ఇంట్లో క్యాబేజీ కూర అనగానే ముఖం అదోలా పెడుతున్నారా? దాని ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం ఇష్టంగా తినేస్తారు. క్యారెట్‌తో సమానంగా కంటిచూపుని మెరుగుపరిచే గుణాలు ఇందులో ఉన్నాయి. కాకపోతే వేపుడుగా కన్నా ఉడికించి తాలింపు వేసి తింటే మంచిది. రక్తాన్ని శుభ్రపరిచి, కండరాలు, ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. దీనిలోని పోషకాలు కేన్సర్ల బారిన పడకుండా కాపాడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులూ, రొమ్ము, గర్భాశయ ముఖ ద్వార కేన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. తాజా క్యాబేజీ రసాన్ని తాగడం వల్ల అంతర్గతంగా ఉండే అల్సర్లు తగ్గుతాయి. ఇనుమూ, సల్ఫర్‌లతో పాటూ దీన్లో ఉండే కొన్ని రకాల ఖనిజాలు శరీరంలో వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ ఇదెంతో ఉపయోగపడుతుంది. క్యాబేజీలో ఉండే టార్ టారిక్ ఆమ్లం కొవ్వుని కరిగించి, బరువు తగ్గేట్లు చేస్తుంది. మలబద్దకం నివారించే పీచుపదార్థం దీన్లో ఎక్కువగా ఉంటుంది. చక్కటి కంటిచూపునకు తోడ్పడే విటమిన్ ఎ, ఎముకలకు శక్తినిచ్చే క్యాల్షియంతో పాటూ విటమిన్ బి6, ఫాలేట్, రైబోఫ్లెవిన్ వంటి పోషకాలు క్యాబేజీ నుంచి అందుతాయి.
|
Pages
▼
No comments:
Post a Comment