Pages

Tuesday, 12 May 2015

Vepa - facepack

ఫేస్‌ ప్యాక్స్‌తో నిగనిగ (10-May-2015)

అందమైన, నునుపైన చర్మం కోసం ప్రతి మహిళా తహతహలాడుతుంది. అయితే బిజీ జీవితం వల్లనో లేదా చుట్టూ ఉండే వాతావరణ కాలుష్యం, సమ్మర్‌లో శరీరంపై సూర్యకిరణాలు పడటం వల్ల కావచ్చు... ఇలాగ ఉన్నపుడు చర్మం నిగారింపు తగ్గటం ఖాయం. శరీరంపై ఉండే మొటిమలు, చిన్నపాటి నల్లటి స్పాట్స్‌ని తొలగించాలంటే ఇంట్లోనే అందుబాటులో ఉండే హోమ్‌రెమెడీ్‌సతో ఫేస్‌ప్యాక్స్‌ తయారు చేసుకోవచ్చు.
అదెలాగో తెల్సుకుందాం.
 
వేపాకు, శెనగపిండి ఫేస్‌ప్యాక్‌
కావాల్సిన పదార్థాలు : 1 టేబుల్‌ స్పూన్‌ శెనగపిండి, 1 టీ స్పూన్‌ పెరుగు, రెండురెమ్మల వేపాకులు లేదా చిటికెడు వేపపొడి.
 
తయారీవిధానం : తొలుత ఒక కప్పులో పెరుగును తీసుకుని ఆ తర్వాత శెనగపిండి వేసి మిక్స్‌ చేయాలి. తర్వాత వేపపొడి లేదా వేపాకుల్ని కలిపి మూడింటినీ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడిగేసుకోవాలి. ఈ ప్యాక్‌లోని పెరుగు వల్ల ముఖచర్మం సాఫ్ట్‌గా తయారవుతుంది. వేపాకు వల్ల చర్మం కాంతివంతం అవుతుంది. దీంతో పాటు యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. 
 
బాదం, కుంకుమపువ్వు ఫేస్‌ప్యాక్‌
కావాల్సిన పదార్థాలు : 5 బాదం గింజల, 1 టేబుల్‌ స్పూన్‌ తేనె, కొంచెం కుంకుమపువ్వు, 1 టీస్పూన్‌ నిమ్మరసం.
 
తయారీవిధానం : ఫేస్‌ప్యాక్‌ చేసుకోవాలనుకున్న ముందురోజు రాత్రే పాలలో లేదా నీటిలో 5 బాదం గింజల్ని నానబెట్టాలి. దీంతో పాటు 2 టేబుల్‌ స్పూన్ల వేడిపాలలో తీసుకున్న ఆ కాస్త కుంకుమపువ్వుని నానబెట్టాలి. ముందుగా ఆ 5 బాదం గింజల్ని పేస్ట్‌లా గ్రైండ్‌ చేసుకోవాలి. దానికి కుంకుమపువ్వు, తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌కి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖం కడిగేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ని తరచుగా అప్లై చేస్తే ముఖంలో చక్కటి గ్లో వస్తుంది.
 
అరటి ఫేస్‌ప్యాక్‌
కావాల్సిన పదార్థాలు : 1 అరటి పండు, 1 టేబుల్‌ స్పూన్‌ పెరుగు, 1 టీ స్పూన్‌ నిమ్మరసం, 1 టీస్పూన్‌ తేనె
 
తయారీవిధానం : మొదట ఒక బౌల్‌ తీసుకుని అరటి పండును చిన్నపాటి ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత బౌల్‌లో తేనె, నిమ్మరసం కలిపి పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ మెత్తని పేస్ట్‌ని ముఖంతో పాటు మెడ భాగాలకి పట్టించుకోవాలి. ఈ పేస్ట్‌ ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తుంటే చర్మం తప్పకుండా కాంతివంతంగా మెరుస్తుంది.

No comments:

Post a Comment