Pages

Wednesday, 20 August 2014


మిఠాయిలపై రంగులు ఎలర్జీ కలిగిస్తాయా?

నమ్మకం: మిఠాయిలపై ఫుడ్ కలర్స్, కృత్రిమ పదార్థాలకు ఎలర్జీలు వస్తాయా? నిజం: అలా అని ఏమీ లేదు. సహజమైన ఆహారాలతో కూడా ఎలర్జీ కలిగించవచ్చు. కృత్రిమ పదార్థాల విషయానికి వస్తే, వాటితో ఎలర్జీ వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, టార్‌ట్రజైన్, ఆస్పర్‌టేమ్ అనే కృత్రిమ తీపి పదార్థాలతో ఇలాంటి ఫుడ్ ఎలర్జీలు ఎక్కువ.
నమ్మకం: ఫుడ్ ఎలర్జీ జీవితాంతమూ ఉంటుంది. లేదా, కొంతకాలానికి దీన్నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు.
నిజం: సాధారణంగా చిన్న పిల్లలు పాలు, కోడిగుడ్లు, సోయా చిక్కుడు, గోధుమలు తదితర ఆహార పదార్థాలు కలిగించే ఎలర్జీలనుంచీ బయటపడతారు. ఐతే, పెద్దవారికి ఒకవేళ ఫుడ్ ఎలర్జీ ప్రారంభమైతే ముఖ్యంగా చేపలు, వేరుశెనగలు, జీడిపప్పు వగైరాలతో ఎలర్జీ మొదలైతే అంత తేలికగా పోదు.
ఆయుర్వేద చికిత్స
ముందుగా ఎలర్జీలు కలిగించే ఆహారాలు మానేయాలి. దీనినే ఆయుర్వేదం సూత్రప్రాయంగా ‘నిదాన పరివర్జనం’ అంటుంది.
ఎలర్జీతో ఏర్పడే దద్దుర్ల గురించి ఆయుర్వేదం వివరణ ఇస్తూ త్రిదోషాలలో వాతం ఎక్కువగా ఉంటే శీతపిత్తంగానూ, కఫం బలీయంగా ఉంటే ఉదర్దంగానూ భావించాలని చెప్పింది. ఇవే కాకుండా పీనసం వంటి శ్వాసకోశ సంబంధ స్థితిగతులను కూడా పరిగణిస్తూ చికిత్స రూపొందించాల్సి ఉంటుంది. ఎలర్జీలో శరీరాన్ని మార్దవంగా చేయడం కోసం స్నేహకర్మను, చెమటను పుట్టించడానికి స్వేదకర్మను చేయాల్సి ఉంటుంది.
తరువాత చేదుపొట్ల, వేప, అడ్డనరం మొదలైన మూలికలతో వమనాన్ని త్రిఫలా కషాయంతో విరేచనాన్ని చేయించాల్సి ఉంటుంది. ఆవనూనెతో అభ్యంగనం చేయించి వేడినీళ్ళతో స్నానం చేయించడంతో సంశోధన చికిత్సలు పూర్తవుతాయి. ఉపశమనం కోసం శమన చికిత్సలు తోడ్పడతాయి. అవి:
-శొంటి, పిప్పళ్లు, మిరియాల చూర్ణాన్ని ఒక గ్రాము మోతాదుగా పంచదారతో కలిపి తీసుకోవాలి.
-బెల్లం, వాములను సమాన భాగాల్లో కలిపి తీసుకోవాలి.
-వేపాకులు, ఉసిరిక పండ్ల చూర్ణాన్ని నేతికో కలిపి తీసుకోవాలి. ఇవే కాకుండా ఎలర్జీలో శీతపిత్త భంజ నీరస వంటి శక్తివంతమైన ఔషధాలు ఉన్నాయి. వీటిని అవస్థానుసారం వైద్య సలహా మేరకు వాడాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment