Pages

Tuesday, 12 May 2015

What is varicose veins? how to resolve it?

వెరికోస్‌ వెయిన్స్‌తో సతమతం

టీచర్లు, ట్రాఫిక్‌ పోలీసులు, సెక్యూరిటీగార్డులు, మార్కెటింగ్‌ ఉద్యోగులు.. ఇలాంటి వాళ్లందరూ గంటల తరబడి నిల్చుని ఉద్యోగం చేయాల్సి వస్తుంది. దీనివల్ల మన దేశంలో ఏడు శాతం మందికి వెరికోస్‌ వెయిన్స్‌ వస్తోందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. కాళ్లలోని పిక్కలు, కింది భాగంలోని నరాలు మెలికలు తిరగడం, ఉబ్బడం ఈ వ్యాధి లక్షణం.
 
ముంబయిలోని వోక్‌హార్ట్‌ హాస్పిటల్‌ ఈ తాజా సర్వేను చేపట్టింది. చాలా మంది జబ్బు కనిపించిన వెంటనే వైద్య చికిత్స తీసుకోరు. అలాగే వదిలేస్తే.. కొన్నాళ్లకు పలు రకాల కాంప్లికేషన్స్‌ వస్తాయన్నది సర్వే నిపుణుల అభిప్రాయం. దాంతోపాటు మొండివ్యాధిగా మారే అవకాశం కూడా ఉంది. చాలామంది నరాలు ఉబ్బిన జబ్బును పెద్దగా పట్టించుకోరు. డయాగ్నసిస్‌ చేయించుకోరు. ముంబయిలోని వంద మంది ట్రాఫిక్‌ పోలీసులను వెరికోస్‌ వెయిన్స్‌కు సంబంధించిన పరీక్షల్ని చేశారు. వీరిలో అయిదు శాతం మందికి సమస్య ఉన్నట్లు తేలింది. ‘జబ్బు జీవితాన్ని ఏమీ చేయదుకాని కొంత జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల నరాలు బలహీనపడతాయి. ఇక్కడ మరొక సమస్య ఉంది- వెరికోస్‌ వెయిన్స్‌ సహజంగా పైకి కనిపిస్తుంది. అంటే నరాలు ఉబ్బినట్లు, మెలికలు తిరిగినట్లు కనిపిస్తాయన్నమాట. అయితే కొందరిలో ఇలా కనిపించదు. వీరికి జబ్బును గుర్తుపట్టడం కష్టం. కేవలం డయాగ్నసిస్‌ ద్వారా మాత్రమే నిర్ధారించగలము. సకాలంలో బాధితులకు చికిత్స చేయకపోతే శస్త్రచికిత్స కూడా అవసరం కావొచ్చు. ఈ జబ్బుకు ఇప్పుడు అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అలాంటిదే - ఎండో వెనస్‌ లేజర్‌ థెరఫీ (ఈఎల్‌విటి). ఇది చాలా సులువైన సురక్షితమైన చికిత్స. డేకేర్‌ అడ్మిషన్‌లోనే చేయించుకుని ఇంటికి వెళ్లొచ్చు’నని అధ్యయనకారులు పేర్కొన్నారు

No comments:

Post a Comment