Pages

Tuesday, 12 May 2015

Cheek pain due to Social fobia

సోషల్‌ ఫోబియాతో దవడ నొప్పి!

సోషల్‌ ఫోబియాతో బాధపడేవాళ్లను చాలామందిని మనం చూస్తుంటాం. వీళ్లు తొందరగా యాంగ్జయిటీకి గురవుతుంటారు. వీళ్లల్లో యాంగ్జయిటీతోపాటు మరికొన్ని కొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయని ఇటీవల చేసిన ఒక స్టడీలో వెల్లడైంది. సోషల్‌ ఫోబియాతో బాధపడేవాళ్లకి దవడనొప్పి కూడా వస్తుందట. అంతేకాదు ఇలాంటి వాళ్లల్లో పళ్లు నూరే అలవాటు బాగా ఉంటుందిట. అది కూడా నిద్రపోయేటప్పుడు ఈ అలవాటు బాగా ఉంటుందిట. ఇలా పళ్లు నూరడం వల్ల దంతాల పైభాగం దెబ్బతినడమే కాదు వాటి రూపు సైతం పాడవుతుంది. నలుగురిలో తిరగాల్సి వస్తే ఇలాంటి వాళ్లు సోషల్‌ ఫోబియాకు గురవుతారు. దీంతో పళ్లు నూరే అలవాటు వీళ్లల్లో పెరుగుతుందని స్టడీలో తేలింది.
 
ఈ స్టడీని ఇజ్రాయిల్‌లోని టెల్‌ అవివ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఎఫ్రైమ్‌ వినోకర్‌ నిర్వహించారు. ఇలాంటి వ్యక్తులలోని సోషల్‌ యాంగ్జయిటీకి చికిత్స నందిస్తూనే వారిలోని పళ్లు నూరే అలవాటును కూడా తగ్గించవచ్చని ఆయన చెప్పారు. పళ్లు నూరే సమస్యకు యాంటి డిప్రసెంట్‌ డ్రగ్స్‌ కారణమని గతంలో చేసిన కొన్ని పరిశోధనలు పేర్కొన్నాయి కానీ అలాంటిదేమీ తమ స్టడీలో నిరూపణ కాలేదని ఎఫ్రైమ్‌ వినోకర్‌ స్పష్టంచేశారు. ఈ స్టడీలో భాగంగా ముప్పై ఏళ్లలోపు వయసున్ను 75 మంది సీ్త్రపురుషులను ప్రశ్నించారు. వారిలో ఒక బృందంలో ఉన్న 40 మందిలో సోషల్‌ ఫోబియా ఉన్నట్టు తేలింది. ఇంకో బృందంలో ఉన్న 35 మందిలో సోషల్‌ ఫోబియా లేదు. ఈ స్టడీలో పాల్గొన్న అభ్యర్థులందరికీ సైకియాట్రిక్‌, దంత సంబంధమైన పరీక్షలను నిర్వహించారు. పళ్లు నూరే అలవాటు, ఓరల్‌ హాబిట్స్‌, గమ్‌ చూయింగ్‌, గోళ్లు కొరకడం వంటి అలవాట్లు వారికి ఉన్నాయా లేదా అన్న విషయాలను వాళ్లని అడిగి తెలుసుకున్నారు.
 
దవడల కదలికను గమనించారు. మొత్త్తానికి ఈ స్టడీలో సోషల్‌ ఫోబియా ఉన్న 42.1 శాతం మందిలో కొందరిలో దంతాల తొడుగులు తీవ్రంగా, మరికొందరిలో పరిమితంగా దెబ్బతినడాన్ని అధ్యయనకారులు గుర్తించారు. ఫోబియా నియంత్రణలో ఉన్న వారిలో 28.6 శాతం మందిలో దంతాలు దెబ్బతినడం గమనించారు. అలాగే ఫోబియా అధికంగా ఉన్న వారిలో దవడ కదలికల రేటు 32.5 శాతం ఉంటే, ఫోబియా నియంత్రణలో ఉన్న వారిలో దీని శాతం 12.1 ఉందని స్టడీలో వెల్లడైంది. 

No comments:

Post a Comment