|
బిడ్డకు తల్లినవుతున్నానని తెలిసినపుడు ప్రతి సీ్త్ర ఎంతో ఆనందిస్తుంది. కానీ ఆ నవ మాసాలూ ఆరోగ్యవిషయంలో మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కడుపులో శిశువు పెరిగేటప్పుడు శారీరకంగా ఎన్నో మార్పులు సంభవిస్తాయి. ఆ సమయంలో పోషకవిలువలతో కూడిన ఆహారాన్ని వీళ్లు తీసుకోవాలి. శిశువు పెరుగుదలకు గర్భిణీలు ఎలాంటి డైట్ తీసుకోవాలో ఈ వారం తెలుసుకుందాం...
సీ్త్రలు గర్భం ధరించినపుడు కడుపులో పెరుగుతున్న శిశువుకి ఆహారం ఎక్కువగా అందాలి. ఇందుకోసం గర్భిణీలకు అదనపు శక్తి కావాలి. ఎక్కువ కాలరీలతో కూడిన ఆహారం వీళ్లు తీసుకోవాలి. రోజుకు ఎన్ని కాలరీలు తీసుకోవాలనేది వాళ్ల శరీర బరువు, చేస్తున్న వ్యాయామాలు, తినే ఆహారం బట్టి ఉంటుంది. టిష్యు సింథసిస్, యుటిరస్, బ్రెస్ట్, బ్లడ్ వాల్యూమ్‌ల పెరుగుదలకు ప్రొటీన్లు చాలా అవసరం. ప్రొటీన్లలో ఎమినో యాసిడ్స్, నైట్రోజన్ పుష్కలంగా ఉంటాయి. కడుపులో ఉన్న పిండం పెరుగుదలకు తల్లికి అదనపు శక్తి అవసరమవుతుంది. ఇందుకోసంగర్భిణీలు కాల్షియం బాగా తీసుకోవాలి. ఐరన్ కూడా వీళ్లకి చాలా అవసరం. ఐరన్ కడుపులో పెరుగుతున్న శిశువుకి ఆక్సిజన్ అందేట్లు చేస్తుంది. ఫోలిక్ యాసిడ్ కూడా గర్భవతులకు చాలా అవసరం. పేద, సంపన్న వర్గాలన్న తేడా లేకుండా గర్భిణీలందరూ తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్, ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. గర్భిణీలలో ఎక్కువమంది మార్నింగ్ సిక్‌నె్‌సతో బాధపడుతుంటారు. అలాంటి సందర్భాలలో ఉదయం డ్రైఫ్రూట్స్ తింటే మంచిది. బిస్కట్లు, ఇడ్లీ కూడా తినొచ్చు. నూనె పదార్థాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఇవి తొందరగా అరగవు. పచ్చికూరగాయలు, సగం ఉడికిన పదార్థాలు కూడా తినకూడదు. అలర్జీకి దారితీసే వేరుశెనగపప్పు లాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తినడం వల్ల ఆహారం అరగక జీర్ణశక్తి దెబ్బతింటుంది. గుండె ల్లో మంటలా అనిపిస్తుంది. ఆకలివేస్తోందని ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా రోజులో కొద్ది కొద్దిగా ఎక్కువ మార్లు తింటే మంచిది. గర్భిణికి శాంపిల్ మెనూ ఉదయాన్నే అయిదు బాదంపప్పులు, అయిదు ఖర్జూరం పళ్లు తినాలి. బ్రేక్‌ఫా్‌స్టగా ఒక ఎగ్ వైట్, రసం లేదా చట్నీతో రెండు ఇడ్లీలు తినాలి. మధ్యాహ్నం ఒక గ్లాసు పాలు తాగాలి. ఏదైనా ఒక పండు తినాలి భోజనంలో వెజ్‌సలాడ్, అన్నం, చిరుధాన్యాలతో చేసిన కూర, మజ్జిగ తీసుకోవాలి. స్నాక్‌గా వెజ్ చీజ్ శాండివిచ్ తినొచ్చు. దాంతోపాటు ఒక గ్లాసు పళ్లరసం తాగాలి. డిన్నర్‌లో ఒక కప్పు సూప్, గుడ్డు, రెండు పుల్కాలు, వెజిటబుల్ రైతా, ఫ్రూట్ సలాడ్‌లు తీసుకోవాలి. |