Pages

Wednesday, 28 January 2015

Childcare - homework

హోంవర్క్‌ చకచకా ఎలా?

ప్రతిరోజూ పిల్లలతో హోంవర్క్‌ పూర్తి చేయించడం తల్లిదండ్రులకు ఓ సవాల్‌గానే ఉంటుంది. తల్లిదండ్రులు సాధారణంగా ఎదుర్కొనే సమస్య ఇది. దీన్ని అధిగమించాలంటే ఈ సూచనలు ఫాలో అయిపోండి.
 ప్రతిరోజూ పిల్లలు స్కూల్‌ నుంచి రాగానే టీచర్లు ఏం చెప్పారు? చేయాల్సిన హోంవర్క్‌ ఏంటి? అనే విషయాలను తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలి.
 హోంవర్క్‌ చేసే సమయంలో పిల్లలకు చాలా సందేహాలు వస్తుంటాయి. అటువంటప్పుడు దగ్గరుండి వారి సందేహాలను నివృత్తి చేయాలి. దీంతో మరింత ఉత్సాహంగా హోంవర్క్‌ పూర్తి చేస్తారు.
 పిల్లలు నలుగురైదుగురు కలిసి ఒకేచోట కూర్చుని హోంవర్క్‌ చేసుకొనేలా చేస్తే మరీ మంచిది. ఒకరిని చూసి ఒకరు హోంవర్క్‌ కంప్లీట్‌ చేస్తారు.
 సమయంలోగా హోంవర్క్‌ కంప్లీట్‌ చేసుకోవాలని షెడ్యూల్‌ పెట్టాలి. దీనివల్ల పిల్లలకు షెడ్యూల్‌లో పనిపూర్తి చేసుకునే అలవాటు అబ్బుతుంది.
 పిల్లలు హోంవర్క్‌ చేసే సమయంలో పక్కన కూర్చుని ఫోన్‌ మాట్లాడటం చేయకూడదు. దానివల్ల వారి ఏకాగ్రత దెబ్బతింటుంది.
 గణితానికి సంబంధించి హోంవర్క్‌ చేసే సమయంలో పిల్లలకు బాగా సందేహాలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు మీరు సందేహాన్ని నివృత్తి చేసే సరి. లేదంటే ట్యూషన్‌ మాస్టారుతో లేదా క్లాస్‌ టీచర్‌తో మాట్లాడి సందేహాలు తొలగిపోయేలా చూడాలి.
 ఉదయం త్వరగా లేచి హోంవర్క్‌ పూర్తి చేస్తాను. ఇప్పుడు ఆడుకుంటాను అని పిల్లలు మారాం చేస్తుంటారు. కానీ పిల్లలు ఉదయం త్వరగా లేవరని గుర్తుపెట్టుకోవాలి. సాయంత్రం వేళలోనే హోంవర్క్‌ పూర్తయ్యేలా చూడాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల హోంవర్క్‌ విషయంలో
ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 

No comments:

Post a Comment