Pages

Wednesday, 28 January 2015

Fresh skin - Beatroot

చర్మానికి ‘బీట్‌’ వేస్తే...

బీట్‌రూట్‌లో ఆరోగ్యాన్ని కాపాడే ఔషధగుణాలున్నాయి. నైట్రేట్‌ నిల్వలు అధికంగా ఉన్న బీట్‌రూట్‌ రసం తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది. శరీరంలో కొవ్వుశాతం తగ్గించి హార్ట్‌అటాక్‌ రాకుండా చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, క్యాన్సర్‌ కణితులని నిర్మూలిస్తుంది బీట్‌రూట్‌. బీట్‌రూట్‌ రసం నూతనోత్తేజాన్నిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఆరోగ్యంతో పాటు అందానికీ తోడ్పడుతుంది బీట్‌రూట్‌.
చర్మానికికాంతిని ఇవ్వడంలో బీట్‌రూట్‌ ‘రూటే’ వేరు. బీట్‌రూట్‌ ఫేస్‌ప్యాక్‌ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అదెలాగంటే...
కావాల్సిన పదార్థాలు
బీట్‌రూట్‌ రసం- రెండు టీ స్పూన్లు, పెరుగు - ఒక టీ స్పూన్‌, నిమ్మరసం- ఒక స్పూన్‌, శెనగపిండి- రెండు టీస్పూన్లు.తయారీ
ఒక గిన్నెలో బీట్‌రూట్‌ రసాన్ని తీసుకోవాలి. నిమ్మరసం, పెరుగు, శెనగపిండి వీలైతే ఒక స్పూన్‌ తేనె కూడా వేసి బాగా కలపాలి.
తయారుచేసుకున్న బీట్‌రూట్‌ పేస్ట్‌ని ముఖంపై రాయాలి. పావుగంట తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి.
మచ్చలు పోగొట్టేందుకు...
ఈ ప్యాక్‌ వేసుకోవడం వల్ల చర్మం మెరుపును సంతరించుకుంటుంది. చర్మంపై ఉండే నల్లమచ్చలు మాయమైపోతాయి. చిన్న చిన్న రంధ్రాలేమైనా ఉంటే పూడిపోతాయి. నెలకి రెండుసార్లు బీట్‌రూట్‌ ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే ముఖం కాంతివంతమవుతుంది.
ఆరు స్పూన్ల బీట్‌రూట్‌ రసాన్ని ముఖంపై రాసుకుని, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

No comments:

Post a Comment