Pages

Wednesday, 3 December 2014

సూపర్ కార్ వచ్చేస్తోంది!

రెప్పపాటులో 150 మీటర్ల ప్రయాణం
3.6 సెకన్లలో మైలు దూరానికి దూసుకుపోయే స్పీడు
గంటకు 1600 కిలోమీటర్ల ప్రయాణ వేగం
1,35,000 హార్స్‌పవర్ సామర్థ్యం
...ఇవన్నీ రాకెట్ ఫీచర్లనుకుంటున్నారా...కాదు. ఓ కారు గుణగణాలివన్నీ! పేరు బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కార్. మరో ఏడాదిలో రోడ్డుపైకి రానున్న ఈ కారు ఇప్పుడు సర్వత్రా సంచలనం రేకెత్తిస్తోంది. ఫార్ములా వన్ రేస్ కార్లను తలదనే్న రీతిలో, రాకెట్లతో పోటీపడే స్పీడుతో వాయువేగ మనోవేగాలతో దూసుకుపోయే బ్లడ్‌హౌండ్‌పైనే ఇప్పడందరికీ ఆసక్తి. కుర్రకారుకు కిర్రెక్కించే, రేసర్లకు కిక్కెక్కించే ఈ సూపర్‌సోనిక్ కారు మరి కొన్ని రోజుల్లోనే టెస్ట్ డ్రైవ్‌కు సిద్ధం కాబోతోంది. ఇంతకీ ఎక్కడుందా బ్లడ్‌హౌండ్?
యుకేలోని బ్రిస్టల్‌లో ప్రాజెక్టు టెక్నికల్ సెంటర్‌లో తుది దశ డిజైనింగ్‌లో ఉన్న బ్లడ్‌హౌండ్‌కు సృష్టికర్త స్కాట్‌లాండ్‌కు చెందిన ఓ బిగ్‌షాట్. పేరు రిచర్డ్ నోబెల్. గతంలో థ్రస్ట్ సూపర్‌సోనిక్ కారు (గంటకు 763 మైళ్ళ వేగం)ను రూపొందించిన ఘనత రిచర్డ్‌దే. రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ జెట్ పైలట్‌గా పనిచేసిన ఆండీ గ్రీన్‌తో కలసి బ్లడ్‌హౌండ్ రూపకల్పనలో బిజీగా ఉన్న రిచర్డ్ వచ్చే ఏడాదికి టెస్ట్ డ్రైవ్‌కి తీసుకువస్తానంటున్నాడు.
ఫీచర్ల విషయానికొస్తే బ్లడ్‌హౌండ్‌లో రెండు ఇంజన్లు ఉంటాయి. అందులో ఒకటి రాకెట్ ఇంజన్ . మరొకటి రోల్స్ రాయిస్ జిజె 200 ఇంజన్. వీటి సంయుక్త సామర్ధ్యం 1,35,000 హెచ్‌పి. ఏడు టన్ను ల బరువు. బ్లడ్‌హౌండ్ ప్రాజెక్టులో ప్రపంచవ్యాప్తంగా 250 కంపెనీలు పనిచేస్తున్నాయి. వచ్చే ఏడాది చివర్లో దక్షిణాప్రికాలో హై స్పీడ్ టెస్ట్ డ్రైవ్‌కు వెడతామంటున్న రిచర్డ్... సైన్స్ అండ్ టెక్నాలజీలో యువతకు స్ఫూర్తిదాయకం కావాలన్నదే తమ ప్రాజెక్టు లక్ష్యమంటున్నాడు. *

No comments:

Post a Comment