్న బూరుతో రుద్దింది. అది వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అనుకోకుండా నాకు చిరునవ్వు వచ్చింది. కొన్ని నెలల తరువాత నేను నవ్విన చిరునవ్వు అది.
నేను ఆలోచనల్లో పడ్డాను. ఓ చిన్న సహాయం ఆ కుక్కపిల్లకి చేయడంవల్ల నాకు సంతోషం కలిగిందే, మరి ఇంకాస్త సహాయం తోటి వాళ్లకి చేస్తే ఇంకా కాస్త సంతోషం కలుగుతుంది కదా అని అన్పించింది.
ఆ తెల్లవారి మా పక్కింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రొట్టెలు చేసి ఇచ్చాను. ఆరోజునుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఏదో సహాయం చేస్తూ వచ్చాను. వాళ్లు పొందిన సంతోషాన్ని చూసి నాకు సంతోషం వేసేది. ఈ రోజు నాకన్నా ఆనందంగా ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారా అని అన్పిస్తుంది. ఆనందంగా తింటున్నాను. ఇంకా ఆనందంగా నిద్రపోతున్నాను. ఎదుటి వాళ్లకి ఇవ్వడంలో నాకు ఆనందం కన్పిస్తుంది.
డబ్బుతో ఏదైనా మీరు కొనుక్కోగలరు. కాని సంతోషాన్ని కొనుక్కోలేరు. అది మనకి మనం పొందాల్సి ఉంటుంది.’’
ఆ అందమైన యువతికి సంతోషం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో బోధపడింది.
నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావన్న దాన్ని బట్టి జీవితంలో అందం వుంటుంది.
నీవల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు అన్నది ఇంకా ముఖ్యమైంది.
సంతోషం అనేది గమ్యం కాదు
అది ఒక ప్రయాణం
సంతోషం మరో రోజులో లేదు.
ఇప్పుడే ఉంది
సంతోషం పరాధీనత కాదు
అది ఓ నిర్ణయం
సంతోషమంటే నువ్వేమిటో..
అంతేకాని
నీ దగ్గర ఏం ఉంది
అన్నది కాదు