Pages

Wednesday, 20 August 2014


జీవక్రియలకు మూలం - థైరాయిడ్


థైరాయిడ్ గ్రంథి మానవ శరీరంలో అతి ప్రధానమైనది. థైరాయిడ్ గ్రంథి శరీరంలోని జీవక్రియలన్నింటిపై ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ గ్రంథి నాలుకకు గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి పిట్యూటరీ గ్రంథి ఆధీనంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి ముఖ్యంగా మూడు హార్మోన్లను విడుదల చేస్తుంది. అవి థైరాక్సిన్, ట్రైఐడో థైరోనిన్, కాల్సిటోనిన్. ఈ హార్మోన్లు శరీరంలోని జీవక్రియల సమతుల్యతను కాపాడడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. థైరాయిడ్ గ్రంథిలో ముఖ్యంగా రెండు తేడాలు చోటుచేసుకుంటాయి. ఒకటి టి3, టి4 తగ్గి, టిఎస్‌హెచ్ పెరగడం. దీనినే ప్రైమరీ హైపోథైరాయిడిజమ్ అంటారు. అలాగే టిఎస్‌హెచ్ తగ్గడం లేదా నార్మల్‌గా ఉండి టి3, టి4 తగ్గడం. దీనినే సెకండరీ హైపోథైరాయిడిజమ్ అంటారు. రెండవది టి3, టి4 పెరగడంవలన హైపర్ థైరాయి డిజమ్ వస్తుంది.
థైరాయిడ్ సమస్యల్ని గుర్తించనట్లయితే స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆందోళన, ఆత్రుత, వెంట్రుకలు ఊడడం, సెక్సువల్ డిస్‌ఫంక్షన్, సంతానలేమి తదితర ఆరోగ్య సమస్యలు వచ్చిపడే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్స్‌వల్ల పిల్లల్లో గుండె, మెదడు పెరుగుదల మామూలుగా ఉంటుంది. సరియైన సమతుల్యత- శరీర పెరుగుదలకు థైరాయిడ్ గ్రంథి అవసరం చాలా ఉంటుంది. కొన్ని కారణాలవల్ల థైరాయిడ్ గ్రంథిలో వాపు, ఇన్‌ఫ్లమేషన్ హార్మోన్స్ ఎక్కువ కావడం లేదా తక్కువ కావడంవలన థైరాయిడ్ గ్రంథిలో మార్పులు చోటుచేసుకుంటాయి.
థైరాయిడ్ జీవక్రియలకు అవసరమైన ముఖ్యమైన గ్రంథి. ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథి పనిచేయదో అది శరీరంలోని ప్రతీ జీవక్రియపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా బరువు, మానసిక ఆందోళన, శక్తి స్థాయిలపై ప్రభావం చూపిస్తుంది.
హైపర్ థైరాయిడిజమ్
థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ అయినపుడు దానిని హైపర్‌థైరాయిడిజమ్ అంటారు.
లక్షణాలు
-ఆకలి బాగా ఉంటుంది కానీ, బరువు తగ్గుతారు. స్ర్తిలలో ఋతుక్రమం తప్పుట, వెంట్రుకలు రాలిపోవుట.
-నిద్ర లేకపోవడం, గుండెలో దడలాగ అనిపించటం.
-్థరాయిడ్ గ్రంథి భాగం వాచి నొప్పి ఉన్నప్పుడు థైరోటాక్సికోసిస్ అంటారు. దీనినే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఇది ముఖ్యంగా 30 సంవత్సరాలు పైబడిన స్ర్తిలలోఎక్కువగా కనిపిస్తుంది.
-కోపం, చిరాకు, నీరసం, అలసట, ఉద్రేకం నాడీవేగం పెరగటం, కాళ్లు, చేతులు వణుకుట, ఎక్కువ వేడిని భరించలేకపోవుట, చెమటలు పట్టుట, నీటి విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
-ఆహారం మామూలుగా తీసుకున్నా, ఎక్కువగా తీసుకున్నా బరువు కోల్పోడం అనేది హైపర్ థైరాయిడిజమ్‌కు సూచన.
హైపోథైరాయిడిజమ్
టి3, టి4 హార్మోన్ల ఉత్పత్తి కొన్ని కారణాలవల్ల తగ్గిపోతుంది. దీనిని హైపోథైరాయిడిజమ్ అంటారు.
లక్షణాలు
-నీరసం, బద్ధకం బరువు పెరగటం, ముఖం వాచినట్లుండటం, జుట్టు రాలడం, స్ర్తిలలో ఋతుక్రమం తప్పటం, చర్మం పొడిబారినట్లుండటం, మలబద్ధకం, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
-కొలెస్టరాల్ సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండటం, ఆహారం తగ్గించినా, వ్యాయామం చేసినా, కొలెస్టరాల్ తగ్గించే మందులు ఉపయోగించినా కూడా సాధారణ స్థాయికి రాకపోవడం, హైపోథైరాయిడిజమ్‌కి సూచనగా భావించవచ్చు.
-వెంట్రుకలు ఊడిపోవడం అనేది థైరాయిడ్ సమస్యలో కనిపించే ప్రధాన లక్షణం
-చర్మం మందంగా ఎండిపోయినట్లుగా అవుతుంది.
-కండరాలు, కీళ్లనొప్పులు చేతుల్లో నీరసం, చేతిలో కార్పల్ టనె్నల్, కాళ్లలో టార్సల్ టనె్నల్ సిండ్రోమ్‌లు వచ్చే అవకాశం ఎక్కువ అవడం.
-మెడ వాచినట్లుగా అనిపించడం, టర్టిల్‌నెక్స్ లేక నెకెటిస్‌తోపాటు అసౌకర్యంగా, గొంతు బొంగురుపోవుట థైరాయిడ్ గ్రంథి బయటకు కనిపించే విధంగా పెద్దగా అవడం.
-మలబద్ధకం, విరేచనాలు, ఇరిటబల్ బవెల్ సిండ్రోమ్ ఎక్కువగా హైపర్ థైరాయిడిజమ్‌లో ఉంటాయి.
-తక్కువ కొవ్వు పదార్థాలున్న, క్యాలరీలున్న ఆహారం తీసుకోవడంతోపాటు తగిన శారీరక వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు కోల్పోకపోవడం లేక బరువు పెరగకపోవడం జరుగుతుంది.

నిర్థారణ
రక్తపరీక్షలు చేయడం ద్వారా టి3, టి4, టిఎస్‌హెచ్ లెవెల్స్ తెలుసుకోవచ్చు. థైరాయిడ్ యాంటీ బాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేయడం ద్వారా రోగ నిర్థారణ చేసుకోవచ్చు.

చికిత్స
హోమియో వైద్యంలో థైరాయిడ్‌కి మంచి చికిత్స కలదు. వ్యాధి లక్షణాలను మరియు వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను ఎన్నుకొని వైద్యం చేసిన థైరాయిడ్ నుండి విముక్తి పొందవచ్చును. హోమియోపతి చికిత్స ద్వారా థైరాయిడ్ హార్మోన్ సమస్యలను సరిచేసే వీలుంది. థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించడం ద్వారా హార్మోన్స్‌ను రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. హార్మోన్స్ నార్మల్ అయిన వెంటనే ఊబకాయం, నిద్రలేమి, ఆత్రుత, ఆందోళన తగ్గిపోతాయి. శారీరక, మానసిక సమస్యల సర్దుకుంటాయి.

మందులు
ముఖ్యంగా ఐయోడిన్, లైకోపోడియం, ఎడ్రినలిన్, థైరాయిడినమ్, కాల్కేరియాకార్బ్ ట్యుబర్కులినం, బ్రోమియం, కోనయం, కాల్కేరియా ఫ్లోర్, స్పాంజియో, లెపిస్ ఆల్బా, కార్బో అనిమాలిస్ మరియు సెపియా వంటి కొన్ని మందులను లక్షణ సముదాయాన్ని పరిగణనలోకి తీసుకొని వైద్యం చేసిన యెడల థైరాయిడ్ నుండి ఉపశమనం పొందవచ్చు. *

No comments:

Post a Comment