Pages

Wednesday, 6 May 2015

Home remedy for blood pressure (BP) telugu

రక్తపోటుకు ఇంటి వైద్యం

గుండె కొట్టుకుంటున్నపుడు సంకోచించి రక్తనాళాల ద్వారా రక్తాన్ని ఒత్తిడితో అన్ని శరీర భాగాలకు పంపుతుంది. రక్త నాళాలపై ఏర్పడిన ఈ రకమైన ఒత్తిడిని ‘‘సిస్టోలిక్‌ ప్రెషర్‌’’ అంటారు. ఇది సహజంగా రక్తపోటులో సూచించే 120/80 అంకెల్లో పెద్దది. పైన ఉండే నంబర్‌ అయిన 120 అంకెను సూచిస్తుంది. అలాగే గుండె వ్యాకోచించినపుడు గుండె చప్పుళ్ళ మధ్య గుండె కండరం విశ్రాంతి తీసుకుంటున్నపుడు తిరిగి రక్తంతో నింపబడేటప్పుడు కలిగే ఒత్తిడిని‘‘డయాస్టోలిక్‌ ప్రెషర్‌’’ అంటారు. ఇది 120/80 అంకెల్లో చిన్నది, క్రింది నంబరు అయిన 80ను సూచిస్తుంది. సహజంగా ఆరోగ్యవంతుని రక్త ఒత్తిడి 120/80 కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఈ రక్తఒత్తిడి 120/80 కంటే ఎక్కువ ఉంటే దాన్నే రక్తపోటు అంటారు. ఆధునిక వైద్యులు ‘‘బ్లడ్‌ ప్రెషర్‌’’ అంటారు. ఆయుర్వేదంలో రక్తవాతం అంటారు.
 
- సిస్టోలిక్‌ 120 కంటే తక్కువ, డయాస్టోలిక్‌ 80 కంటే తక్కువ ఉంటే సాధారణ స్థాయిగా గుర్తించాలి.
 
- రక్తపోటు వచ్చేముందు ‘‘సిస్టోలిక్‌ 120-139’’ వరకు, డయాస్టోలిక్‌ 80-89 వరకు ఉన్నపుడు రక్తపోటు వచ్చే దశలో ఉన్నట్టు తెలుసుకోవాలి.
 
మొదటిదశ: సిస్టోలిక్‌ ప్రెషర్‌ 140-159 వరకు, డయాస్టోలిక్‌ ప్రెషర్‌ 90-99 వరకు ఉన్నపుడు మొదటి దశగా గుర్తించాలి.
 
రెండవదశ: సిస్టోలిక్‌ ప్రెషర్‌ - 160 లేక అంతకన్నా ఎక్కువ.. డయాస్టోలిక్‌ప్రెషర్‌- 100 లేక అంతకన్నా ఎక్కువ ఉంటే
అధిక రక్తపోటు రెండవదశగా గుర్తించాలి.
 
అత్యవసర వైద్యం: సిస్టోలిక్‌ ప్రెషర్‌- 180 కంటే ఎక్కువ.. డయాస్టోలిక్‌ప్రెషర్‌- 110 కంటే ఎక్కువ ఉంటే తక్షణం వైద్య సహకారం అందివ్వాల్సిన దశగా గుర్తించాలి.
 
బ్లడ్‌ ప్రెషర్‌ సాధారణ స్థాయికంటే ఎక్కువ ఉన్నపుడు చాలాసార్లు రీడింగ్‌ తీసి నిర్ధారించుకోవాలి. అంతేగాని ఒకసారి రీడింగు తీసి బ్లడ్‌ ప్రెషర్‌ ఉన్నట్లు నిర్ధారించకూడదు. 140/90 ఉన్నవారు మాత్రమే మందులు ప్రారంభించాల్సి వస్తుంది. వయస్సు మీరిన వారిలో శ్రమజీవుల్లో రక్తపోటు ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది. జ్వరం, కోపం, మానసిక ఉద్వేగాల్లో రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. నిద్రపోయేప్పుడు అందరిలో రక్తపోటు తక్కువస్థాయిలో ఉండటం సహజం. ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడటం, మానసిక ఆందోళనలు, నిద్రలేమి, కిడ్నీ వ్యాధులు మొదలైనవి అధిక రక్తపోటుకు కారణమవుతాయి.
 
ఇంటి వైద్యం..
 - ఒక గ్రాము వెల్లుల్లిని మెత్తగా నూరి కప్పు మజ్జిగలో కలిపి రోజూ మూడు పూటలా తాగుతుంటే వ్యాధి అదుపులోకి వస్తుంది. వెల్లుల్లి వాసన గిట్టని వారు నెయ్యిలో దోరగా వేయించి వాడుకోవచ్చు.
 
- సర్పగ్రంధ పౌడరును (మూలికల షాపుల్లో దొరుకుతుంది) అర టీ స్పూన్‌ చొప్పున రోజుకి 3 సార్లు నీటితో కలిపి ఇస్తుండాలి.
 
- ఆయుర్వేద షాపుల్లో దొరికే క్షీరబలాతైలం (వందసార్లు కాచి తయారు చేసింది) రోజూ ఉదయం 5 చుక్కలు కప్పు పాలల్లో కలిపి తాగుతుండాలి.
 
- ఒక టీ స్పూన్‌ ఉసిరికాయ రసాన్ని ఒక టీ స్పూన్‌ తేనెతో కలిపి రోజూ ఉదయాన్నే తాగుతుంటే వ్యాధి అదుపులోకి వస్తుంది.
 
- తరచుగా నల్లద్రాక్ష పండ్లుగాని, రసాన్ని గాని తీసుకుంటుంటే వ్యాధి అదుపులోకి వస్తుంది.
 
- బంగాళాదుంపలు పై చర్మంతో పాటు బాగా ఉడికించి చర్మం వలిచి తినడం వల్ల వ్యాధిని నియంత్రించవచ్చు.
 
- మందార పువ్వులను ఎండించి పొడిగా నలిపి పాలతో టీగా కాచి రోజుకి 2-3 సార్లు ప్రతి రోజు తాగుతుంటే వ్యాధి అదుపులోకి వస్తుంది.
 
- దాల్చిన పౌడరును కూరల్లో, వేపుళ్లు, టిఫిన్లలో, కాఫీలో చల్లుకొని వాడటం వల్ల కూడా బి.పి.ని అదుపు చేయొచ్చు.
 
- ప్రతి రోజూ టీలో యాలకుల చూర్ణం కలిపి తాగాలి. ఈ అలవాటు వల్ల బి.పి. త్వరగా కంట్రోల్‌లోకి వస్తుంది.
 
- చారెడు ధనియాలు దంచి వెడల్పు స్టీలు గిన్నెలో పోసి 200 గ్రాముల నీటిని పోసి మంచులో కానీ, ఫ్రిజ్‌లో కానీ రాత్రంతా పెట్టి ఉదయాన్నే వడబోసి చక్కెర కలిపి తాగితే(చక్కర వ్యాధి లేనివారు) వారంలోనే వ్యాధి అదుపులోకి వస్తుంది.
 

No comments:

Post a Comment