Sunday, 6 July 2014

Beauty with curry leaves ---telugu Beautician

కరివేపాకు--అందం..!
కరివేపాకు చేసే మేళ్ళు ఏమిటో చాలా మందికి తెలియవు. అందానికి ఆరోగ్యానికీ కరివేపాకు మేలంటే అతిశయోక్తి కాదేమో. విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
 కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కరివేపాకు ప్రధానంగా కళ్ళకు మంచిది. తరచూ కరివేపాకు తింటే కళ్ళ ఆరోగ్యం ఇనుమడిస్తోంది.


1.ఆహారం ద్వారా కరివేపాకును తీసుకోవడం ద్వారా మీ కురులు తెల్లబడవు.
2.అతిపిన్న వయసులోనే మీ జుట్టు నెరసిపోవడం వంటి సమస్యలకు కరివేపాకుతో చెక్పెట్టవచ్చును.
3.అరకేజీ నువ్వుల నూనెను కాసి, అందులో 50 గ్రాముల పచ్చి కరివేపాకును వేసి మూతపెట్టాలి. మరుసటి రోజు నూనెను గోరువెచ్చగా వేడి చేసి, తలకు పట్టించి, కుంకుడు కాయతో తలస్నానం చేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే తెలుపు జుట్టు నలుపు జుట్టుగా మారిపోతుంది.
4.చిన్న వయస్సులో జుట్టు నెరసి పోకుండా ఉండాలంటే.. ఒక కప్పు కరివేపాకును రుబ్బుకుని రసంలో మూడు స్పూన్ల మెంతి పొడిని కలిపి జుట్టుకు ప్యాక్లా వేసుకుని, ఎండిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే తెల్లజుట్టు నలుపుగా మారిపోతుంది.
5.ఇంకా కరివేపాకు, గింజలు లేని ఉసిరికాయ, మందారం పువ్వుల్ని సమపాళ్లు తీసుకుని కాసింత నీరు చేర్చి రుబ్బుకోవాలి. తర్వాత రసాన్ని తలకు బాగా పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే.. మీ జుట్టు మృదువుగా తయారవుతుంది.
6.కరివేపాకుతో పేస్టు,మెహందీఅర కప్పు , కరివేపాకుఅరకప్పు, మందారం ఆకులుఅర కప్పు, కుంకుడు కాయలుఅర కప్పు
పైన చెప్పిన వస్తువుల్ని ముందు రోజు నానబెట్టుకోవాలి. మరుసటి రోజు తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు మిల మిల మెరిస్తుంది.


No comments:

Post a Comment