Pages

Wednesday, 1 July 2015

వేరుశనగ నూనెలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!
5
Description: http://www.prajasakti.com/images/line_content.jpg
Description:
                వేరుశనగ నూనెలో ఉన్న రెస్వెట్రాల్, పోలీఫెనాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. సమ్మేళనం ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి పనిచేస్తుంది. అలాగే వేరుశనగ నూనె క్యాన్సర్ను నిరోధిస్తుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నశింపజేస్తుంది. నూనెలో విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో ఉండే రెస్వెట్రాల్ ఆకట్టుకునే స్థాయిలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్ ప్రత్యేకించి వైరల్ అంటువ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
పండ్లు- పోషక విలువలు ఉపయోగాలు
Posted Description: http://www.prajasakti.com/images/line_content.jpg
Description:
                    మనం కాలానుగుణంగా లభించే పండ్లను తింటుంటాం. కానీ కాలంలో పండ్లను తింటే శరీరానికి ఎటువంటి ఉపయోగమో తెలుసుకుంటే మంచిది. అసలే ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలంలో శరీరం నుండి చెమట ద్వారా ఎక్కువగా లవణాల బయటకు విసర్జించబడతాయి. మరలా వాటిని శరీరానికి అందించాలంటే రకమైన పండ్లను తినాలో తెలుసుకోవాలి. (ప్రతి 100 గ్రా.పండ్లలో...)
పుచ్చకాయ 
దీనిలో నీరు-96 గ్రా, కాల్షియం-11 గ్రా., ఫాస్పరస్-12 మి.గ్రా, ఐరన్-8 మి.గ్రా. ఇది రక్తహీనతను తగ్గించటంలో, సైనసైటిస్ నివారణకు తోడ్పడుతుంది.
మామిడి
నీరు-31గ్రా. ఖనిజలవణాలు -0.4గ్రా, కార్బొహైడ్రేట్లు-17గ్రా, కాల్షియం-14గ్రా, పాస్పరస్-16 మి.గ్రా. కెరోటిన్- 2743 మై.గ్రా., శక్తి - 74 కేలరీలు, విటమిన్ సి-10 మి.గ్రా ఉంటాయి. ఇది రేచీకటి నివారణకు, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు జలుబును ఎదుర్కొనేందుకు తోడ్పడుతుంది.
నిమ్మ
దీనిలో నీరు-85 గ్రా., కాల్షియం-90 గ్రా. పాస్ఫరస్-20 మి.గ్రా., విటమిన్ సి-63 మి.గ్రా., శక్తి-59 కేలరీలు ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తి పెంపొందడానికి, జలుబు, స్కర్వీ (విటమిన్ సి తగ్గినప్పుడు వచ్చేది) వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది.
జామ
నీరు- 82 గ్రా.,కార్బొహైడ్రేట్లు-11 గ్రా, కాల్షియం-10 గ్రా., పాస్ఫరస్-28 మి.గ్రా, విటమిన్ సి-212 మి.గ్రా, శక్తి-51 కేలరీలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ను, యూరిక్ ఆమ్ల గాఢతను తగ్గించటంలోను తోడ్పడుతుంది. దంతాల్ని పరిరక్షిస్తుంది.
బొప్పాయి
నీరు -91 గ్రా.,కార్బొహైడ్రేట్లు-8 గ్రా.,కాల్షియం-17 గ్రా., పాస్ఫరస్-13 మి.గ్రా, కెరోటిన్-666 మై.గ్రా., విటమిన్ సి-57 మి.గ్రా, శక్తి-32 కేలరీలు ఉంటాయి. దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి, ప్రోటీన్లు సులభంగా జీర్ణం కావడానికి, సుఖ విరోచనానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
కొబ్బరి నీరు
నీరు-94 గ్రా., కాల్షియం-24 గ్రా., పాస్ఫరస్-10 మి.గ్రా., కెరోటిన్-15 మై.గ్రా., శక్తి-24 కేలరీలు ఉంటాయి. ఎసిడిటి, కలరా, జీర్ణసంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
చెరకు రసం
నీరు-90 గ్రా., కార్బోహైడ్రేట్లు-10 గ్రా., కాల్షియం-10 గ్రా., పాస్పరస్-10 మి.గ్రా., శక్తి-39 కేలరీలు ఉంటాయి. ఎముకల బలానికి రీహైడ్రేషన్ ప్రక్రియలో ఉపయోగపడుతుంది.
బత్తాయి
నీరు-90 గ్రా., కార్బొహైడ్రేట్లు-11 గ్రా., కాల్షియం-26 గ్రా., పాస్ఫరస్-20మి.గ్రా., కెరోటిన్-1104 మి.గ్రా., విటమిన్ సి-30 మి.గ్రా., శక్తి-50 కేలరీలు. ఇది రోగ నిరోధకశక్తి పెరుగుదలకు, కొలెస్ట్రాల్ తగ్గించేందుకు, క్యాన్సర్ నుండి రక్షణకు తోడ్పడుతుంది.
సపోట
నీరు-75 గ్రా., కార్బొహైడ్రేట్లు-22 గ్రా., కాల్షియం-28 గ్రా., పాస్ఫరస్-27 మి.గ్రా., కెరోటిన్-97 మై.గ్రా., పీచు 3గ్రా., విటమిన్సి-6 మి.గ్రా., శక్తి-98 కేలరీలు లభిస్తాయి. ఇది జీర్ణశక్తికి మలబద్ధక నివారణకు, ఎముకల పటిష్టానికి, కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
అరటి
నీరు 70 గ్రా., కార్బొహైడ్రేట్లు-27 గ్రా., కాల్షియం-17 గ్రా., ఫాస్పరస్-36 మి.గ్రా., కెరోటిన్-78 మె.ౖగ్రా., శక్తి - 116 కేలరీలు లభిస్తాయి. ఇది జీర్ణ సంబంధ వ్యాధులు, మలబద్ధకం, రక్తహీనత, ఆర్థరైటిస్ నివారణకు తోడ్పడుతుంది.
ఆయుర్వేదంలో పిసిఒడి చికిత్స‌!
Posted On Mon 25 May 20:32:09.943853 2015
Description: http://www.prajasakti.com/images/line_content.jpg
Description:

               ఇటీవలి కాలంలో అధికశాతం యువతుల్లో పిసిడిఓ(పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) లక్షణాలు కనబడుతున్నాయి. కారణాలు ఏమైనప్పటికి దీని బాధితులు క్రమక్రమంగా అధికమవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి మానసిక ఆందోళన తోడవటం గమనించవలసిన అంశం. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ స్త్రీలలో వినాళగ్రంధులలో ఏర్పడే వైకల్యం. కారణం కచ్ఛితంగా ఏమిటనేది తెలియనప్పటికీ జన్యుపరమైన వైకల్యంగా పరిగణిస్తున్నారు
              
సాధారణంగా స్త్రీల శరీరంలోని అండాశయాలు హార్మోన్ల సమతుల్యతను నిర్వహిస్తుంటాయి. అండాశయాల్లో ఫాలికల్స్ అనబడే తిత్తుల్లో అండం పూర్తిగా ఎదిగిన తరువాత ప్రతినెలా ఒకటి లేదా రెండు అండాలు విడుదల అవుతాయి. క్రమాన్నే ఓవులేషన్ అంటాము. కాని పిసిఒ సిండ్రోమ్ ఉన్నవారిలో అండాశయాలు నార్మల్ సైజ్ కంటె రెండు నుంచి మూడు రెట్లు పెద్దవిగా ఉండి వాటిలో ముత్యాల సరంగా ఉండే ఒవేరియన్ సిస్ట్లు ద్రవంతో నిండితిత్తులుగా ఏర్పడతాయి. ఒవేరియన్ సిస్ట్లు ఏర్పడటానికి కారణం అండం ఎదుగుదల సరిగ్గా లేక అవి అండాశయాలలో నుంచి ఫాలోపియన్ ట్యూబ్లోకి విడుదల కాక తిత్తిగా మారిపోతాయి.
పిసిఒ సిండ్రోమ్ లక్షణాలు సుమారు పదిశాతం మంది స్త్రీలలో అదీ 12-45 సంవత్సరాల వయస్సు వారిలో ఉంటాయని అంచనా. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ యొక్క బలమైన కారణాలలో ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి. రక్తంలో అధికంగా ఉండే చక్కెర శాతంను తగ్గించడానికి ఎక్కువ స్థాయిలో ఇన్సులిన్ విడుదలై ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. శరీరంలో ఇన్సులిన్ శాతం అధికంగా ఉండడం మూలంగా అండాశయాల్లో మేల్ హార్మోన్లు అనగా టెస్టోస్టిరాన్లు ఎక్కువశాతం తయారవుతాయి.
స్త్రీరోగ విభాగంలో ఆయుర్వేద సంహితా గ్రంధాల్లో యోని వ్యాపత్తు అధికరణాలలో ఇరవై రకాలైన కారణ సంయుత లక్షణాలను విశేషంగా చర్చించారు. ముఖ్యంగా ఆర్తవదోషాలు, మిథ్యాహార విహారం (లైఫ్స్టైల్ మార్పులు), శుక్రశొణితజ దోషాలు (జెనిటిక్ వైకల్యాలు) కారణాలుగా పేర్కొన్నారు.
లక్షణాలు..
పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్తో బాధపడేవారందరిలోను ఒకే విధమైన లక్షణాలు ఉండాలని లేదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలంగా నష్టార్తవం (ఋతురక్తం వెడలకపోవడం) ఋతుక్రమం సరిగ్గా లేకపోవటం, ఓవులేషన్ (అండం విడుదల) లేకపోవటం, అవాంఛిత రోమాలు, మొటిమలు మొదలైనవి ఏర్పడతాయి. అండాశయంలో ఏర్పడే తిత్తుల మూలంగా ఒక్కోసారి పొత్తికడుపులో నొప్పి రావడం, రక్తస్రావం, నష్టార్తవం మొదలయినవి ఉంటాయి. ఇతర లక్షణాలు రక్తంలో కొవ్వుశాతం ఎక్కువగా ఉండటం, హైబిపీ, శరీరంలో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ల శాతం తక్కువగా ఉండటం, వెంట్రుకలు రాలిపోవడం, అధికంగా బరువు పెరగడం, చర్మం మీద నల్లటి మచ్చలు, గొంతులో తేడా రావడం, డిప్రెషన్ ఉంటాయి. ముఖ్యంగా వివాహానంతరం ఇన్ఫర్టిలిటి సమస్య అధికంగా ఉంటుంది. ఋతుక్రమం సరిగ్గా లేకపోవడం, అండం విడుదల కాకపోవడం, గర్భాశయపు లోపలి పొరలో వాపు రావడం అనగా ఎండోమెట్రయేసిన్ వంటిది జరుగుతుంది.
నిర్ధారణ ఎలా..?
లక్షణాలతో అవస్థలు పడే వారందరిలో అండాశయ తిత్తులు ఉండి తీరాలని లేదు. నిర్ధారణకు మాత్రం కటి ప్రదేశంలో అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా నిర్ధారణ కచ్చితంగా జరుగుతుంది.
పేషెంటు యొక్క మెడికల్ హిస్టరి, పీరియడ్స్ వివరాలు, రోగిని పరీక్ష చేయడం ద్వారా, రక్తంలో హార్మోన్ల శాతం మొదలైనవాటి ద్వారా వ్యాధి స్వరూపాన్ని అంచనా వేయవచ్చు. పై లక్షణాలను గమనించడం ద్వారా అనుభజ్ఞులైన వైద్యులు ప్రాథమిక నిర్ధారణ చేస్తారు.
చికిత్స..
పిసిఒ సిండ్రోమ్ కేవలం స్త్రీల గర్భాశయ సంబంధమే కాక మెదడులోని పిట్యూటరీ, హైపోథాలమస్ గ్రంథులపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ముందుగా అండాశయాలతో పాటుగా పైన చెప్పబడిన గ్రంథుల మధ్య సమన్వయం కుదిరేలా చికిత్స ఉండాలి. ముఖ్యంగా రక్తంలో ఇన్సులిన్ శాతం తగ్గించడం, సక్రమంగా అండం ఉత్పత్తి , విడుదల , ఋతు క్రమబద్ధీకరణ, చికిత్సలో ముఖ్యభాగంగా ఉంటుంది.
ఆధునిక వైద్యంలో లాప్రోస్కోపి విధానంతో ఒవేరియన్ డ్రిల్లంగ్ అనే విధానంతో 4-10ఫాలిక్యులార్ సిస్ట్లను డ్రిల్ చేసి చిట్లేలా చేస్తారు. కానీ, ఆయుర్వేదంలో సర్జరీ అవసరం లేకుండానే వ్యాధిని నివారించే అవకాశం ఉంది.
గర్భాశయ లోపలిపొర సున్నితత్వాన్ని కాపాడుతూ గర్భనిరోధక మాత్రలు కొంతవరకు ఋతుక్రమాన్ని సక్రమంగా వచ్చేటట్లు చేసినా వాటి దుష్పరిణామాలు అధికంగా ఉంటాయి. సాధారణ నిరసాయకారకాలైన ఆశోకారిష్టము, రజ ప్రవర్తిని, నష్టపుష్పాంతక రసం, జరకాద్యరిష్ట, దశమూలారిష్ట, ముండి చూర్ణం మొదలగు ఔషధాలు పిసిఒ సిండ్రోమ్కి సత్ఫలితాలను ఇస్తున్నాయి.
పిసిఒ సిండ్రోమ్ చికిత్సలో ముఖ్యభాగమైన పిట్యూటరీ , అండాశయాల మధ్య సమన్వయం, హార్మోన్ల సమతుల్యతను కాపాడే విధంగా నాగకేసర చూర్ణం, ముండి చూర్ణం, కాంచనార గుగ్గులు, నవగ్రహ సింధూరం, బృహతి చూర్ణం, కంటకారి చూర్ణం చాలా ఉపయోగప డుతాయి. ఔషధాల్లో ఉండే ఫైటోహార్మోన్ల మూలంగా శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది.
సహజంగా వీరికి ఉండే మానసిక ఒత్తిడి దూరం చేసేందుకు సుమేంటా, మానసమిత్ర వటి, మెంటాట్ డిఎస్, బ్రాహ్మివటి, శంఖపుష్పి మొదలగు ఔషధాలు బాగా ఉపయోగపడతాయి.
యోని వ్యాపత్తు రోగాలలో ఉత్తరనస్తి, పిచుప్రయోగం మంచి ఫలితాలను ఇస్తున్నాయి. తులసి, యష్టిమధు, ముండి, నాగకేశర వంటి ఔషధాల ప్రయోగాలు అంతర్జాతీయ పరిశోధనల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తున్నాయి.

No comments:

Post a Comment