Pages

Monday, 29 September 2014

కడుపులో గడబిడ పోయేది ఎలా?


కడుపు మొత్తం గ్యాస్‌తో ఉబ్బి ఉండి, కడుపులో నొప్పిగా ఉంటుంది. విరేచనము వచ్చినట్లుగా ఉంటుంది కాని రాదు.. ఒకవేళ విరేచనం అయితే వరుసగా అవుతూంటాయి. లేదంటే విరేచనం అసలే కాదు. ఇది ఏమి వ్యాధి అబ్బా అని... పరీక్షలన్నీ చేయంచినా అన్ని నార్మల్‌గానే వస్తాయి. కాని వ్యాధి మాత్రం వేధిస్తూనే ఉంటుంది. ఈ నవీన యుగంలో చాలామందిని బాధిస్తున్న ఈ సమస్యనే వైద్య పరిభాషలో ఐబిఎస్ (ఇర్రిటేబుల్ బోవెల్ సిండ్రోమ్) అంటారు.
దీనికి కారణం మారిన జీవనశైలి విధానాలే అని చెప్పవచ్చు. క్షణం తీరిక లేక కాలంతో పరుగులు, వేళకు తీసుకోని ఆహారం, చీటికి మాటికి చిరాకు, కారణం లేకుండానే కోపం, వీటితోపాటు నిత్యం ఎదుర్కొనే రకరకాల మానసిక ఒత్తిళ్ళు తోడుకావడంతో ఐబిఎస్ సమస్య తీవ్రరూపం దాలుస్తున్నది. ఇంతగా వేధిస్తున్న ఈ వ్యాధిని నివారించటానికి హోమియో వైద్యంలో మంచి మందులు ఉన్నాయి. వ్యక్తి శారీరిక, మానసిక లక్షణాలను మరియు అలవాట్లు, జీవన విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వైద్యం చేసిన మంచి ఫలితం ఉంటుంది.
లక్షణాలు
-కడుపు నొప్పి స్వల్పంగాగాని, మెలి పెట్టినట్లుగా గాని ఉంటుంది.
-తేన్పులు ఎక్కువగా ఉండటం
-గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండటం
-కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు రావడం
-మల విసర్జన సరిగా పూర్తిగా కాదు.
-కొన్ని సందర్భాలలో భోజనం చేసిన వెంటనే మల విసర్జనకు వెళ్లాలనిపించటం.
-నీరసంగా ఉండటం, ఏకాగ్రత లోపించటం.
-నీళ్ల విరేచనాలు కాని, జిగట విరోచనాలు గాని కనిపిస్తాయి.
-తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, వాంతులు కావడం.
-జీవన విధానం సక్రమంగా జరగక ఆందోళన, మానసిక ఒత్తిడి పెరుగును.
జాగ్రత్తలు
-్ఫస్ట్ఫుడ్స్, ఆయిల్‌ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు, మానివేయాలి. ఆల్కహాలు మానివేయాలి
-నిలువ ఉంచిన పచ్చళ్లు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి.
-నీరు సరిపడినంతగా తాగాలి. టీ, కాలు మానివేయాలి.
-మానసిక ఒత్తిడిని నివారించడానికి యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి.
మందులు
లైకోపోడియం
వీరు మలబద్ధకంతో బాధపడుతుంటారు. మలవిసర్జన సాఫీగా జరుగక ముక్కలు ముక్కలుగా వస్తుంటుంది. వీరు కొంచెం తినగానే పొట్ట ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. వీరికి బాధలన్ని సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల మధ్యలో ఎక్కువగా ఉంటాయి. మానసిక స్థాయిలో వీరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు.
వీరికి లోపల భయం ఉన్నా పైకి మాత్రం భయం లేనట్లుగా వ్యవహరిస్తారు. వీరికి అహంభావం ఎక్కువగా ఉంటుంది. వీరు సమాజంలో లీడర్‌లాగా ఉండాలనుకుంటారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
నైట్రోమోర్: వీరికి మలం పెంటికలలాగా అవుతుంటుంది. వీరు తల నొప్పితో బాధపడుతుంటారు. వీరికి ఉప్పు చాలా ఇష్టం. వీరికి బాధలన్నీ ఉదయం 10 గంటల నుండి 11 గంటల మధ్యలో ఎక్కువగా ఉంటాయి. వీరు ఓదార్పును ఇష్టపడరు. అలాగే వీరు దుఃఖభారంతో కుంగిపోయి ఉంటారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
నక్స్‌వామికా: విరేచనం ఒకేసారి కాకుండా మళ్లీ మళ్లీ వస్తూ ఉంటుంది. పొట్టలో గ్యాస్‌తో సతమతమవుతుంటారు. మసాలాలు, ఫాస్ట్ఫుడ్స్, కాఫీలు ఎక్కువగా సేవించడం, శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక శ్రమ ఎక్కువ, ఎప్పుడు పని గురించే ఆలోచిస్తూ ఉన్నవారికి ఈ మందు ఆలోచించదగినది. మానసిక స్థాయిలో వీరికి కోపం ఎక్కువ. శబ్దాలు, వెలుతురు భరించలేరు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
యాలోస్: వీరికి పొట్టలో గ్యాస్ ఎక్కువగా ఉండి, విరేచనం ఆపుకోలేనంత వేగంగా వస్తుంది. వీరు బాత్‌రూంకి వెళ్ళేంత లోపలనే మల విసర్జన జరిగిపోతుంది. వీరికి మల విసర్జన గ్యాస్‌తోపాటుగా నీళ్లు నీళ్లుగా అవుతుంది. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
అర్జెంటం నైట్రికం: పొట్టలో నొప్పి ఉండి తేన్పులు ఎక్కువగా ఉంటాయి. తిన్న తరువాత పొట్టలో నొప్పి ప్రారంభమవుతుంది. వీరు మానసిక స్థాయిలో ఆందోళన చెందుతుంటారు. ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినా ఎవరైనా వస్తున్నారని తెలిసినా, ఏదైనా పని తలపెట్టినా గందరగోళంలో పడిపోతారు.
ఎనాకార్డియం: వీరికి పొట్టలో నొప్పి ఏదైనా తిన్న తరువాత తాత్కాలికంగా తగ్గుతుంది. మళ్లీ నొప్పి రెండు గంటల తరువాత మొదలవడం గమనించదగిన లక్షణం. వీరు మానసిక స్థాయిలో మతిమరుపు ఎక్కువగా ఉండి దుర్భాషలాడే స్వభావంతో ఉంటారు. ఇటువంటి వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఆర్సినికం ఆల్బం: ఈ మందు జీర్ణాశయ వ్యాధులకు తప్పక ఆలోచించదగినది. కడుపులో గడబిడలతో తేన్పులు రావడంతోపాటు వాంతికి వచ్చినట్లుగా అనిపించడం, నీళ్ల విరోచనాలు, జిగట విరోచనాలు, తరచుగా దాహం, ఒళ్లునొప్పులు, మానసిక స్థాయిలో ఆందోళన, భయం వంటి లక్షణాలున్నవారికి ఈ మందు వాడుకోదగినది.
ఫాస్ఫరస్: పొట్టలో అల్సర్ ఉండి వీరికి రక్తం కూడా పడుతుంటుంది. విపరీతమైన నొప్పి ఉంటుంది. చల్లటి పదార్థాలు, ఐస్‌క్రీములు తింటే నొప్పి ఉపశమిస్తుంది. వీరు మానసిక స్థాయిలో భయస్థులు. ఉరుములు మెరుపులు అంటే భయపడతారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
ఈ మందులే కాకుండా గ్రాఫైటిస్ ఇపికాక్, బ్రయోనియా, సల్ఫర్, కార్బొవెజ్, చైనా వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడితే కడుపులో గడబిడల నుండి విముక్తి పొందవచ్చు
.

No comments:

Post a Comment