Tuesday, 8 July 2014

Samethalu --- Proverbs -- Telugu

తెలుగు సామెతలు అక్షరం
1
అభ్యాసం కూసు విద్య
2
అడుసు తొక్కనేల కాలు కడగనేల
3
అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
4
అడగందే అమ్మ అయినా పెట్టదు
5
అతి వినయం ధూర్త లక్షణం
6
అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట
7
అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు
8
అనువు గాని చోట అధికులమనరాదు
9
అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు.
10
అటునుండి నరుక్కు రా
11
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
12
అత్తవారింటి ఐశ్వర్యంకన్నా పుట్టింటి గంజి మేలు
13
అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
14
ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
15
అగ్నికి వాయువు తోడైనట్లు
16
అతగాడే ఉంటే మంగలెందుకు
17
అక్క మనదైతే బావ మనవాడా?
18
అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు
19
అత్త సొమ్ము అల్లుడు దానం
20
అడకత్తెరలో పోకచెక్క
21
అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
22
అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు
23
అదృష్టవంతుడిని చెరిపేవారు లేరు, భ్రష్టుణ్ణి బాగుపరిచేవారు లేరు
24
అత్త ఒకింటి కోడలే, మామా ఒకింటి అల్లుడే
25
అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడి పెట్టినట్టు
26
అనుమానం పెనుభూతం
27
అన్నీ సాగితే రోగమంత భోగం లేదు
28
అమ్మ కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
29
అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినా తిననివ్వదు
30
అద్దం అబద్ధం చెప్పదు
31
అయోమయం జగన్నాథం
32
అప్పిచ్చువాడు వైద్యుడు
33
అప్పుచేసి పప్పు కూడు
34
అధికమైతే అమృతం కూడా విషమే
35
అర చేతిలో బెల్లం పెట్టి మోచెయ్యి నాకించినట్టు
36
అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు
37
అరకాసు పనికి ముప్పాతిక బాడిగ
38
అన్నదానం కన్నా విద్యాదానం మిన్న
39
అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
40
అమ్మబోతె అడవి కొనబోతె కొరివి


No comments:

Post a Comment