Pages

Wednesday, 6 May 2015

Telugu juices - summer


కూల్ కూల్‌గా..:

ఎండలు ముదురుతున్నాయి. దప్పిక పెరుగుతోంది. దాహార్తిని తీర్చి, శక్తినిచ్చే పసందైన పండ్లరసాలు తాగడం అవసరం. వడదెబ్బ నుంచి రక్షణకు ఇదే మార్గం. ఈ సీజన్‌లో దొరికే పండ్ల రసాల్లో కొన్ని ఇలా తయారుచేసుకోవచ్చు.
అరటిపళ్ళ రసం
కావల్సినవి: మెత్తని అరటిపళ్లు - 6, పెరుగు - 1లీ. పంచదార - 1/2 కప్పు, నిమ్మకాయలు - 2, కొబ్బరిపాలు - 1 కప్పు, చెర్రీలు - అలంకరణకు సరిపడ, ఐస్‌ముక్కలు- 5, యాలకులు - 5 ఆరమగ్గిన అరటి పండ్ల ముక్కలు, పెరుగు, పంచదార కలిపి మిక్సీ పట్టాలి. అందులో కొబ్బరిపాలు పోసి, నిమ్మరసం వేసి కప్పుల్లోగాని, మగ్‌ల్లో కాని పోసి చెర్రీతో అలంకరించి సర్వ్ చేయండి.
ద్రాక్ష రసం
కావల్సినవి: ద్రాక్షపళ్ళు - 1/2 కేజీ, పంచదార - 1/2 కప్పు, యాలకులు - 5, నిమ్మరసం-5 చెంచాలు, కొబ్బరి - 2 చెంచాలు.
ద్రాక్ష పండ్లను బాగా కడిగి గింజలు తీసి మిక్సీ పట్టాలి. పంచదార, యాలకులు, నిమ్మరసం చేర్చి మిక్సీ పట్టి కొబ్బరికోరుతో అలంకరించి సర్వ్ చేయండి. పాకం పట్టిన పంచదార, ప్రిజర్‌వేటివ్, సిట్రిక్ యాసిడ్ వేస్తే ఇది ఆరు నెలలు నిల్వ ఉంటుంది.
పుచ్చకాయతో..
కావల్సినవి: పుచ్చకాయ ముక్కలు- 5 కప్పులు, పుదీనా ఆకులు - 1/2 కప్పు, మిర్చి - 1, ఉప్పు - 1 చెంచా, ఖర్జూరం ముక్కలు - 1 కప్పు, పంచదార - 1/4 కప్పు, ఐస్‌ముక్కలు- తగినన్ని, కొబ్బరి కోరు - 2 చెంచాలు.
తొక్కలు, గింజలు తీసేసిన పుచ్చముక్కలు, పంచదార, మిర్చి, ఖర్జూరం మిక్సీ పట్టాలి. ఆ మిశ్రమం లో పుదీనా ఆకులు, ఐస్‌ముక్కలు వేశాక కొబ్బరి కోరు చల్లి సర్వ్ చేయండి.
నిమ్మ, బత్తాయి జ్యూస్
కావల్సినవి: నిమ్మకాయలు - 5, బత్తాయిలు - 4, పంచదార - 1/2 కప్పు, ఉప్పు - 2 చెంచాలు, పచ్చిమిర్చి - 2, అల్లం కోరు - 2 చెంచాలు, కొబ్బరికోరు - 2 చెంచాలు, తేనె- నాలుగు చెంచాలు.
నిమ్మ, బత్తాయలను కడిగి రసం తియ్యాలి. అందులో పంచదార, అల్లం కోరు, కొబ్బరి, తేనె కలిపి సర్వ్ చేయండి. పంచదార పాకం పట్టి చల్లారాక ఈ రసం పోసి కలిపితే ఆరు నెలలు నిల్వ ఉంటుంది. కొబ్బరి, తేనె వంటివి జ్యూస్ తాగే ముందు కలపాలి

No comments:

Post a Comment