Pages

Thursday, 28 August 2014




NewsListandDetails కొద్దికొద్దిగా మీ ముఖం ఉబ్బుతూ చెక్కిళ్లు తెల్లగా మెరుస్తూ ఆకలి కొంచెం తగ్గి తొందరగా అలసిపోతుంటే మీ రక్తం క్షీణిస్తున్నదని సూచన. భగవంతుడు మనని మనం చూసుకుంటే మన శరీరంలో అంతర్గతంగా వచ్చే మార్పులని మనకి సూచిస్తుంటాడు.
పూర్వం పెద్దవాళ్ళు అమ్మాయీ! అది మెరుపు కాదమ్మా. పాలిపోతున్న చెక్కిళ్ళు. జాగ్రత్త! అని హెచ్చరించేవారు. ఈ రక్తక్షీణతని ఎనీమియా లేదా పాండు అంటారు. పాండు వ్యాధి అంటే అన్నిరకాల రక్తజవ్యాధులు అంటే తెల్లకణాలు చచ్చిపోవడం నుండి రక్తం పరిమాణంలో తగ్గే స్థితి వరకు అన్ని వ్యాధులు వస్తాయి.
ఈశ్వరుడు మన శరీరంలోనే మన రక్తం తయారయ్యే ఒక ఫ్యాక్టరీని పెట్టాడు. దాన్ని రెటిక్యులో ఎండో తేలియల్‌ సిస్టమ్‌ అంటారు. ఈ ఫ్యాక్టరీకి ముడిసరుకు మనం తినే ఆహారరూపంలో నోటిగుండా ఆమపక్వాశయాల ద్వారా నలిపి కలిపి వడపోసి, వండి మార్పు చెందిన సిద్ధపదార్థాన్ని మన సిద్ధ ఎముకల లోపలికి చేరిస్తే అది రక్తంగా తయారై లివరు స్ప్లీన్‌లకు చేరి నిల్వచేయబడుతుంది.
అదే హృదయాన్ని చేరి అక్కడి నుండి సర్వశరీరాలకి వ్యాపించి ప్రతి జీవకణానికీ పోషకత్వాన్ని ఇచ్చి మనలని జీవింపచేస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని రంజిక పిత్తం అని అంటారు. హృదయ చలనానికి వ్యానవాతమనే శక్తి కారణమవ్ఞతున్నది. అసలు ఈ రక్తానికి ఎరుపు రంగు రావటానికి కారణం రంజికపిత్తం. దాన్నే ఆర్‌బిసి అని అంటారు ఆధునికులు. యోగవాశిష్టం ప్రకారం మనకి రెండు హృదయాలు. ఒకటి చాతీలోను, రెండవది తలలోను ఉంటుంది.
కాని భావన స్పందనల హృదయం తలలో ఉంటే సర్వ చైతన్యరూపమైన రక్తాన్ని నిరంతరం నియమానుసారంగా సర్వశరీరానికి వ్యాపింపచేసేది మన గుండె.
పాండు అనేదానికి తెలుపు లేదా లేత పసుపు పచ్చరంగు అని అర్థం. రక్తక్షీణత వల్ల చర్మం, గోళ్ళు, పెదిమలు ఈరంగులోకొస్తాయని దీన్ని పాండువ్యాధి అంటారు.
ఈ రక్తం ప్రమాదం వల్ల కాని, స్రావం కాని పోవచ్చు. లేదా ఉన్న రక్తం ఏవైనా తీక్షణమైన మందుల వల్ల నాశనం కావచ్చు. లేదా అంతర్గతంగా ఉండే స్రావం వల్ల తగ్గిపోవచ్చు లేదా లివరు స్ప్లీన్‌ల ఎముక లోపలి గుజ్జు వీటిలో వ్యాధుల వల్ల రక్తక్షీణత రావచ్చు.
ఎలా గుర్తించడం
- ముఖం ఉబ్బరిస్తుంది. కళ్లు కొంచెం పచ్చబడతాయి.
-  చర్మం కొంచెం తెలుపుతో మెరుస్తూ ఉంటుంది.
-  ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టమవుతుంది.
-  కాళ్లు, చేతులు లాగుతూ ఉంటాయి.
-  అన్నం తిన్నాక ఉబ్బరంగా ఉండి, కొంచెం, కొంచెం రంగు మారి మలం వస్తూ ఉంటుంది.
-  నీరసంగా ఉండి ఎప్పుడూ పడుకోవాలనిపిస్తుంది. బి పి తగ్గుతుంది. గుండె దడగా ఉంటుంది .
-  ఆకలి తగ్గుతుంది. కళ్లకింద, పాదాల దగ్గర కొంచెం వాపు కనిపిస్తుంది.
-  స్ప్లీను కొంచెం మెరుగుతుంది. కాళ్ళు వ్రేళ్ళ మధ్య పగుళ్ళు కనిపించి చర్మం ఎండినట్లుంటుంది.  
-  తరచుగా మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలు వచ్చినవాళ్ళు, ఫైల్సుఉన్నవాళ్లు, కామెర్లు వచ్చి తగ్గినవాళ్ళు ఆపరేషనయ్యాక ఈ ఎనీమియా రాకుండా చూసుకోవాలి.
-  మీరు కాని, మీ బాబుకాని, బియ్యం, సున్నం, చాక్‌పీసు తినాల నిపించడం. రాత్రుళ్ళు పళ్లు కొరకడం లాంటివి ఉంటే కడుపులో క్రిములు న్నాయని గ్రహించండి. ఇవి కూడా రక్తాన్ని పీల్చి మనకి ఎనీమియాని తీసుకొస్తాయి. కడుపు ఉబ్బరించి నులినొప్పితో కొంచెం కొంచెం విరేచనం అవుతుంటే మీలో ఎమీబియాసిస్‌ ఉన్నట్లే.
అదికూడా రక్తక్షీణతకి కారణమై లివరును పాడుచేస్తుంది. రక్తం క్షీణిస్తున్నపుడు అంటే ఎనీమియా ఉన్నప్పుడు మీకు చల్లనివి, పుల్లనివి రుచికరమై నటువంటి పదార్థాలు తినాలనిపిస్తుంది. ఆధునిక వైద్యంలో రక్తపరీక్ష ద్వారా ఈ వ్యాధిని గుర్తిస్తారు.
ఐరన్‌, ఫోలిక్‌ ఆసిడ్‌ వంటి వాటితో చికిత్స చేస్తారు. ఆయుర్వేదంలో ఈ వ్యాధికి కారణమైనదానికి ముందుగామందిచ్చి దాంతో రక్తవృద్ధి ఔషధాలు ఇస్తారు.
ఆయుర్వేదాచార్యులు అతి పులుపు, ఉప్పు, ఉన్న ఆహారం ఎక్కువగా తినడం, తనకి పడని ఆహారం తినడం, మినుము, నువ్వులనూనె విస్తారంగా వాడటం, అజీర్ణాదులు ఈ వ్యాధికి కారణమంటారు.
అలాగే భయం, కోపం, అతి కోరిక, విచారాదుల వంటి మానసిక కారణాలు కూడా ఈ వ్యాధికి కారణమవ్ఞతాయి. వాళ్ల చేతులు, ముఖంలో వాపు వచ్చి మధ్యభాగం క్షీణిస్తుంటే వ్యాధి తీవ్రమైందని గుర్తించాలి.
చికిత్స
లోహసనం, పునర్నవాది మండూరం, హరీతకీ చూర్ణం, కుమార్యాసనం చాలా మంచివి. గోధుమ, శాలి ధాన్యం, కందిపప్పు, మజ్జిగ, పాలు హితకరం.  ఆహారం సరిగా జీర్ణమై రక్తంగా మారటానికి అవసరమైన జఠరాగ్ని చికిత్స అవసరం. ధనియాలు 100గ్రా. జీలకర్ర 100గ్రా. వాము 50గ్రా, కందిపప్పు 00గ్రా, మిరియాలు 10గ్రా. కలిపి వేయించి పొడిచేసుకుని మొదటి ముద్దలో తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. శొంఠి, పిప్పలి, మిరియాలు, ఆకుపత్రి, రేగుగింజల పప్పు కలిపి మెత్తగా నూరి తేనెతో తీసుకుంటే చాలా హితకరం. గోంగూర, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలు రక్తాన్ని వృద్ధి పరుస్తాయి. ఇనుప మూకుడులో చేసిన గోంగూర కూర గర్భిణీ స్త్రీలలో పాండు వ్యాధిని తగ్గించినట్లు కాశీ విశ్వవిద్యాలయ పరిశోధనలలో తేలింది. రాత్రి పడుకునేముందు పటికబెల్లం పొడి కలిపిన పాలు తాగడం వల్ల రక్తం వృద్ధి అవుతుంది.  ఒక తులం పసుపు చూర్ణం, నాలుగు తులాల పెరుగులో కలుపుకొని తింటూంటే రక్తదోషాలన్నీ పోతాయి. ద్రాక్ష, దానిమ్మ, కేరట్‌, బీట్రూట్‌ రసాలు రక్తాన్ని వృద్ధి చేస్తాయి. బలమైన ఆహారం చల్లటి పదార్థాలు, మసాలా వస్తువ్ఞలు, శనగపిండితో చేసినవి తినకూడదు. పాండువ్యాధి ఇతర వ్యాధులకి ఆహ్వానం కాకూడదు.

No comments:

Post a Comment