Pages

Wednesday, 3 December 2014

సక్సెస్ నిచ్చెనెక్కడమెలా!

వృత్తిలోనూ, ప్రవృత్తిలోనూ అద్వితీయంగా రాణించాలన్న యువత తపనకు
చోదకశక్తి ఆత్మవిశ్వాసమే. అయితే, వాస్తవాలకు జీవితానికి మధ్య ఏకోశానా పొంతన ఉండదు. డిగ్రీలకూ, ఉద్యోగానికీ కూడా అంతే దూరం. నర్సరీ మొదలుకుని..
పట్టా పుచ్చుకునే వరకూ యువతలో ఎన్నో ఆశలు, ఆకాంక్షలు. పరుగులు పెట్టించే మనోరథాలు! అంత సులభంగా సాధ్యమయ్యేవేనా..ఉద్యోగ
మార్కెట్‌లో అడుగు పెట్టిన వెంటనే ఉపాధి అవకాశాలు చిరునవ్వుతో
స్వాగతం పలికే అవకాశం ఉందా..నేటి పోటీ ప్రపంచంలో..ఒక్కో ఉద్యోగానికి వేల
దరఖాస్తులు దాఖలవుతున్న నేపధ్యంలో అడుగడుగునా నిరాశే ఎదురవుతుంది. ధైర్యంగా అడుగేయలేని అనిశ్చితే తాండవిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే
ఆత్మ విశ్వాసం, స్వీయ ప్రతిభపై నమ్మకం రాణిస్తాయి. అశాంతిని, నిరాశను
తొలగించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలిగే మనోధైర్యాన్ని అందిస్తాయి.
నేటి యువత కోరికలకు కొదవ లేదు. ఆత్మ విశ్వాసానికీ ఢోకా లేదు. అదే వారిని పరుగులు పెట్టిస్తోంది. ధైర్యంగా ఏ రంగంలోకైనా దూకేసేందుకూ ప్రేరణ అవుతోంది. తమ ముందు తరంకంటే కూడా నేటి తరం వేగంలోనే కాదు, దేన్నయినా సాధించగమన్న ధీమాలోనూ తిరుగులేనిదే. తామేపని చేపట్టినా, ఏ బాధ్యత నిర్వర్తించినా అందులో తమ ముద్ర ఉండాలన్న తపన, యావ యువతకు మెండుగానే ఉన్నాయి. వృత్తిలోనూ, ప్రవృత్తిలోనూ అద్వితీయంగా రాణించాలన్న వీరి తపనకు చోదకశక్తి ఆత్మవిశ్వాసమే. అయితే, వాస్తవాలకు జీవితానికి మధ్య ఏకోశానా పొంతన ఉండదు. డిగ్రీలకూ, ఉద్యోగానికీ కూడా అంతే దూరం. నర్సరీ మొదలుకుని..పట్టా పుచ్చుకునే వరకూ యువతలో ఎన్నో ఆశలు, ఆకాంక్షలు. పరుగులు పెట్టించే మనోరథాలు! అంత సులభంగా సాధయమయ్యేవేనా..ఉద్యోగ మార్కెట్‌లో అడుగు పెట్టిన వెంటనే ఉపాధి అవకాశాలు చిరునవ్వుతో స్వాగతం పలికే అవకాశం ఉందా..నేటి పోటీ ప్రపంచంలో..ఒక్కో ఉద్యోగానికి వేల దరఖాస్తులు దాఖలవుతున్న నేపధ్యంలో అడుగడుగునా నిరాశే ఎదురవుతుంది. ధైర్యంగా అడుగేయలేని అనిశ్చితే తాండవిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆత్మ విశ్వాసం, స్వీయ ప్రతిభపై నమ్మకం రాణిస్తాయి. అశాంతిని, నిరాశను తొలగించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలిగే మనోధైర్యాన్ని అందిస్తాయి. అందరికీ ఇలాంటి ఆత్మస్థయిర్యం ఉండకపోవచ్చు. కుటుంబ నేపథ్యం..పెరిగిన తీరుతెన్నులూ ఇందుకు ప్రధానంగా కారణం అవుతాయి. కొందరిది దూకుడు మనస్తత్వమైతే ఇంకొదరిది ఒకటికి పదిసార్లు ఆలోచిస్తేగానీ ముందుకెళ్లలేని డోలాయమానం. ఇలాంటి పరిస్థితుల్లో ఊహాప్రపంచం ఉంచి బయటికి రావాలి. స్వీయ ప్రతిభను తులనాత్మక రీతిలో బేరీజు వేసుకోవాలి. జీవిత లక్ష్యాలు ఎండమావులు కాకుండా వాస్తవికతను సంతరించుకోవాలి. ఇందుకు ప్రధానంగా కావాల్సిన, అనివార్యంగా ఉండాల్సిన లక్షణం..సవాళ్లను ఢీకొనగలిగే మనస్తత్వం. జీవన పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఎత్తు పల్లాలు వెలుగు నీడల్లా అడుగడుగునా తారసిల్లుతూనే ఉంటాయి. రోజురోజుకూ మారిపోతున్న పరిస్థితుల్లో..దేశాల మధ్య సరిహద్దులు తొలగిపోయి ఎల్లల్లేని అవకాశాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఇలాంటి పరిస్థితులూ, పరిణామాలు సహజమే. నేల విడిచి సాముచేసే ధోరణిని పక్కన పెట్టి అందిన అవకాశాలకు తగ్గట్టుగా రాణించడంలోనే సక్సెస్ ఉంటుంది. తగిన నైపుణ్యాన్ని సంతరించుకోవడంలోనే జీవిత వైకుంఠపాళిలో గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ఏటేటా లక్షలాది మంది జాబ్ మార్కెట్‌లోకి అడుగు పెడుతున్న తరుణంలో..ఉద్యోగమా..ఉపాధా అన్నది పెద్ద మీమాంసగా మారుతోంది. చదువుకు తగ్గ ఉద్యోగం గగనమయితే..అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకునే నైపుణ్యం ఎండమావిగా మారుతోంది. ఈ సందిగ్థావస్థ నుంచి బయట పడాలంటే ముందుగా కావాల్సింది వాస్తవ పరిస్థితుల పట్ల అవగాహన. ఊహా ప్రపంచం నుంచి బయటికి వచ్చి ఆత్మ విశ్వాసమే పెట్టుబడిగా ముందుకు దూసుకుపోగలిగే నైజం. ఎలాంటి ఆసరా లేని నేపథ్యం నుంచి వచ్చి ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారున్నారు. అలాంటి వారి జీవితాలు జీవన పోరాటంలో విసిగివేసారి నైరాస్యంలో కొట్టుకుపోతున్న యువతకు ఆదర్శం కావాలి. వారి బాటలో ముందుకెళితే సవాళ్లు దూదిపింజెల్లా ఎగిరిపోతాయి. అందని ఆకాశం అందినంత ఆనందాన్ని కలిగించే అవకాశాలు అందివస్తాయి. ఆత్మస్థయిర్యమే పెట్టుబడిగా..పట్టుదలే సోపానంగా సాగినప్పుడే ఇవన్నీ సాకారం అవుతాయి. నేటి యువత సక్సెస్ మంత్రం..జీవితంలో ఎదిగే తంత్రం ఇదే.
*

No comments:

Post a Comment