Pages

Bank PO, Gk, Reasoning, Questions


పోటీ పరీక్షల ప్రత్యేకం


1. సంతాన సాగరం అనే పెద్ద తటాకాన్ని ఎవరు తవ్వించారు?

- సూరమాంబ (పెదకోమటి వేమారెడ్డి భార్య)

2. ప్రబంధ పరమేశ్వరుడు, శంబుదాసుడు అనే బిరుదులున్న కవి? - ఎర్రాప్రగడ

3. స్వతంత్ర రెడ్డి రాజ్య స్థాపకుడు ?- ప్రోలయ వేమారెడ్డి

4. కావ్యాలంకార చూడామణి రచయిత ? 

- విన్నకోట పెద్దన్న

5. రెడ్డి రాజుల కాలంలో నాణేలను ఏమని పిలిచేవారు ?

- టంకాలు

6. శ్రీశైలంలో వీరశిరో మండపం ఎవరు నిర్మించారు ? 
- అనవేమారెడ్డి
7. రణముకుడుపు అనే బైరవ తాంత్రిక విధానం ఏ రాజుల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంది ? 
- రేచర్ల వెలమలు
8. రేచర్ల పద్మనాయకులు ఏ మతాన్ని అధికంగా ఆదరించారు ? - వైష్ణవ మతం
9. ఏ రెడ్డిరాజు క్రీ.శ 1358లో మోటుపల్లి ఓడరేవును ఆధునీకరించి వర్తకుల కోసం అభయశాసనం పునరుద్దరించాడు ? - అనవోతారెడ్డి
10. పల్నాడుసీమలో రంభయైన ఏకులు వడుకున్‌ అని వర్ణించిన కవి ఎవరు ? - శ్రీనాథుడు
11.వేమభూపాల చరిత్ర అనే గద్యకావ్యాన్ని ఎవరు రచించారు ? - వామనభట్ట బాణుడు
12.కైఫీయతులు అంటే ఏమిటి ? 
- స్థానిక చరిత్రలు తెలిపేది
13. చాటుకృతులు అంటే ఏమిటి ? 
- రాజులను పొగిడే గీతాలు
14. ధర్మ ప్రతిష్టాపన గురు అనే బిరుదున్న రాజు ? 
- ప్రోలయవేమారెడ్డి
15. రెడ్డిరాజుల చరిత్రలో బ్రాహ్మణశక్తి ఒక అపూర్వ విచిత్రఘట్టమని ఆది నభూతో నభవిష్యత్‌ అని పేర్కొన్నవారు ఎవరు ? - సురవరం ప్రతాపరెడ్డి
16.యాజ్ఞవల్కస్కృతి, నారదస్కృతి, మితాక్షరి వంటి గ్రంథాలు ఏ అంశాన్ని విశదీకరిస్తాయి ? 
- న్యాయవ్యవస్థ (నేరాలు - శిక్షలు)
17. గుడి కట్టు లేఖలు, దండక వెలలు లాంటి ఖాతా పుస్తకాలు ఏ అంశాన్ని వివరిస్తాయి ? 
- గ్రామ సీమల జమా ఖర్చులను 
18. సర్వజ్ఞ కళ్యాణభూపతి బిరుదులున్న రాజు ? 
- సింగభూపాలుడు
19. నవనాథచరిత్ర రచయిత ? - గౌరన
20.రత్నపాంచాలిక అనే సంస్కృత నాటక రచయిత ? 
- సర్వజ్ఞ సింగభూపాలుడు
21. సర్వజ్ఞ సింగభూపాలుడు సంస్కృత భాషలో రచించిన రసార్ణవసుధాకరం ఏ అంశాన్ని విశదీకరిస్తుంది ? 
- అలంకార శాస్త్రం
22. రేచర్ల పద్మనాయకులకు - ముసునూరి కాపయనాయుడుకి మధ్య క్రీ.శ 1367-68లో ఎక్కడ యుద్ధం జరిగింది ? 
- భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా)
23. చమత్కారం చంద్రిక రచయిత ? - విశ్వేశ్వర కవి
24.సారంగదేవుని సంగీతరత్నాకరానికి వ్యాఖ్యానం రాసిన రేచర్ల వెలమ ప్రభువు ? - కుమారసింగ భూపాలుడు
25. కౌలాస దుర్గాన్ని (నిజామాబాద్‌) అల్లా ఉద్దీన్‌ హసన్‌ గంగూకు సంధి ఫలితంగా అప్పగించిన ముసునూరి నాయకుడెవరు ? - ముసునూరి కాపయనాయుడు
26.ఆంధ్ర మహాభాగతం రచయిత ? 
- బమ్మెర పోతనామాత్యుడు
27. అంటరానివారికి దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని కోరుతూ శ్రీనారాయణగురు ధర్మపాలన యోగం అనే సంస్థను ఎప్పుడు స్థాపించారు ? -1903లో 
28. 1921లో మొదటి ఆది హిందూ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించిన వారు ? - భాగ్యరెడ్డివర్మ
29. 1943లో ఆంధ్ర సారస్వతి పరిషత్తును ఎవరు స్థాపించారు ? - బిరుదు వెంకట శేషయ్య
30. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని మహాత్మాగాంధీకి ఏ కాంగ్రెస్‌ సమావేశంలో అందచేశారు? - విజయవాడ కాంగ్రెస్‌ సమావేశంలో
31. 1922లో జనవరి నుంచి 1924మే వరకూ తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో సాగిన రంపపీతూరీ ఉద్యమ నాయకుడు ? 
- అల్లూరి సీతారామరాజు
32.1922లో మొదటిసారి అల్లూరి సీతారామరాజు ఆయుధాల కోసం ఏ పోలీస్‌ స్టేషన్‌పై దాడిచేశారు ? 
- చింతపల్లి
33. అల్లూరి సీతారామరాజు జన్మస్థలం? - పాడ్రంగి
34. అభ్యుదయ రచయితల సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది ? - 1936లో
35. బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించిన విప్లవ వీరుల గ్రంథ రచయిత పేరు ? - గద్దె లింగయ్య
36. 1938లో దుర్గాబారు దేశ్‌ముథాంధ్ర మహిళా సభను ఎక్కడ స్థాపించారు ? - మద్రాసులో
37. ఇందిరా సేవాసదనం అనే అనాథ బాలికల వసతి గృహాన్ని హైదరాబాద్‌లో ఎవరు నిర్వహించారు ? 
- సంగం లకీëబాయి
38. గుంటూరులో శారదానికేతనం అనే సంస్థను ఎవరు స్థాపించారు ? - ఉన్నవ లకీëబాయమ్మ
39. నైజాం రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సంవత్సరం ? - 1939
40. కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర శాఖ ఎప్పుడు ఏర్పడింది ? 
- 1934లో
41. అభ్యుదయ మహిళా సంస్థ స్థాపకులు ? 
- మల్లాది సుబ్బమ్మ
42. పురోహితుడు లేని వివాహాలను ఎవరు జరిపించారు? 
- రామస్వామి నాయకర్‌
43. చీరాల దగ్గర ఆంధ్రవిద్యాపీఠగోష్టి సంఘ స్థాపకుడెవరు ? 
- దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
44. విశ్వదాత దేశోద్దారక బిరుదులున్న వారు ?- కాశీనాథుని నాగేశ్వరరావు
45.1908 విజయవాడ కేంద్రంగా స్వరాజ్య పత్రిక ఎవరి ఆధ్వర్యంలో వచ్చింది ? - గాడిచర్ల హరిసర్వోత్తమరావు, బోడి నారాయణరావు
46. భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌లతో పనిచేసి, ఆంధ్రాలో జాతీయోద్యమానికి స్ఫూర్తినిచ్చిన తెలుగునేత ? - అన్నాప్రగడ కామేశ్వరరావు
47. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని ఏ కాంగ్రెస్‌ మహాసబలో ఆమోదించించారు ? - బొంబాయి కాంగ్రెస్‌ మహాసభలో
48.ఏబది సంవత్సరాల హైదరాబాద్‌ గ్రంథ రచయిత ? 
-మందుముల నరసింగరావు
49.1919లో జన్మభూమి అనే ఆంగ్లవార పత్రికను, ఆంధ్రా ఇన్సూరెన్స్‌ కంపెనీ, భాగ్యలకీë, ఆంధ్రా బ్యాంకులను స్థాపించినవారు ? 
- భోగరాజు పట్టాభి సీతారామయ్య
50.గులాంగిరి గ్రంత రచయిత ? - జ్యోతి బాపూలే
51.ఫెదర్స్‌ అండ్‌ స్టోన్స్‌ రాసింది ఎవరు ? -భోగరాజు పట్టాభి సీతారామయ్య
52. ఆంధ్ర మహిళ అనే తెలుగు మాస పత్రిక ఎవరు స్థాపించారు ? 
- దుర్గాబారు దేశ్‌ముఖ్‌
53.మదనపల్లి దగ్గర రిషీ వ్యాలీ స్కూల్‌ని ఎవరు స్థాపించారు ? 
- జిడ్డు కృష్ణమూర్తి
54.1891లో జరిగిన నాగపూర్‌ అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభకు అధ్యక్షత వహించిన వారు ? - పి.ఆనందాచార్యులు
55.చీరాల-పేరాల రెండు గ్రామాలను వేరు చేసి మున్సిపాలిటీగా ఏ స ంవత్సరంలో ఏర్పాటు చేశారు ? - 1919లో
56. సీతిచంద్రిక అనే గ్రంథాన్ని గద్యంలో ఎవరు రచించారు ? 
- పరవస్తు చిన్నయసూరి
57.మాక్సిమ్‌ గోర్కీ రచించిన మదర్‌ నవలను తెలుగులో అనువదించిన వారు ? - క్రొవ్విడి లింగరాజు
58. విగ్రహారాధనను తిరస్కరించి, ఏకేశ్వరోపాసన సిద్ధాంతాన్ని ప్రచారం చేసింది ఏ సమాజం ? - బ్రహ్మసమాజం
59. 1932లో అఖిల భారత హరిజన సంఘాన్ని స్థాపించిన వారు ? 
- గాంధీజీ
60. ఆంధ్రాలో స్వదేశీ ఉద్యమ కాలంలో గోదావరి స్టోర్సు స్థాపకులు ? 
- కాశీనాథుని నాగేశ్వరరావు



మాదిరి ప్రశ్నలు...

1.100/ 99ని అంతముగాని ఆవర్తన దశాంశ భిన్నంగా రాసినా, దాని అవధి ?

ఎ. 3 బి.2 సి. 10 డి. 1

2. స్థూపం యొక్క భూమి ?

ఎ. పరావలయాకారం బి.దీర్ఘవృత్తాకారం 

సి. వృత్తాకారం డి. అర్ధవృత్తాకారం

3.20 మంది 20కి.మీ రోడ్డును 10 రోజుల్లో వేయగలరు. అదే పనితనము గల పనివారు 15 మంది 90కి.మీ పొడవుగల రోడ్డును ఎన్ని రోజుల్లో వేయగలరు ?

ఎ. 20 బి.40 సి. 60 డి. 80

4.ఒక దీర్ఘచతురస్రం పొడవు, వెడల్పులు 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. మరియు దీర్ఘ చతురస్ర వైశాల్యం 875 చదరపు యూనిట్లు అయిన దీర్ఘ చతురస్ర చుట్టుకొలత...యూనిట్లు ?
ఎ. 120 యూనిట్లు బి.60 యూనిట్లు
సి. 150 యూనిట్లు డి. ఏదీకాదు
5. ఒక కర్మాగారంలో 16 మంది కార్మికులకు అందరికీ సమానంగా జీతం చెల్లించిన రూ.37,840 ఖర్చు అయిన ఇదే వంతున 36 మందికి చెల్లించుటకు అయ్యే ఖర్చు... ?
ఎ. రూ.16,817.76పై బి.రూ.75,140
సి. రూ.85,140 డి. రూ.85,410
6.ఒక సంఖ్యలో 28% విలువ 39.2 అయిన ఆ సంఖ్య ...?
ఎ. 110 బి.100 సి. 140 డి. 160
7.ఒక వ్యక్తి జీతం మొదట 20% తగ్గించి తరువాత 20% పెంచారు. అయిన ఆ వ్యక్తి జీతంలో మార్పు...?
ఎ. మార్పు ఉండదు బి.4% తగ్గుదల
సి. 4% పెరుగుదల డి.ఏదీకాదు
8.ఒక సినిమా హాలులో సినిమా రిలీజు మొదటి ఆట 900 మంది సినిమాను చూశారు. ఆ తరువాత 2వ ఆటకు 20%, మూడో ఆటకు 10% చొప్పున తగ్గినారు. 3వ ఆట చూసిన వారు ఎంత మంది ?
ఎ. 630 బి.650 సి. 648 డి. 645
9.ఒక వర్తకునికి ఒక వస్తువును 28% నష్టానికి అమ్మితే వచ్చిన నష్టం రూ.210. అయితే ఆ వస్తువు కొన్నవెల ఎంత..?
ఎ. రూ.750 బి.రూ.810 సి.రూ.910 డి.రూ.850
10.నష్టం 6 1/4% అయిన కొన్న ఖరీదును ఏ భిన్నంచే గుణించిన అమ్మిన వెల వస్తుంది ?
ఎ. 16/15 బి.15/16 సి. 8/15 డి. 7/15
11. 400 గ్రాముల ద్రవ్యరాశి గల రాయి బరువు ?
1) 0.04 ఎన్‌ 2) 0.4 ఎన్‌
3) 3.92 ఎన్‌ 4) 3290 ఎన్‌
12. రోడ్డు రోలరు ఏ స్థితిలో ఉంటుంది ?
1) స్థిర నిశ్చల 2) అస్థిర నిశ్చల
3) తటస్థ నిశ్చల 4) అన్నీ
13. వాహకంలో 2 ఆంపియర్‌ల విద్యుత్‌ (1) 8 నిమిషాల పాటు (టి) ఉంటే ఆ వాహకంలో ప్రయాణించిన ఆవేశం ఎంత ?
1) 960 కులూంబ్‌లు 2) 4 కులూంబ్‌లు
3) 16 కులూంబ్‌లు 4) 1000క కులూంబ్‌లు
14. స్థిర తరంగాలలో అత్యధిక స్థానభ్రంశం ఉన్న బిందువు ?
1) అస్పందన 2) ప్రస్పందన 3) శృంగం 4) ద్రోణి
15. చిన్నగా ఉండే మంచు ముక్కలు, ఒక పెద్ద మంచు దిమ్మెతో పోల్చినపుడు ప్రశాశవంతంగా కనిపించడానికి కారణం ఏమిటి? 
1) కాంతి పరావర్తనం 2) కాంతి వివర్తనం
3) కాంతి వక్రీభవనం 4) కాంతి వ్యతికరణం
16. 220లో పనిచేస్తున్న 25బాట్స్‌, 40 వాట్స్‌, 60 వాట్స్‌, 100వాట్స్‌ బల్బుల్లో తక్కువ నిరోధం కలది ఏది...
1) 25వాట్స్‌ 2) 40వాట్స్‌ 3) 60 వాట్స్‌ 4)100వాట్స్‌
17. కృత్రిమ సిల్కు అనగా ఏమిటి ?
1) సెల్యులోజ్‌ 2) సెల్యులోజ్‌ నూట్రేట్‌
3) సెల్యులోజ్‌ ఫాస్ఫేట్‌ 4) సెల్యులోజ్‌ అయోడిన్‌
18.పాదరసం బాష్పీభవన విశిష్టగుప్తోష్ణం ఎంత ?
1) 204 కె/గ్రా 2) 70 కె/గ్రా 
3) 93 కె/గ్రా 4) 34 కె/గ్రా
19. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ?
1) ధ్వని తరంగాలు శూన్యంలో ప్రయాణించగలవు
2) కాంతి శూన్యం మీదుగా ప్రయాణించలేవు.
3) కాంతి తరంగాలు వస్తువుల కంపనాల వల్ల ఏర్పడతాయి
4) ధ్వని తరంగాలు వస్తువుల కంపనాల వల్ల ఏర్పడతాయి
20. తరంగ పౌన:పుణ్యానికి ప్రమాణాలు ఏమిటి ?
1) హెర్జ్‌లు 2) సెకనులు
3) కంపనాలు/సెకన్‌ 4) ఎ,సి లు సరైనవి
21. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ మానవ హక్కులను ఆమోదించడంతో ప్రపంచవ్యాప్తంగా ఏరోజున మానవ హక్కుల దినోత్సవంగా పాటిస్తున్నారు. ?
1. ఆగస్టు 26 2. జనవరి 5
3. డిసెంబర్‌ 10 4. మే 7
22.రాష్ట్రపతి రాజీనామా చేయాలంటే తన రాజీనామాను ఎవరికి సమర్పించాలి ?
1. లోక్‌సభ స్పీకర్‌ 2. ప్రధానమంత్రి
3. ఉపరాష్ట్రపతి 4.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
23.సమాచార హక్కు చట్టం 2005 ముఖ్య ఉద్దేశం ?
1. ప్రజల వద్దకు పాలనను తీసుకురావడం
2. ప్రభుత్వ పరిపాలనాంశాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం.
3. ప్రభుత్వ పాలనలో జవాబుదారీ తనం, పారదర్శకత ఉండేలా చూడటం. 4. పైవేవీ కావు
24.కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఒకేసారి ఖాళీ అయితే ఆ పదవులను ఎవరు నిర్వర్తిస్తారు ?
1. లోక్‌ సభ స్పీకర్‌ 2. హైకోర్టు న్యాయమూర్తి
3. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 
4. అటార్నీ జనరల్‌
25. ఐక్యరాజ్య సమితి విధులను నిర్వర్తించే ఆరు ప్రధానాంగాల్లో రద్దయింది ఏది ?
1. ధర్మకర్తృత్వ మండలి 2.ఆర్థిక, సాంఘిక మండలి
3. అంతర్జాతీయ న్యాయస్థానాలు 4.సాధారణ సభ

సమాధానాలు : 1.బి,2. సి, 3.సి, 4.ఎ, 5.డి, 6.సి, 7.బి, 8.సి, 9.ఎ, 10.బి, 11.సి, 12.సి, 13.ఎ, 14.బి, 15.బి, 16.ఎ,17.బి, 18.బి, 19.డి, 20.డి, 21.సి, 22.సి, 23.సి, 24.సి, 25.ఎ,






















Add caption










































































































































సక్సెస్ నిచ్చెనెక్కడమెలా!

వృత్తిలోనూ, ప్రవృత్తిలోనూ అద్వితీయంగా రాణించాలన్న యువత తపనకు
చోదకశక్తి ఆత్మవిశ్వాసమే. అయితే, వాస్తవాలకు జీవితానికి మధ్య ఏకోశానా పొంతన ఉండదు. డిగ్రీలకూ, ఉద్యోగానికీ కూడా అంతే దూరం. నర్సరీ మొదలుకుని..
పట్టా పుచ్చుకునే వరకూ యువతలో ఎన్నో ఆశలు, ఆకాంక్షలు. పరుగులు పెట్టించే మనోరథాలు! అంత సులభంగా సాధ్యమయ్యేవేనా..ఉద్యోగ
మార్కెట్‌లో అడుగు పెట్టిన వెంటనే ఉపాధి అవకాశాలు చిరునవ్వుతో
స్వాగతం పలికే అవకాశం ఉందా..నేటి పోటీ ప్రపంచంలో..ఒక్కో ఉద్యోగానికి వేల
దరఖాస్తులు దాఖలవుతున్న నేపధ్యంలో అడుగడుగునా నిరాశే ఎదురవుతుంది. ధైర్యంగా అడుగేయలేని అనిశ్చితే తాండవిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే
ఆత్మ విశ్వాసం, స్వీయ ప్రతిభపై నమ్మకం రాణిస్తాయి. అశాంతిని, నిరాశను
తొలగించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలిగే మనోధైర్యాన్ని అందిస్తాయి.
నేటి యువత కోరికలకు కొదవ లేదు. ఆత్మ విశ్వాసానికీ ఢోకా లేదు. అదే వారిని పరుగులు పెట్టిస్తోంది. ధైర్యంగా ఏ రంగంలోకైనా దూకేసేందుకూ ప్రేరణ అవుతోంది. తమ ముందు తరంకంటే కూడా నేటి తరం వేగంలోనే కాదు, దేన్నయినా సాధించగమన్న ధీమాలోనూ తిరుగులేనిదే. తామేపని చేపట్టినా, ఏ బాధ్యత నిర్వర్తించినా అందులో తమ ముద్ర ఉండాలన్న తపన, యావ యువతకు మెండుగానే ఉన్నాయి. వృత్తిలోనూ, ప్రవృత్తిలోనూ అద్వితీయంగా రాణించాలన్న వీరి తపనకు చోదకశక్తి ఆత్మవిశ్వాసమే. అయితే, వాస్తవాలకు జీవితానికి మధ్య ఏకోశానా పొంతన ఉండదు. డిగ్రీలకూ, ఉద్యోగానికీ కూడా అంతే దూరం. నర్సరీ మొదలుకుని..పట్టా పుచ్చుకునే వరకూ యువతలో ఎన్నో ఆశలు, ఆకాంక్షలు. పరుగులు పెట్టించే మనోరథాలు! అంత సులభంగా సాధయమయ్యేవేనా..ఉద్యోగ మార్కెట్‌లో అడుగు పెట్టిన వెంటనే ఉపాధి అవకాశాలు చిరునవ్వుతో స్వాగతం పలికే అవకాశం ఉందా..నేటి పోటీ ప్రపంచంలో..ఒక్కో ఉద్యోగానికి వేల దరఖాస్తులు దాఖలవుతున్న నేపధ్యంలో అడుగడుగునా నిరాశే ఎదురవుతుంది. ధైర్యంగా అడుగేయలేని అనిశ్చితే తాండవిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆత్మ విశ్వాసం, స్వీయ ప్రతిభపై నమ్మకం రాణిస్తాయి. అశాంతిని, నిరాశను తొలగించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలిగే మనోధైర్యాన్ని అందిస్తాయి. అందరికీ ఇలాంటి ఆత్మస్థయిర్యం ఉండకపోవచ్చు. కుటుంబ నేపథ్యం..పెరిగిన తీరుతెన్నులూ ఇందుకు ప్రధానంగా కారణం అవుతాయి. కొందరిది దూకుడు మనస్తత్వమైతే ఇంకొదరిది ఒకటికి పదిసార్లు ఆలోచిస్తేగానీ ముందుకెళ్లలేని డోలాయమానం. ఇలాంటి పరిస్థితుల్లో ఊహాప్రపంచం ఉంచి బయటికి రావాలి. స్వీయ ప్రతిభను తులనాత్మక రీతిలో బేరీజు వేసుకోవాలి. జీవిత లక్ష్యాలు ఎండమావులు కాకుండా వాస్తవికతను సంతరించుకోవాలి. ఇందుకు ప్రధానంగా కావాల్సిన, అనివార్యంగా ఉండాల్సిన లక్షణం..సవాళ్లను ఢీకొనగలిగే మనస్తత్వం. జీవన పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఎత్తు పల్లాలు వెలుగు నీడల్లా అడుగడుగునా తారసిల్లుతూనే ఉంటాయి. రోజురోజుకూ మారిపోతున్న పరిస్థితుల్లో..దేశాల మధ్య సరిహద్దులు తొలగిపోయి ఎల్లల్లేని అవకాశాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఇలాంటి పరిస్థితులూ, పరిణామాలు సహజమే. నేల విడిచి సాముచేసే ధోరణిని పక్కన పెట్టి అందిన అవకాశాలకు తగ్గట్టుగా రాణించడంలోనే సక్సెస్ ఉంటుంది. తగిన నైపుణ్యాన్ని సంతరించుకోవడంలోనే జీవిత వైకుంఠపాళిలో గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ఏటేటా లక్షలాది మంది జాబ్ మార్కెట్‌లోకి అడుగు పెడుతున్న తరుణంలో..ఉద్యోగమా..ఉపాధా అన్నది పెద్ద మీమాంసగా మారుతోంది. చదువుకు తగ్గ ఉద్యోగం గగనమయితే..అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకునే నైపుణ్యం ఎండమావిగా మారుతోంది. ఈ సందిగ్థావస్థ నుంచి బయట పడాలంటే ముందుగా కావాల్సింది వాస్తవ పరిస్థితుల పట్ల అవగాహన. ఊహా ప్రపంచం నుంచి బయటికి వచ్చి ఆత్మ విశ్వాసమే పెట్టుబడిగా ముందుకు దూసుకుపోగలిగే నైజం. ఎలాంటి ఆసరా లేని నేపథ్యం నుంచి వచ్చి ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారున్నారు. అలాంటి వారి జీవితాలు జీవన పోరాటంలో విసిగివేసారి నైరాస్యంలో కొట్టుకుపోతున్న యువతకు ఆదర్శం కావాలి. వారి బాటలో ముందుకెళితే సవాళ్లు దూదిపింజెల్లా ఎగిరిపోతాయి. అందని ఆకాశం అందినంత ఆనందాన్ని కలిగించే అవకాశాలు అందివస్తాయి. ఆత్మస్థయిర్యమే పెట్టుబడిగా..పట్టుదలే సోపానంగా సాగినప్పుడే ఇవన్నీ సాకారం అవుతాయి. నేటి యువత సక్సెస్ మంత్రం..జీవితంలో ఎదిగే తంత్రం ఇదే.
*

క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌లో మెలకువలు

గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామ్‌ (GRE) లో క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ అతి ముఖ్యమైన, బాగా స్కోరు చేసుకోగలిగిన విభాగం. అందుకే విద్యార్థులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పరీక్షకు సన్నద్ధం కావాలి!
ఈ విభాగంలో 35 నిముషాల వ్యవధి ఉండే రెండు భాగాలుంటాయి. ప్రతి భాగంలో 20 ప్రశ్నలు ఇస్తారు. క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌కు స్కోరు 130-170 స్కేలులో ఇస్తారు. వెర్బల్‌ రీజనింగ్‌ స్కోరుతో కలుపుకొని ఓవరాల్‌ స్కోరు 260-340 గా నిర్ణయిస్తారు.
క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌లో ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌, మల్టిపుల్‌ ఆన్సర్‌, కంపారిజన్‌, న్యూమరికల్‌ ఎంట్రీ రకాలుగా ఇస్తారు. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు సమాధానం, ప్రశ్నకు దిగువన ఇచ్చిన ఐదు ఆప్షన్ల నుంచి ఎంచుకోవలసివుంటుంది. దీనికి ఏదో ఒకటే ఆప్షన్‌ సరైనదిగా ఉంటుంది.
అలా కాకుండా మల్టిపుల్‌ ఆన్సర్‌ ప్రశ్నల్లో ప్రశ్నకు దిగువన ఇచ్చిన ఆప్షన్లలో ఎన్ని సరైనవిగా ఉంటే అన్నింటినీ ఎంచుకోవలసి ఉంటుంది. కరెక్ట్‌ సమాధానాలన్నింటినీ టిక్‌ చేస్తేనే మార్కులు వస్తాయి. సరైన ఆప్షన్‌ ఒక్కటి వదిలేసినా వెయిటేజి ఉండదు.
కంపారిజన్‌ ప్రశ్నల్లో ప్రశ్న/సమస్య ఇచ్చిన తరువాత, దానికింద Column A, Column B కింద ఎంట్రీలు ఇస్తారు. కాలమ్‌ A ఎంట్రీ, కాలమ్‌ B ఎంట్రీ కంటే ఎక్కువగా ఉంటే సమాధానం 'A' అని గుర్తించాలి. అలాకాకుండా కాలమ్‌ A ఎంట్రీ కాలమ్‌ B ఎంట్రీ కంటే తక్కువగా ఉంటే సమాధానం 'B' అని గుర్తించాలి. రెండూ సమానంగా ఉంటే 'C' గా, ఒకవేళ ఇచ్చిన ప్రశ్నలో అవసరమైన డేటా లేకపోతే (insufficient Data) సమాధానం 'D'గా గుర్తించాలి.
కంపారిజన్‌ ప్రశ్నల్లో సమస్యలపట్ల మంచి అవగాహన, సాధన ఉన్నట్లయితే పూర్తిగా సమస్య పరిష్కరించకుండానే సమాధానాన్ని గుర్తించవచ్చు. ఎందుకంటే దీంట్లో కచ్చితమైన సమాధానం అవసరం ఉండదు కాబట్టి. ఇలా చాలావరకు పరీక్ష సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అయితే ఇలా చేయాలంటే విద్యార్థి పరీక్షకంటే ముందే సబ్జెక్టుపై పట్టు సాధించవలసి ఉంటుంది.
న్యూమరిక్‌ ఎంట్రీ ప్రశ్నల్లో సమాధానాలు, ప్రశ్న కింద ఇచ్చిన ఖాళీల్లో పూరించవలసి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టడానికి సమస్యను చివరివరకూ సాల్వ్‌ చేయాల్సి ఉంటుంది.
ఏ టాపిక్స్‌ అధ్యయనం ఎలా?
సిలబస్‌ ప్రకారం చూస్తే పాఠశాల స్థాయి భావనలే ఉన్నట్లు కనిపిస్తాయి. అయినా ప్రశ్నలను మాత్రం తార్కికశక్తితో సాల్వ్‌ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నలు నేరుగా ఫార్ములాను ఉపయోగించి చేసేవి కాకుండా విద్యార్థి నిజమైన అవగాహనను పరీక్షించేవిగా ఉంటాయి.
సిలబస్‌ అంకగణితం (Arithmetic), బీజగణితం (Algebra), రేఖాగణితం (Geometry) , దత్తాంశ విశ్లేషణ (Data Analysis)గా ఉంటుంది. ఒక్కొక్కదాన్ని చిన్న అధ్యాయాలు (Chapters)గా విభజించి అధ్యయనం చేస్తే సుమారు 20 అధ్యాయాలు అవుతుంది.
క్వాంటిటేటివ్‌ విభాగంలో ప్రశ్నల్లో వాడే సింబల్స్‌, పదాలు (terminology) ప్రామాణిక గణితంలో వాడే వాటిలాగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రత్యేక సింబల్స్‌ ఏదైనా ప్రశ్నలో వాడినట్త్లెతే, దాని గురించిన వివరణ కూడా ఇస్తారు.
అరిథ్‌మెటిక్‌లో అంకెలు, సంఖ్యలు, భిన్నాలు, వర్గాలు, వర్గమూలాలపై ప్రాబ్లమ్స్‌ సాధన చేయాలి. ఇవే కాకుండా డెసిమల్స్‌, రియల్‌ నంబర్స్‌, నిష్పత్తులు, పర్సెంటేజీలో కూడా ప్రశ్నలు అడుగుతారు. వీటిల్లో ప్రశ్నలు నేరుగా కాకుండా కొంచెం విమర్శనాత్మకంగా- విద్యార్థి ఆలోచనాశక్తిని పరీక్షించేవిగా అడుగుతారు.
ఆల్జీబ్రాలో లీనియర్‌, నాన్‌-లీనియర్‌లో సమీకరణాలను సాల్వ్‌ చేసే పద్ధతులపై ప్రశ్నలుంటాయి. నాన్‌-లీనియర్‌లో ముఖ్యంగా క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌పై ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఈక్వేషన్సే కాకుండా అసమానతల (Inequalities) పై కూడా ప్రశ్నలు వస్తాయి. అసమానతలను చేయడం కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ పరీక్ష కంటే ముందే సాధన చేస్తూ సులభమైనదిగా మార్చుకోవచ్చు.
జామెట్రీలో రేఖలు, కోణాలను ఆధారంగా చేసుకొని కొన్ని ప్రశ్నలు ఉంటాయి. త్రిభుజాలు, చతుర్భుజాలు, బహుభుజాలపై మంచి అవగాహన ఉండాలి. వాటి వైశాల్యాలు, చుట్టుకొలతలు, అంతర కోణాలు, బాహ్య కోణాలకు సంబంధించిన ఫార్ములాలను గుర్తు పెట్టుకోవలసి ఉంటుంది.
వృత్తాలు, త్రీడైమెన్షనల్‌ ఫిగర్స్‌ మీద కూడా ప్రాక్టికల్‌ ఓరియంటెడ్‌గా ప్రశ్నలు ఇస్తారు. ఈ ప్రశ్నలను చేయడానికి ఫార్ములాలను గుర్తుపెట్టుకోవడం ఒక ఎత్తయితే, ఇచ్చిన ప్రశ్నను సరిగ్గా విశ్లేషించి ఎక్కడ ఏ ఫార్ములాను ఉపయోగించాలో పసిగట్టడం మరో ఎత్తు.
డేటా అనాలిసిస్‌లో గ్రాఫికల్‌ మెథడ్స్‌, న్యూమరికల్‌ మెథడ్స్‌, కౌంటింగ్‌ మెథడ్స్‌ మీద ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. ఈ అంశంలో సంభావ్యత (Probability), డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ మీద ప్రశ్నలు వస్తాయి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో ఇచ్చిన డేటాను సరిగ్గా, తప్పు లేకుండా గుర్తించడంలోనే అసలైన నేర్పు ఉంటుంది. దీంట్లో ప్రశ్నలు తేలికగా ఉన్నప్పటికీ విద్యార్థులు కొన్ని చిన్న చిన్న తప్పులు చేయడం ద్వారా మార్కుల కోల్పోతూ ఉంటారు. అందుకే పరీక్షకు సన్నద్ధమవుతున్నప్పుడే విద్యార్థి తను ఏ తప్పులు చేస్తున్నాడో గుర్తించి వాటిని అధిగమించేవిధంగా అభ్యాసం చేస్తూ సన్నద్ధం కావాలి.
పైన చెప్పిన అంశాలపై విద్యార్థి ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోవాలి. ఒకవేళ విద్యార్థి తను ఇంతకుముందు నేర్చుకున్న అంశాలు మరిచిపోయి ఉన్నట్లయితే ఇంకోసారి ఈ అంశాల పునశ్చరణ చేసుకోవాలి. ఇది పరీక్ష సన్నద్ధతకు ఉపకరిస్తుంది. ప్రాథమిక అవగాహన ఏర్పడిన తర్వాత పరీక్షకు మిగిలున్న సమయాన్ని బట్టి ఎన్ని ఎక్కువ ప్రశ్నలు అభ్యాసం చేస్తే అంత ఆత్మవిశ్వాసం ఏర్పడుతూ ఉంటుంది.
ఇక్కడ గుర్తించుకోవలసిన విషయం ఏంటంటే- ఒకే రకమైన ప్రశ్నలు ఎక్కువ సాధన చేయడం కంటే వైవిధ్యం ఉన్న ప్రశ్నలను ఎంచుకొని సాధన చేస్తే పరీక్ష సమయంలో ఎంతో ఉపయుక్తం!.



No comments:

Post a Comment