Pages

Tuesday, 30 June 2015

Indian mutton curry recopies

బెండకాయ మటన్‌



కావలసిన పదార్థాలు
బెండకాయలు-అర కిలో
మటన్‌-అరకిలో, నెయ్యి-2 టేబుల్‌ స్పూన్లు,
జీలకర్ర- టీ స్పూను, దాల్చిన చెక్క-2 అంగుళాల ముక్క, నల్ల యాలకులు-నాలుగు
మిరియాలు-పది, ఉల్లిపాయలు-రెండు 
పచ్చి మిర్చి-నాలుగు, అల్లం వెల్లుల్లి-2 టీ స్పూన్లు, పసుపు-అర టీ స్పూను, ఉప్పు-రుచికి సరిపడా, ధనియాల పొడి-2 టీ స్పూన్లు
కొత్తిమీర తురుము-4 టేబుల్‌ స్పూన్లు
టొమాటోలు- రెండు,నూనె-2 టేబుల్‌ స్పూన్లు
కారం- టీ స్పూను, గరం మసాల పొడి-టీ స్పూన్లు, కొత్తిమీర తురుము- 4 టేబుల్‌ స్పూను
తయారు చేయి విధానం
బెండకాయలు కడిగి తొడిమలూ, చివర్లూ తీసేసి ఒకవైపున చీల్చినట్లుగా గాటు పెట్టాలి. ఓ బాణలిలో నూనె వేసి మిగిలిన జీలకర్ర వేసి వేగాక బెండకాయలు వేసి వేయించి ఉంచాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో నెయ్యి వేసి కాగాక అర టీ స్పూను జీలకర్ర దాల్చిన చెక్క, నల్ల యాలకులు, మిరియాలు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరువాత చీల్చిన పచ్చిమిర్చి, మటన్‌ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి ,ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. మంచినీళ్ళు పోసి ఓ సారి కలిపి ఓ పది నిమిషాలు ఉడికించాలి. తరువాత టొమాటో గుజ్జు, కారం, గరం మసాలా వేసి కలపాలి. ఇప్పుడు కొత్తిమీర తురుము వేసి ఉప్పు సరిచూసి కుక్కర్‌ మూత పెట్టి ఓ విజిల్‌ రానివ్వాలి. మంట తగ్గించి సిమ్‌లో ఇరవై నిమిషాల పాటు ఉడికించి దించాలి.


చైనీస్‌ మటన్‌ బాల్స్‌
కావలసిన పదార్థాలు
బోన్‌లెస్‌ మటన్‌ కీమా- అరకిలో
కోడిగుడ్లు-రెండు, సోయా సాస్‌-టేబుల్‌ స్పూను, పంచదార-టీ స్పూను
ఉప్పు-టీ స్పూను, పచ్చి మిర్చి-ఆరు
చైనీస్‌ క్యాబేజీ తురుము- అర కప్పు
మైదా పిండి-పావు కప్పు,
చైనీస్‌ సాల్ట్‌-పావు టీ స్పూను
తయారు చేయి విధానం
కీమాను ఉడికించి ఉంచాలి. కోడిగుడ్ల సొనను బాగా గిలకొట్టాలి. అందులో సోయా సాస్‌, పంచదార వేసి బాగా కలపాలి. తరువాత ఉడికించిన కీమా, పచ్చిమిర్చి తురుము, క్యాబేజీ తురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉప్పు చైనీస్‌ సాల్ట్‌, మైదాపిండి వేసి కలిపి ఉండలుగా చేయాలి. బాణలిలో నూనె పోసి కాగాక ఈ ఉండల్ని వేసి వేయించి తీయాలి. వీటిల్లోకి కాస్త గ్రేవీ కావాలనుకుంటే విడిగా బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరువాత చిల్లీ సాస్‌, కొత్తిమీర తురుము వేసి అందులోమటన్‌ బాల్స్‌ కలిపి అందించాలి.


కొల్హాపురీ మటన్‌ తంబడా రస్సా
కావల్సిన పదార్థాలు
మటన్‌-కేజీ, కారం- టేబుల్‌ స్పూను, నూనె-కప్పు,
టొమాటోలు-రెండు, ఉల్లిపాయలు- నాలుగు 
కొత్తిమీర-కట్ట,అల్లం వెల్లుల్లి పేస్టు-రెండు చెంచాలు
పసుపు-పావు టేబుల్‌ స్పూను
ఉప్పు-తగినంత, నువ్వులు-రెండు టేబుల్‌ స్పూను
యాలకులు-నాలుగు, కొబ్బరి తురుమ - రెండు టేబుల్‌ స్పూన్లు, ధనియాల పొడి-టేబుల్‌ స్పూను
జీలకర్ర పొడి- టేబుల్‌ స్పూను,మిరియాలు-ముప్పావు చెంచా, దాల్చిన చెక్క-పెద్ద ముక్క,
లవంగాలు -నాలుగైదు,గసగసాలు-టేబుల్‌ స్పూను
నెయ్యి-రెండు టీబుల్‌ స్పూన్లు
తయారు చేయి విధానం
బాణలిలో నూనె లేకుండా నువ్వులు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలూ, గసగసాలు వేయించుకోవాలి. తరువాత మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి. అలాగే టొమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, తాజా కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేయించుకోవాలి. అందులో ముందుగా వేసుకున్న మసాలా పొడి వేయాలి. తరువాత కొబ్బరి మిశ్రమం వేయాలి. పచ్చి వాసన పోయాక మటన్‌ ముక్కలు తగినంత ఉప్పు వేసి మూత పెట్టేయాలి. మటన్‌ మెత్తగా ఉడికాక ధనియాల పొడి జీలకర్ర పొడి, కారం వేసి కలిపి దింపేస్తే సరిపోతుంది. ఇది బిర్యానీ, రొట్టెల్లోకి చాలా బాగుంటుంది.


చింత చిగురు మాంసం
కావాల్సినపదార్థాలు
చింతచిగురు-అరకిలో మాంసం ( చికెన్‌ లేదా మటన్‌) ,అరకిలో కొబ్బరి తురుము: 2 టీ స్పూను, కొత్తిమీర- కట్ట,ధనియాల పొడి-టీ స్పూన్లు
అల్లంవెల్లుల్లిముద్ద- టీ స్పూను, జీలకర్ర- టీ స్పూను, పుదీనా-కట్ట ,ఆవాలు-టీ స్పూను
నూనె-టేబుల్‌ స్పూను, ఉల్లిపాయ- ఒకటి
కారం -2 టేబుల్‌ స్పూను, ఉప్పు-రుచికి సరిపడా
పసుపు-చిటికెడు, గరం మసాలా-టీ స్పూను
తయారు చేయి విధానం
నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిముక్కలు కూడా వేసి అవి వేగాక, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత కొబ్బరి తురుము వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు మటన్‌ లేదా చికెన్‌ ముక్కలు వేసి ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి కలపాలి. తరువాత ధనియాల పొడి, కారం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మాంసం ఉడికే వరకూ ఉంచాలి. ఉడికిన తరువాత చింత చిగురు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా వేసి ఓ నిమిషం ఉంచి దించాలి.

Telugu joke in telugu script

ఏ పక్క
''మీ ఆవిడా, మా అమ్మా సూర్యాకాంతం ఛాాయాదేవిల్లా రోజు పోట్లాడుకుంటున్నప్పుడు నువ్వే పక్క నిలుచుంటావు? అమర్‌ను అడిగాడు జగదీష్‌.
గోడపక్క చెప్పాడు అమర్‌.

ఆలస్యం
బడికి ఇవాళ ఆలస్యమయ్యిందేం రా? అడిగింది టీచర్‌
''బడికి ఆలస్యంగా రానని..వందసార్లు ఇంపోజిషన్‌ రాయమన్నారుగా. అది రాయటం వల్లే ఆలస్యం అయ్యింది మేడమ్‌'' చెప్పాడు రాజు.

ఆపిల్‌ పండు
రాజేష్‌: న్యూటన్‌ ఆపిల్‌ పండు కింద పడగానే కిందకు ఎందుకు పడిందని ఆలోచించాడు. మరి నువ్వైతే?. 
గిరీష్‌: పడగానే తినేసి రెండోది ఎప్పుడు పడుతుందా అని ఆలోచిస్తాను.

టాబ్లెట్‌
శంభులింగం: అదేంటి జంభూ! తలకిందులుగా ఎందుకున్నావు?
జంబులింగం: తలనొప్పిగా ఉందిరా
శంభులింగం: మరి టాబ్లెట్‌ వేసుకోవచ్చుగా?
జంబులింగం: వేసుకున్నారా, కానీ అది గొంతులో నుండి కడుపులోకి వెళ్ళింది అందుకే అది తలలోకి వెళ్ళాలని ఇలా తలకిందులుగా వేళ్ళాడుతున్నా.

తల నొప్పి
నిన్న రాత్రి భయంకరమైన తల నొప్పి తో బాధ పడ్డాను చెప్పాను నవీన్‌.
అవునవును 'ఆ తలనొప్పి'.. సినిమా హాల్లో నీ పక్క సీటులో కూర్చుని ఉంది కదా నేను కూడా చూశాను అన్నాడు రాము.

తగిన చోటు
మోకాళ్ళ నొప్పులకు ఒక దివ్యౌషధం కనిపెట్టారు. షాపు ఎక్కడ పెడితే సరుకు బాగా అమ్ముడౌతుంది సలహా అడిగాడు శంకర్‌.
ఆర్‌.టి.సి బస్టాండ్‌ల దగ్గర పెట్టు వ్యాపారం బ్రహ్మాండగా సాగుతుంది. చెప్పాడు శేషు.

అమ్మాయే
ఆది: చూడండి ఆ వ్యక్తి ఎలా బట్టలేసుకున్నాడో ఆ జీన్సు ప్యాంటు... పూల చొక్కా ...ఆ జుట్టు ...అబ్బాయంటారా? అమ్మాయంటారా?
అవతలి వారు: అమ్మాయే. తను నా కూతురు.
ఆది: ఓ క్షమించండి సర్‌ మీరు ఆ అమ్మాయికి తండ్రనుకోలేదు.
అవతలి వారు: తండ్రిని కాదు తన తల్లిని.

ఫర్నిచర్‌ వ్యాపారం
పంతులమ్మ: మీ డాడీ ఏం చేస్తుంటాడోరు 
చింటూ: ఫర్నిచర్‌ అమ్మే పని టీచర్‌. 
పంతులమ్మ: వ్యాపారం బాగా సాగుతోందా మరి.
చింటూ: మాబాగా సాగుతోంది టీచర్‌. ప్రస్తుతం ఇంట్లో మంచం మాత్రమే మిగిలింది. ( తాపీగా చెప్పాడు చింటూ)

Thursday, 25 June 2015

పోటీ పరీక్షల ప్రత్యేకం

1. సంతాన సాగరం అనే పెద్ద తటాకాన్ని ఎవరు తవ్వించారు?
- సూరమాంబ (పెదకోమటి వేమారెడ్డి భార్య)
2. ప్రబంధ పరమేశ్వరుడు, శంబుదాసుడు అనే బిరుదులున్న కవి? - ఎర్రాప్రగడ
3. స్వతంత్ర రెడ్డి రాజ్య స్థాపకుడు ?- ప్రోలయ వేమారెడ్డి
4. కావ్యాలంకార చూడామణి రచయిత ? 
- విన్నకోట పెద్దన్న
5. రెడ్డి రాజుల కాలంలో నాణేలను ఏమని పిలిచేవారు ?
- టంకాలు
6. శ్రీశైలంలో వీరశిరో మండపం ఎవరు నిర్మించారు ? 
- అనవేమారెడ్డి
7. రణముకుడుపు అనే బైరవ తాంత్రిక విధానం ఏ రాజుల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంది ? 
- రేచర్ల వెలమలు
8. రేచర్ల పద్మనాయకులు ఏ మతాన్ని అధికంగా ఆదరించారు ? - వైష్ణవ మతం
9. ఏ రెడ్డిరాజు క్రీ.శ 1358లో మోటుపల్లి ఓడరేవును ఆధునీకరించి వర్తకుల కోసం అభయశాసనం పునరుద్దరించాడు ? - అనవోతారెడ్డి
10. పల్నాడుసీమలో రంభయైన ఏకులు వడుకున్‌ అని వర్ణించిన కవి ఎవరు ? - శ్రీనాథుడు
11.వేమభూపాల చరిత్ర అనే గద్యకావ్యాన్ని ఎవరు రచించారు ? - వామనభట్ట బాణుడు
12.కైఫీయతులు అంటే ఏమిటి ? 
- స్థానిక చరిత్రలు తెలిపేది
13. చాటుకృతులు అంటే ఏమిటి ? 
- రాజులను పొగిడే గీతాలు
14. ధర్మ ప్రతిష్టాపన గురు అనే బిరుదున్న రాజు ? 
- ప్రోలయవేమారెడ్డి
15. రెడ్డిరాజుల చరిత్రలో బ్రాహ్మణశక్తి ఒక అపూర్వ విచిత్రఘట్టమని ఆది నభూతో నభవిష్యత్‌ అని పేర్కొన్నవారు ఎవరు ? - సురవరం ప్రతాపరెడ్డి
16.యాజ్ఞవల్కస్కృతి, నారదస్కృతి, మితాక్షరి వంటి గ్రంథాలు ఏ అంశాన్ని విశదీకరిస్తాయి ? 
- న్యాయవ్యవస్థ (నేరాలు - శిక్షలు)
17. గుడి కట్టు లేఖలు, దండక వెలలు లాంటి ఖాతా పుస్తకాలు ఏ అంశాన్ని వివరిస్తాయి ? 
- గ్రామ సీమల జమా ఖర్చులను 
18. సర్వజ్ఞ కళ్యాణభూపతి బిరుదులున్న రాజు ? 
- సింగభూపాలుడు
19. నవనాథచరిత్ర రచయిత ? - గౌరన
20.రత్నపాంచాలిక అనే సంస్కృత నాటక రచయిత ? 
- సర్వజ్ఞ సింగభూపాలుడు
21. సర్వజ్ఞ సింగభూపాలుడు సంస్కృత భాషలో రచించిన రసార్ణవసుధాకరం ఏ అంశాన్ని విశదీకరిస్తుంది ? 
- అలంకార శాస్త్రం
22. రేచర్ల పద్మనాయకులకు - ముసునూరి కాపయనాయుడుకి మధ్య క్రీ.శ 1367-68లో ఎక్కడ యుద్ధం జరిగింది ? 
- భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా)
23. చమత్కారం చంద్రిక రచయిత ? - విశ్వేశ్వర కవి
24.సారంగదేవుని సంగీతరత్నాకరానికి వ్యాఖ్యానం రాసిన రేచర్ల వెలమ ప్రభువు ? - కుమారసింగ భూపాలుడు
25. కౌలాస దుర్గాన్ని (నిజామాబాద్‌) అల్లా ఉద్దీన్‌ హసన్‌ గంగూకు సంధి ఫలితంగా అప్పగించిన ముసునూరి నాయకుడెవరు ? - ముసునూరి కాపయనాయుడు
26.ఆంధ్ర మహాభాగతం రచయిత ? 
- బమ్మెర పోతనామాత్యుడు
27. అంటరానివారికి దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని కోరుతూ శ్రీనారాయణగురు ధర్మపాలన యోగం అనే సంస్థను ఎప్పుడు స్థాపించారు ? -1903లో 
28. 1921లో మొదటి ఆది హిందూ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించిన వారు ? - భాగ్యరెడ్డివర్మ
29. 1943లో ఆంధ్ర సారస్వతి పరిషత్తును ఎవరు స్థాపించారు ? - బిరుదు వెంకట శేషయ్య
30. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని మహాత్మాగాంధీకి ఏ కాంగ్రెస్‌ సమావేశంలో అందచేశారు? - విజయవాడ కాంగ్రెస్‌ సమావేశంలో
31. 1922లో జనవరి నుంచి 1924మే వరకూ తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో సాగిన రంపపీతూరీ ఉద్యమ నాయకుడు ? 
- అల్లూరి సీతారామరాజు
32.1922లో మొదటిసారి అల్లూరి సీతారామరాజు ఆయుధాల కోసం ఏ పోలీస్‌ స్టేషన్‌పై దాడిచేశారు ? 
- చింతపల్లి
33. అల్లూరి సీతారామరాజు జన్మస్థలం? - పాడ్రంగి
34. అభ్యుదయ రచయితల సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది ? - 1936లో
35. బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించిన విప్లవ వీరుల గ్రంథ రచయిత పేరు ? - గద్దె లింగయ్య
36. 1938లో దుర్గాబారు దేశ్‌ముథాంధ్ర మహిళా సభను ఎక్కడ స్థాపించారు ? - మద్రాసులో
37. ఇందిరా సేవాసదనం అనే అనాథ బాలికల వసతి గృహాన్ని హైదరాబాద్‌లో ఎవరు నిర్వహించారు ? 
- సంగం లకీëబాయి
38. గుంటూరులో శారదానికేతనం అనే సంస్థను ఎవరు స్థాపించారు ? - ఉన్నవ లకీëబాయమ్మ
39. నైజాం రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సంవత్సరం ? - 1939
40. కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర శాఖ ఎప్పుడు ఏర్పడింది ? 
- 1934లో
41. అభ్యుదయ మహిళా సంస్థ స్థాపకులు ? 
- మల్లాది సుబ్బమ్మ
42. పురోహితుడు లేని వివాహాలను ఎవరు జరిపించారు? 
- రామస్వామి నాయకర్‌
43. చీరాల దగ్గర ఆంధ్రవిద్యాపీఠగోష్టి సంఘ స్థాపకుడెవరు ? 
- దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
44. విశ్వదాత దేశోద్దారక బిరుదులున్న వారు ?- కాశీనాథుని నాగేశ్వరరావు
45.1908 విజయవాడ కేంద్రంగా స్వరాజ్య పత్రిక ఎవరి ఆధ్వర్యంలో వచ్చింది ? - గాడిచర్ల హరిసర్వోత్తమరావు, బోడి నారాయణరావు
46. భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌లతో పనిచేసి, ఆంధ్రాలో జాతీయోద్యమానికి స్ఫూర్తినిచ్చిన తెలుగునేత ? - అన్నాప్రగడ కామేశ్వరరావు
47. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని ఏ కాంగ్రెస్‌ మహాసబలో ఆమోదించించారు ? - బొంబాయి కాంగ్రెస్‌ మహాసభలో
48.ఏబది సంవత్సరాల హైదరాబాద్‌ గ్రంథ రచయిత ? 
-మందుముల నరసింగరావు
49.1919లో జన్మభూమి అనే ఆంగ్లవార పత్రికను, ఆంధ్రా ఇన్సూరెన్స్‌ కంపెనీ, భాగ్యలకీë, ఆంధ్రా బ్యాంకులను స్థాపించినవారు ? 
- భోగరాజు పట్టాభి సీతారామయ్య
50.గులాంగిరి గ్రంత రచయిత ? - జ్యోతి బాపూలే
51.ఫెదర్స్‌ అండ్‌ స్టోన్స్‌ రాసింది ఎవరు ? -భోగరాజు పట్టాభి సీతారామయ్య
52. ఆంధ్ర మహిళ అనే తెలుగు మాస పత్రిక ఎవరు స్థాపించారు ? 
- దుర్గాబారు దేశ్‌ముఖ్‌
53.మదనపల్లి దగ్గర రిషీ వ్యాలీ స్కూల్‌ని ఎవరు స్థాపించారు ? 
- జిడ్డు కృష్ణమూర్తి
54.1891లో జరిగిన నాగపూర్‌ అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభకు అధ్యక్షత వహించిన వారు ? - పి.ఆనందాచార్యులు
55.చీరాల-పేరాల రెండు గ్రామాలను వేరు చేసి మున్సిపాలిటీగా ఏ స ంవత్సరంలో ఏర్పాటు చేశారు ? - 1919లో
56. సీతిచంద్రిక అనే గ్రంథాన్ని గద్యంలో ఎవరు రచించారు ? 
- పరవస్తు చిన్నయసూరి
57.మాక్సిమ్‌ గోర్కీ రచించిన మదర్‌ నవలను తెలుగులో అనువదించిన వారు ? - క్రొవ్విడి లింగరాజు
58. విగ్రహారాధనను తిరస్కరించి, ఏకేశ్వరోపాసన సిద్ధాంతాన్ని ప్రచారం చేసింది ఏ సమాజం ? - బ్రహ్మసమాజం
59. 1932లో అఖిల భారత హరిజన సంఘాన్ని స్థాపించిన వారు ? 
- గాంధీజీ
60. ఆంధ్రాలో స్వదేశీ ఉద్యమ కాలంలో గోదావరి స్టోర్సు స్థాపకులు ? 
- కాశీనాథుని నాగేశ్వరరావు

మాదిరి ప్రశ్నలు...
1.100/ 99ని అంతముగాని ఆవర్తన దశాంశ భిన్నంగా రాసినా, దాని అవధి ?
ఎ. 3 బి.2 సి. 10 డి. 1
2. స్థూపం యొక్క భూమి ?
ఎ. పరావలయాకారం బి.దీర్ఘవృత్తాకారం 
సి. వృత్తాకారం డి. అర్ధవృత్తాకారం
3.20 మంది 20కి.మీ రోడ్డును 10 రోజుల్లో వేయగలరు. అదే పనితనము గల పనివారు 15 మంది 90కి.మీ పొడవుగల రోడ్డును ఎన్ని రోజుల్లో వేయగలరు ?
ఎ. 20 బి.40 సి. 60 డి. 80
4.ఒక దీర్ఘచతురస్రం పొడవు, వెడల్పులు 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. మరియు దీర్ఘ చతురస్ర వైశాల్యం 875 చదరపు యూనిట్లు అయిన దీర్ఘ చతురస్ర చుట్టుకొలత...యూనిట్లు ?
ఎ. 120 యూనిట్లు బి.60 యూనిట్లు
సి. 150 యూనిట్లు డి. ఏదీకాదు
5. ఒక కర్మాగారంలో 16 మంది కార్మికులకు అందరికీ సమానంగా జీతం చెల్లించిన రూ.37,840 ఖర్చు అయిన ఇదే వంతున 36 మందికి చెల్లించుటకు అయ్యే ఖర్చు... ?
ఎ. రూ.16,817.76పై బి.రూ.75,140
సి. రూ.85,140 డి. రూ.85,410
6.ఒక సంఖ్యలో 28% విలువ 39.2 అయిన ఆ సంఖ్య ...?
ఎ. 110 బి.100 సి. 140 డి. 160
7.ఒక వ్యక్తి జీతం మొదట 20% తగ్గించి తరువాత 20% పెంచారు. అయిన ఆ వ్యక్తి జీతంలో మార్పు...?
ఎ. మార్పు ఉండదు బి.4% తగ్గుదల
సి. 4% పెరుగుదల డి.ఏదీకాదు
8.ఒక సినిమా హాలులో సినిమా రిలీజు మొదటి ఆట 900 మంది సినిమాను చూశారు. ఆ తరువాత 2వ ఆటకు 20%, మూడో ఆటకు 10% చొప్పున తగ్గినారు. 3వ ఆట చూసిన వారు ఎంత మంది ?
ఎ. 630 బి.650 సి. 648 డి. 645
9.ఒక వర్తకునికి ఒక వస్తువును 28% నష్టానికి అమ్మితే వచ్చిన నష్టం రూ.210. అయితే ఆ వస్తువు కొన్నవెల ఎంత..?
ఎ. రూ.750 బి.రూ.810 సి.రూ.910 డి.రూ.850
10.నష్టం 6 1/4% అయిన కొన్న ఖరీదును ఏ భిన్నంచే గుణించిన అమ్మిన వెల వస్తుంది ?
ఎ. 16/15 బి.15/16 సి. 8/15 డి. 7/15
11. 400 గ్రాముల ద్రవ్యరాశి గల రాయి బరువు ?
1) 0.04 ఎన్‌ 2) 0.4 ఎన్‌
3) 3.92 ఎన్‌ 4) 3290 ఎన్‌
12. రోడ్డు రోలరు ఏ స్థితిలో ఉంటుంది ?
1) స్థిర నిశ్చల 2) అస్థిర నిశ్చల
3) తటస్థ నిశ్చల 4) అన్నీ
13. వాహకంలో 2 ఆంపియర్‌ల విద్యుత్‌ (1) 8 నిమిషాల పాటు (టి) ఉంటే ఆ వాహకంలో ప్రయాణించిన ఆవేశం ఎంత ?
1) 960 కులూంబ్‌లు 2) 4 కులూంబ్‌లు
3) 16 కులూంబ్‌లు 4) 1000క కులూంబ్‌లు
14. స్థిర తరంగాలలో అత్యధిక స్థానభ్రంశం ఉన్న బిందువు ?
1) అస్పందన 2) ప్రస్పందన 3) శృంగం 4) ద్రోణి
15. చిన్నగా ఉండే మంచు ముక్కలు, ఒక పెద్ద మంచు దిమ్మెతో పోల్చినపుడు ప్రశాశవంతంగా కనిపించడానికి కారణం ఏమిటి? 
1) కాంతి పరావర్తనం 2) కాంతి వివర్తనం
3) కాంతి వక్రీభవనం 4) కాంతి వ్యతికరణం
16. 220లో పనిచేస్తున్న 25బాట్స్‌, 40 వాట్స్‌, 60 వాట్స్‌, 100వాట్స్‌ బల్బుల్లో తక్కువ నిరోధం కలది ఏది...
1) 25వాట్స్‌ 2) 40వాట్స్‌ 3) 60 వాట్స్‌ 4)100వాట్స్‌
17. కృత్రిమ సిల్కు అనగా ఏమిటి ?
1) సెల్యులోజ్‌ 2) సెల్యులోజ్‌ నూట్రేట్‌
3) సెల్యులోజ్‌ ఫాస్ఫేట్‌ 4) సెల్యులోజ్‌ అయోడిన్‌
18.పాదరసం బాష్పీభవన విశిష్టగుప్తోష్ణం ఎంత ?
1) 204 కె/గ్రా 2) 70 కె/గ్రా 
3) 93 కె/గ్రా 4) 34 కె/గ్రా
19. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ?
1) ధ్వని తరంగాలు శూన్యంలో ప్రయాణించగలవు
2) కాంతి శూన్యం మీదుగా ప్రయాణించలేవు.
3) కాంతి తరంగాలు వస్తువుల కంపనాల వల్ల ఏర్పడతాయి
4) ధ్వని తరంగాలు వస్తువుల కంపనాల వల్ల ఏర్పడతాయి
20. తరంగ పౌన:పుణ్యానికి ప్రమాణాలు ఏమిటి ?
1) హెర్జ్‌లు 2) సెకనులు
3) కంపనాలు/సెకన్‌ 4) ఎ,సి లు సరైనవి
21. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ మానవ హక్కులను ఆమోదించడంతో ప్రపంచవ్యాప్తంగా ఏరోజున మానవ హక్కుల దినోత్సవంగా పాటిస్తున్నారు. ?
1. ఆగస్టు 26 2. జనవరి 5
3. డిసెంబర్‌ 10 4. మే 7
22.రాష్ట్రపతి రాజీనామా చేయాలంటే తన రాజీనామాను ఎవరికి సమర్పించాలి ?
1. లోక్‌సభ స్పీకర్‌ 2. ప్రధానమంత్రి
3. ఉపరాష్ట్రపతి 4.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
23.సమాచార హక్కు చట్టం 2005 ముఖ్య ఉద్దేశం ?
1. ప్రజల వద్దకు పాలనను తీసుకురావడం
2. ప్రభుత్వ పరిపాలనాంశాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం.
3. ప్రభుత్వ పాలనలో జవాబుదారీ తనం, పారదర్శకత ఉండేలా చూడటం. 4. పైవేవీ కావు
24.కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఒకేసారి ఖాళీ అయితే ఆ పదవులను ఎవరు నిర్వర్తిస్తారు ?
1. లోక్‌ సభ స్పీకర్‌ 2. హైకోర్టు న్యాయమూర్తి
3. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 
4. అటార్నీ జనరల్‌
25. ఐక్యరాజ్య సమితి విధులను నిర్వర్తించే ఆరు ప్రధానాంగాల్లో రద్దయింది ఏది ?
1. ధర్మకర్తృత్వ మండలి 2.ఆర్థిక, సాంఘిక మండలి
3. అంతర్జాతీయ న్యాయస్థానాలు 4.సాధారణ సభ
సమాధానాలు : 1.బి,2. సి, 3.సి, 4.ఎ, 5.డి, 6.సి, 7.బి, 8.సి, 9.ఎ, 10.బి, 11.సి, 12.సి, 13.ఎ, 14.బి, 15.బి, 16.ఎ,17.బి, 18.బి, 19.డి, 20.డి, 21.సి, 22.సి, 23.సి, 24.సి, 25.ఎ,

మది దోచే మ ష్రూ మ్స్‌

Posted On Sat 20 Jun 23:03:58.705323 2015


చిల్లీ మష్రూమ్‌

కావలసిన పదార్థాలు
బటన్‌ మష్రూమ్స్‌-200 గ్రా, క్యాప్సికమ్‌-రెండు, ఉల్లిపాయ -ఒకటి, అల్లం-అంగుళం ముక్క, వెల్లుల్లి-6 రెబ్బలు, నూనె-2 టేబుల్‌ స్పూన్లు, కారం- టీ స్పూను, సోయాసాస్‌-2 టీ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌-టేబుల్‌ స్పూను, వినెగర్‌-టీ స్పూను, మంచి నీళ్ళు-కప్పు, ఉప్పు- రుచికి సరిపడా.
తయారు చేయు విధానం
పుట్టగొడుగుల్ని రెండు ముక్కలుగా కోయాలి. క్యాప్సికమ్‌ లోపల గింజలు తీసేసి ముక్కలుగా కోయాలి. ఉల్లి ముక్కలు, అల్లం, వెల్లుల్లి కలిపి మెత్తని ముద్దలా రుబ్బాలి. బాణలిలో 4 టేబుల్‌ స్పూన్ల నూనె వేసి ఉల్లిముద్ద వేసి బాగా వేయించాలి. తరువాత కారంవేసి, అరకప్పు నీళ్ళు పోసి సిమ్‌లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు క్యాప్సికమ్‌ ముక్కలు, పుట్టగొడుగుల ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి తక్కువ మంట మీద ముక్కలు ఉడికేవరకూ ఉంచాలి. తరువాత సోయా సాస్‌, వినెగర్‌ వేసి కలపాలి. కాసిని నీళ్లలో కలిపిన కార్న్‌ఫ్లోర్‌ కూడా వేసి కలిపి సిమ్‌లో ఓ రెండు నిమిషాలు ఉడికించి దించాలి.

మది దోచే మ ష్రూ మ్స్‌

Posted On Sat 20 Jun 23:03:58.705323 2015
చెట్టినాడ్‌ మష్రూమ్‌ కర్రీ

కావలసిన పదార్థాలు
మష్రూమ్స్‌ ముక్కలు-2 కప్పులు, చింతపండు-నిమ్మకాయంత ( అర కప్పు నీళ్లలో నానబెట్టాలి), ఉప్పు-సరిపడా, గరం మసాలా-టీ స్పూను, సెనగపప్పు-టేబుల్‌ స్పూను, మిరియాల పొడి-టీ స్పూను, నూనె-2 టీ స్పూన్లు, ఆవాలు-అర టీ స్పూను, ఎండు మిర్చి-2, కరివేపాకు-2 రెమ్మలు.
తయారు చేయు విధానం
చింతపండుని మెత్తగా గుజ్జులా చేయాలి, సెనగపప్పుని విడిగా చిన్న బాణలిలో వేసి వేయించి పొడి చేయాలి. ఈ పొడిలోనే గరం మసాలా, మిరియాల పొడి కలపాలి. స్టవ్‌ మీద నాన్‌ స్టిక్‌ పాన్‌ పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు వేసి వేయించాలి. కరివేపాకు, ఎండు మిర్చి కూడా వేసి వేగాక పుట్టగొడుగుల ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. ఉడికాక మూత తీసి చింతపండు గుజ్జు వేసి పది నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి. చివరగా గరం మసాలా మిశ్రమం వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి ఉప్పు సరి చూసి దించాలి.

Mashrum

మది దోచే మ ష్రూ మ్స్‌

Posted On Sat 20 Jun 23:03:58.705323 2015


ఆంధ్రా మష్రూమ్‌ కర్రీ

కావలసిన పదార్థాలు
పుట్ట గొడుగులు- పావు కిలో, ఉల్లిపాయలు- మూడు, పచ్చిమిర్చి-మూడు, కారం-టీ స్పూను, పసుపు-పావు టీ స్పూను, కొత్తిమీర-కట్ట, నూనె-వేయించడానికి సరిపడా, ఉప్పు- తగినంత.
మసాలా ముద్ద కోసం
అల్లం తురుము- టీ స్పూను, వెల్లుల్లి-రెండు రెబ్బలు, జీలకర్ర- టీ స్పూను, గసగసాలు-టీ స్పూను, ధనితయాలు-టీ స్పూను
తయారు చేయు విధానం
పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరగాలి. మసాలా ముద్ద కోసం తీసుకున్న దినుసులన్నీ ముద్దలా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేసి ఉల్లిముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉప్పు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు కప్పు నీళ్లు పోసి మీడియం మంట మీద రెండు నిమిషాలు ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిన తరువాత మసాలా ముద్ద వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి దించి కొత్తిమీర చల్లితే సరి.

Batani Mashrum karri

మది దోచే మ ష్రూ మ్స్‌

b
- బఠాణీ మష్రూమ్స్‌
కావలసిన పదార్థాలు
              పచ్చిబఠాణీలు-ఒకటిన్నర కప్పు, పుట్టగొడుగులు-200 గ్రాములు, ఉల్లిపాయలు-రెండు, టొమా టోలు-నాలుగు, కారం-టేబుల్‌ స్పూను, ధనియాల పొడి-టేబుల్‌ స్పూను, పసుపు-టీ స్పూను, గరం మసాలా-టీ స్పూను, జీడిపప్పు ముద్ద-అర కప్పు, యాలకులు-నాలుగు, దాల్చిన చెక్క-అంగుళం ముక్క, అల్లం వెల్లుల్లి-2 టేబుల్‌ స్పూన్లు, నూనె-4 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా.
తయారు చేయు విధానం
పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కోయాలి. బాణలిలో నూనె వేసి యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి వేసి ఓ నిమిషం వేయించాలి. టొమాటో ముక్కలు కూడా వేసి ఉడికించాలి. తరువాత కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి ఓ రెండు నిమిషాలు ఉడికించాలి. జీడిపప్పు ముద్దని ఓ కప్పు నీళ్లలో కలిపి బాణలిలో పోయాలి. తరువాత మరో కప్పు నీళ్ళు పోసి మరిగించాలి. ఇప్పుడు బఠాణీలు, పుట్టగొడుగులు వేసి ఉడికిన తరువాత దించాలి.

Ankusam

అంకుశం

                  సమయం ఉదయం తొమ్మిది గంటలు.. పాల్వంచ ఫెర్టిలైజర్స్‌ కంపెనీ సైరన్‌ ''కార్మికులారా! రండహో'' అన్నట్టు మ్రోగింది. జనరల్‌ షిప్ట్‌ వాళ్ళంతా రకరకాల వాహనాల మీద వస్తున్నారు. సరిగ్గా అప్పుడే ''గిరిజన కార్మికుడికి న్యాయం చెయ్యాలి'', ''వెంటనే ఆఫీస్‌ సైడ్‌కి ట్రాన్స్‌ఫర్‌ చెయ్యాలి'' అంటూ.. కంపెనీ మెయిన్‌ గేట్‌ దగ్గర్లోవున్న కొమరం భీమ్‌ విగ్రహం ముందు రోడ్డుకు అడ్డంగా నిల్చున్న కొంతమంది చేస్తున్న నినాదాలతో ఒక్కసారిగా ఆ పరిసరాలు హోరెత్తిపోసాగాయి. దాంతో ఉలిక్కిపడిన సెక్యూరిటీ సిబ్బంది పరుగున వచ్చి వాళ్ళను చుట్టుముట్టారు. డ్యూటీకి వెళుతున్న వాళ్ళంతా ఆగిపోయి ''పిట్టన్న విషయంలోనే కావచ్చు!'' అనుకోసాగారు. ''అంగవికలుడైన గిరిజన కార్మికుడికి వెంటనే న్యాయం చేయాలి'' అనుకుంటూ వున్నవాళ్ళకు తోడుగా మరి కొంత మంది గిరిజనులు చేరవచ్చారు. అంతమంది గిరిజనులక్కడ గుమిగూడడం చూసిన కార్మికులు దగ్గరికొచ్చి ''ఏం జరిగింది'' అంటూ పిట్టన్ననే అడిగారు. అసలు జరిగిందేమిటో నలుగురికి తెలియడమే మంచిదనుకున్న పిట్టన్న తన చుట్టూ మూగి వున్న తోటి కార్మికుల వంక చూస్తూ చెప్పడం మొదలుపెట్టాడు.
***
పిట్టన్న వాళ్ళకున్న ఇరవై ఎకరాల భూమి ఫెర్టిలైజర్స్‌ కంపెనీలో కలిసిపోయింది. భూ ములు కోల్పోయిన వాళ్ళందరికీ కంపెనీలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సర్కార్‌ ఆ తరువాత మాట తప్పింది. పదవ తరగతి వరకు చదువుకున్న పిట్టన్న చేతులు ముడుచుకుని కూర్చోకుండా భూములు కోల్పోయిన వాళ్ళందరినీ కూడేసి రకరకాలుగా ఆందోళనలు చేశాడు. ఆ ఆందోళనల ఫలితంగా దిగివచ్చిన ఫెర్టిలైజర్స్‌ కంపెనీ యాజమాన్యం భూములు కోల్పోయిన వాళ్ళందరికీ ఉద్యోగాలిచ్చింది.
పోరాడి ఉద్యోగం సంపాదించుకున్న పిట్టన్న, ఉద్యోగం చేసుకుంటూనే ప్రైవేట్‌గా డిగ్రీ చదివాడు. తోటి గిరిజన కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యంతో రాజీలేకుండా పోరాడుతున్నాడు. మిగతా యూనియన్ల నాయకులకు పిట్టన్న కారణంగానే గిరిజన కార్మికులెవ్వరూ తమ దగ్గరికి రావడం లేదన్న ద్వేషాన్ని రగిలించింది. ఎక్కడ వీలైతే అక్కడ పిట్టన్నను తొక్కిపడెయ్యడానికి వాళ్ళంతా కాచుక్కూర్చున్నారు.
ట ట కాల ప్రవాహంలో మరో ఏడు వందల ఇరవై రోజులు కొట్టుకుపోయాయి. ఈ మధ్యకాలంలో పిట్టన్న పేరు గిరిజన కార్మికులతో పాటు గిరిజనేతర కార్మికుల్లో కూడా చొచ్చుకుపోయింది. మిగతా యూనియన్ల నాయకులకు అది మరింత కోపాన్ని తెప్పించింది. ఇక లాభం లేదనుకున్న ఆ ఇతర యూనియన్ల నాయకులంతా ఓరోజు సమావేశమై పిట్టన్నను మట్టుపెట్టడానికి పథకం వేశారు. ఓ రోజు ఉదయం ఐదు గంటలకు పిట్టన్న బైక్‌ మీద ఫస్ట్‌ షిఫ్ట్‌ డ్యూటీకి వెళుతున్నాడు. బైక్‌ భగత్‌ సింగ్‌ సెంటర్‌ నుండి కుడి పక్కకు తిరిగి కంపెనీ వైపునకు పోతుంది. అదే సమయంలో కంపెనీ వైపు నుండి వేగంగా వస్తున్న టిప్పర్‌ ఒకటి, బైక్‌ను గుద్దేసి ఆగకుండా వెళ్ళిపోయింది.
టిప్పర్‌ తగలడంతోనే బైక్‌ మీద నుండి బంతి మాదిరిగా గాల్లోకి లేచిన పిట్టన్న అంత దూరాన నడిరోడ్డు మీద స్పృహ కోల్పోయాడు. సరిగ్గా అదే సమయంలో కంపెనీ వైపు నుండి వచ్చిన ఇంకో టిప్పర్‌ పిట్టన్న ఎడమ కాలును నుజ్జునుజ్జుగా తొక్కు కుంటూ వెళ్ళిపోయింది. ఈ మొత్తం వ్యవహారం ఐదే ఐదు నిమిషాల్లో ముగిసిపోయింది. మరో పది నిమిషాలు, పావు గంట తరువాత డ్యూటీకి వస్తున్న కార్మికులు, రక్తం మడుగులో పడివున్న పిట్టన్నను గుర్తించి వెంటనే కంపెనీ అంబులెన్స్‌కి ఫోన్‌ చేశారు. ఆగమేఘాల మీద వచ్చిన అంబులెన్స్‌ పిట్టన్నను ఎక్కించుకొని కొత్తగూడేనికి తీసుకెళ్ళింది. అంబులెన్స్‌ లో నుండి అతణ్ణి దించక ముందే ''ఈ కేస్‌ మేం తీసుకోకూడదు మీరు వెంటనే గవర్నమెంట్‌ హాస్పటల్‌కి తీసుకుపోండి!'' అంటూ గేట్‌లో నుండే వెనక్కి పంపించారు ప్రైవేట్‌ హాస్పిటల్‌ వాళ్ళు.గవర్నమెంట్‌ హాస్పిటల్లో ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తై అడ్మిట్‌ చేసుకునే సరికి పక్కా రెండు గంటలు పట్టింది. ఆ తరువాత మరో గంటకు వచ్చిన సంబంధిత డాక్టర్‌ ''ఈ కేస్‌ ఇక్కడ లాభంలేదు వెంటనే ఖమ్మం గానీ, హైదరాబాద్‌ గానీ తీసుకుపోండి! ఆలస్యం చేస్తే బాడీ మొత్తం పాయిజన్‌ అవుతుంది. దాంతో అసలు ప్రాణానికే ముప్పురావచ్చు.'' అంటూ చేతులు దులిపేసుకున్నాడు. ఇంతలో పిట్టన్న భార్య, అన్నదమ్ములు రెండు ఆటోలు వేసుకుని కొత్తగూడెం హాస్పిటల్‌ దగ్గరికి చేరుకున్నారు. అటు నుండి అటే ఖమ్మం బయలుదేరుదామనుకుంటే ''కంపెనీ అంబులెన్స్‌ ఖమ్మం దాకా రావడానికి పర్మిషన్‌ లేదు. మీరేదైనా ప్రైవేట్‌ ఆంబులెన్స్‌ మాట్లాడుకొని వెళ్ళడమే.'' అంటూ ఆంబులెన్స్‌ సిబ్బంది చేతులెత్తేశారు.
దాంతో ఇంక చేసేదేంలేక అప్పటికప్పుడు ప్రైవేట్‌ ఆంబులెన్స్‌ మాట్లాడిన తోటికార్మికులు, తాము ఆగిపోయి కుటుంబ సభ్యులను ఎక్కించి ఖమ్మం మమత హాస్పిటల్‌కి పంపించారు. పిట్టన్నను చూసిన వెంటనే ''మేం ఫస్ట్‌ ఎయిడ్‌ చేసి పంపిస్తాం గాని, మీరు వెంటనే హైదరాబాద్‌ నిమ్స్‌కి తీసుకుపోతే మంచిది.'' అంటూనే ఫస్ట్‌ ఎయిడ్‌ మొదలుపెట్టారు మమత హాస్పిటల్‌ డాక్టర్లు. గంట తరువాత అదే ప్రైవేట్‌ ఆంబులెన్స్‌లో పిట్టన్నను ఎక్కించుకున్న కుటుంబ సభ్యులు నాలుగు గంటల్లో హైదరాబాద్‌ నిమ్స్‌లో చేర్పించారు. పిట్టన్నను చూడ్డంతోనే ''వెంటనే ఆపరేషన్‌ చేసి కాలు తీసెయ్యాలి. లేకుంటే ప్రాణానికే ప్రమాదం.'' అంటూ కొత్తగూడెం డాక్టర్లు చెప్పిన విషయాన్నే నిమ్స్‌ డాక్టర్లు కూడా ఖాయం చేశారు. ఆ మాటలను విన్న కుటుంబ సభ్యులు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక కొట్టుమిట్టాడసాగారు. వాళ్ళ పరిస్థితిని గమనించిన పిట్టన్న ''ఇంక ఆలస్యం అనవసరం. ఆపరేషన్‌ కానివ్వండి సార్‌!'' అంటూ ధైర్యంగా తన అంగీకారాన్ని తెలియజేశాడు. పేషెంట్‌ అంగీకారాన్ని తీసుకున్న డాక్టర్లు చకచకా ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. ఐదు గంటల ఆపరేషన్‌ తరువాత పిట్టన్న కాలు మోకాలు పైకి తీసేశారు.
ట ట ట
ఇరవై రోజుల తరువాత హాస్పిటల్‌ నుండి డిశ్చార్జై ఇల్లు చేరాడు పిట్టన్న. లాస్‌ ఆఫ్‌ పే మీద రెండు నెలలు సిక్‌ లీవ్‌ తీసుకుని ఇంట్లోవున్న పిట్టన్న, మరోసారి హైదరాబాద్‌ హాస్పిటల్‌కి వెళ్ళి చెక్‌ చేయించుకున్నాడు. చెక్‌ చేసిన డాక్టర్లు ఫిట్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. డ్యూటీలో జాయిన్‌ అవుదామని ఫిట్‌ సర్టిఫికెట్‌ తీసుకుని వాకర్‌తోనే కంపెనీకి వెళ్ళిన పిట్టన్న, కంపెనీ డాక్టర్‌తో ఫిట్‌ సర్టిఫికెట్‌ మీద కౌంటర్‌ సైన్‌ చేయించుకుని నేరుగా జి.యం. పర్సనల్‌ ఆఫీస్‌కి వెళ్ళాడు.
''సార్‌! పర్సనల్‌ ప్రాబ్లమ్స్‌ అన్నీ పన్నెండున్నర తరువాతే చూస్తారు. అప్పటి దాకా మీరక్కడ కూర్చోండి!'' అంటూ ఆ పక్కనేవున్న ఓ బల్ల చూపించాడు ఆఫీస్‌ మెసెంజర్‌. ''ఈ రూల్‌ ఎప్పట్నుంచి!?'' అనుకున్న పిట్టన్న వెళ్ళి ఆ బల్లమీద కూర్చున్నాడు. ఆ బల్లకు దగ్గర్లోనే తన టేబుల్‌ మీదున్న కంప్యూటర్లో గేమ్‌ ఆడుకుంటున్న జి.యమ్‌. సెక్రటరీ వచ్చిందెవరోనని కనీసం తల తిప్పి కూడా చూడలేదు. అర గంట గడచినా జి.యమ్‌. పర్సనల్‌ రాలేదు. సెక్రటరీ కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద నుండి తల తిప్పలేదు. చూసీ చూసీ విసుగొచ్చిన పిట్టన్న తన ముందున్న వాకర్ని కావాలనే గట్టిగా ఎత్తిపడేశాడు. ఆ శబ్దానికి ఉలిక్కిపడ్డ సెక్రటరీ కంప్యూటర్‌ మీద నుండి అప్పుడు తల తిప్పి పిట్టన్న వంక చూశాడు. చూడ్డంతోనే పిట్టన్న కుంటి కాలు కనిపించడంతో గిల్టీగా ఫీలైన సెక్రటరీ ''సారీ! నేనేదో ధ్యాసలో వుండి పట్టించుకోలేదు. సార్‌ రాగానే అందరికన్నా నిన్నే ముందు పంపిస్తా గాని అసలింతకూ నీ కాలుకేమైంది?'' అంటూ సానుభూతిగా అడిగాడు.వివరించాడు పిట్టన్న. ''అయ్యో అలాగా! ఇప్పటిదాకా నాకీ విషయమే తెలియదు.'' అన్నాడు సెక్రటరీ. ఇంతలో జి.యమ్‌.తో పనుందంటూ ఏడదెనిమిది మంది కార్మికులొచ్చారు. మరో అర గంట తరువాత జి.యమ్‌. వచ్చాడు. చెప్పినట్టుగానే అందరికన్నా ముందు పిట్టన్ననే లోపలికి పంపించాడు సెక్రటరీ. పిట్టన్నను చూడగానే ''కాలెలా వుంది?'' అంటూ క్యాజ్‌వల్‌గా అడిగాడు జి.యమ్‌. ''ఫరవా లేదు. డాక్టర్లు లైట్‌ జాబ్‌కి రికమెండ్‌ చేస్తూ లెటర్‌ ఇచ్చారు.'' అంటూ ఫిట్‌ సర్టిఫికెట్‌ తీసి జి.యమ్‌. చేతికందించాడు పిట్టన్న.
పావుగంట పాటు సర్టిఫికెట్‌ను పరిశీలించిన జి.యమ్‌. పర్సనల్‌ ''పాపం పిట్టయ్యా! నీకు మాత్రం చాలా అన్యాయం జరిగింది. కనీసం ఆ వెహికల్‌ ఏదో దొరికినా బావుండేది. ఫిజికల్‌గా ఇంత లాసైనందుకు ఎంతో కొంత ఫైనాన్సియల్‌ బెనిఫిట్‌ అన్నా వచ్చేది.'' అంటూ మోయలేనంత సానుభూతిని వర్షించాడు. ''ఒక్కోసారి అట్లా జరుగుతుందంతే'' అంటూ బదులిచ్చాడు పిట్టన్న జి.యమ్‌.కళ్ళలోకి చూస్తూ. పిట్టన్న రాసుకున్న కవరింగ్‌ లెటర్‌ మీద ఏదో కామెంట్‌ రాసిన జి.యమ్‌. పర్సనల్‌ ''ఈ లెటర్‌ తీసుకెళ్ళి జి.యమ్‌.వర్క్స్‌ని కలవండి.'' తిరిగి ఇస్తూ అన్నాడు.
లెటర్‌ తీసుకున్న పిట్టన్న ''సార్‌! ఈ కాలుతో బాయిలర్‌ పైకెక్కి డ్యూటీ చెయ్యడం కుదరదు. అంతో ఇంతో చదువుకున్నవాణ్ణి కాబట్టి ఎక్కడన్న ఆఫీస్‌లో టేబుల్‌ వర్క్‌ ఇవ్వండి చేస్తాను.'' అంటూ రిక్వెస్ట్‌ చేశాడు. పిట్టన్న రిక్వెస్ట్‌ను విన్న వెంటనే ''అసలిప్పటికే మినిస్టీరియల్‌ స్టాఫ్‌ ఎక్కువయ్యారని హైదరాబాద్‌ ఆఫీస్‌ వాళ్ళు గొడవ చేస్తున్నారు. అయినా నీది జన్యున్‌ కేస్‌ కాబట్టి నాకూ కన్సిడర్‌ చెయ్యాలనే వుంది. కాకపోతే నీకొక్కడికిస్తే మిగతా యూనియన్‌ నాయకులు 'మా క్యాండెట్స్‌ కూడా చాలామంది చాలా రకాల జబ్బులతో బాధపడుతున్నారు. మావాళ్ళ కేస్‌లు కూడా కన్సిడర్‌ చెయ్యండి.' అంటూ మా పీకల మీద కత్తిపెట్టి కూర్చుంటారు. అందుకే నిజంగా అవసరమున్న మీలాంటి వాళ్ళకు సాయం చెయ్యాలని వున్నా చెయ్యలేకపోతున్నాం. సారీ!'' అంటూ ఎంతో లౌక్యంగా మాట్లాడాడు జి.యమ్‌. పర్సనల్‌.
''మీరెన్నన్నా చెప్పండి సార్‌! నేను మాత్రం ఈ కాలుతో పైకెక్కి ఆ బాయిలర్ల మీద పని చెయ్యలేను.'' అంటూ గట్టిగానే చెప్పాడు పిట్టన్న. ''సరే చూద్దాం! ముందు మీరీ లెటర్‌ తీసుకుని జి.యమ్‌. వర్క్స్‌ దగ్గరికెళ్ళండి. మీకక్కడ ఆయనే ఏదో ఒక సూటబుల్‌ ప్లేస్‌ చూపిస్తాడు. కావాలంటే నేను కూడా ఆయనకు ఫోన్‌ చేసి పర్సనల్‌గా చెబుతాను.'' అంటూనే తరువాత వాళ్ళను పంపించమన్నట్టు బయటవున్న సెక్రటరీకి కాలింగ్‌ బెల్‌ కొట్టాడు జి.యమ్‌.పర్సనల్‌. ఇక తప్పదన్నట్టు మెల్లగా లేచి బయటకొచ్చాడు పిట్టన్న.
ట ట ట ''సారీ పిట్టన్నా! వ్యక్తిగతంగా నీకు సాయం చెయ్యాలని వున్నా చెయ్యలేని పరిస్థితి మాది. అయినా ఆల్‌ సెక్షనల్‌ హెడ్స్‌ను నీ ముందే పిలిపించి మాట్లాడుతానుండు వాళ్ళేం చెబుతారో విందువు గాని..'' అంటూ ఇంటర్‌కాంలో ఫోన్లు చేసి వెంటనే తన చాంబర్‌కి రమ్మన్నాడు జి.యమ్‌.వర్క్స్‌. ''మీరు డెసిషన్‌ తీసుకొని పంపిస్తే వద్దనేదెవరు సార్‌!'' జి.యమ్‌. వర్క్స్‌ కావాలనే ఏదో డ్రామా ఆడుతున్నాడన్న విషయం అర్థమైపోతుంటే వస్తున్న కోపాన్ని దిగమింగుకుంటూ అన్నాడు పిట్టన్న.
''లేదు.. లేదు.. ఏదైనా వాళ్ళిష్టంతోనే చెయ్యాలి తప్ప నా అభిప్రాయం వాళ్ళ మీద రుద్దకూడదు.'' అంటూ అతనింకేదో మాట్లాడుతుండగానే హెచ్‌.ఒ.డి.లందరూ వచ్చేశారు. వాళ్ళంతా పిట్టన్నను చూస్తూనే ''ఈ తద్దినాన్ని మన మీద రుద్దడానికి పిలవలేదు కదా?'' అనుకుని ముఖాలు ముడుచుకుంటూ జి.యమ్‌. ఎదురుగా కూర్చున్నారు. ఒకరిద్దరు తప్ప మిగతా హెచ్‌.ఒ.డిలు అందరూ వచ్చారని నిర్థారించుకున్న జి.యమ్‌. వర్క్స్‌ ''చూడండీ! మన పిట్టన్నకు చాలా ఘోరం జరిగిపోయింది. పోయిన కాలును మనమెలాగూ తీసుకురాలేం. ఆ కాలుతో తానిక బాయిలర్‌ పైకెక్కి పని చేయలేనంటున్నాడు. తను చదువుకున్నవాడే కాబట్టి ఏ టేబుల్‌ వర్కో ఇవ్వడం మన ధర్మం. మీలో ఎవరో ఒకరు అతణ్ణి తీసుకుని పేపర్‌ వర్క్‌ చేయించుకోండీ!'' నిజానికి మీరెవ్వరూ అతణ్ణి తీసుకోనవసరం లేదు అన్న ఓ సంకేతాన్ని ఆపద్ధర్మంగా అందజేస్తూ తెలివిగా విషయాన్ని వెల్లడించాడు.
సూది దూరేంత సందిస్తే చాలు ఏనుగును గూడా లాక్కుపోయే తెలివితేటలున్న హెచ్‌.ఒ.డి.లంతా జి.యమ్‌. సంకేతాన్ని సునాయాసంగా అందిపుచ్చుకుని ''నిజంగా ఈ పరిస్థితిలో మీరన్నట్టు పిట్టన్నకు టేబుల్‌ వర్క్‌ ఇవ్వడం న్యాయమే. మాక్కూడా ఇవ్వాలనే వుంది. కాకపోతే ఇప్పటికే మా సెక్షన్స్‌లో క్లరికల్‌ స్టాఫ్‌ ఇబ్బడిముబ్బడిగా వున్నారు. కాబట్టి సారీ సార్‌!'' అంటూ ప్రతి ఒక్కరూ పిట్టన్నను నాకొద్దంటే నాకొద్దని సున్నితంగా తిరస్కరించారు.
''అందరూ అట్లాగే అంటే ఎట్లా మరి?'' నీళ్ళు నమిలినట్టుగా మాట్లాడాడు జి.యమ్‌. వర్క్స్‌. ''ఏమో సార్‌! మీరేమన్నా చేసుకోండది. మాకు మాత్రం అవసరం లేదు.'' అంటూ ఎవరి మానాన వాళ్ళు లేచిపోయారు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తరువాత పిట్టన్న వంక తిరిగిచూస్తూ ''ఎలా మాట్లాడారో చూశావు గదా? ఎవ్వరూ వద్దంటుంటే మరి నేను మాత్రం ఏం చెయ్యగలను చెప్పు?'' అంటూ తనూ మెల్లగా తప్పుకోవాలన్నట్టు మాట్లాడాడు జి.యమ్‌. వర్క్స్‌.
''అదంతా నాకు తెలియదు సార్‌! నేనైతే బాయిలర్‌ మీదికి పోయి పని చేయటమనేది జరిగేది కాదు. మీరేంజేసుకుంటారో ఏమో నేను మాత్రం రోజూ వచ్చి మీ ఆఫీస్‌ ముందు కూర్చొని పోతాను.'' వున్న విషయం తెగేసినట్టు చెప్పి మెల్లగా లేచి బయటికి నడిచాడు పిట్టన్న.
ట ట ట మరునాడు ఉదయం పది గంటలకు తను చెప్పినట్టే వచ్చి జి.యమ్‌.వర్క్స్‌ ఆఫీస్‌ ముందు కూర్చున్నాడు పిట్టన్న. పదిన్నరకు ఆఫీస్‌కి వచ్చిన జి.యమ్‌. వర్క్స్‌ పిట్టన్నను చూస్తూనే ''లోపలికి రా!'' అంటూ తన చాంబర్లోకి వెళ్ళాడు. అతని వెనుకనే లోపలికెళ్ళిన పిట్టన్న చేతికి ఓ కాగితం ఇచ్చిన జి.యమ్‌. ''నువ్వెళ్ళి కెమికల్‌ డివిజన్‌లో వుండే రామిరెడ్డి డి.ఈ.కి రిపోర్ట్‌ చెయ్యి.'' అంటూ నిన్న హెచ్‌వోడీల మీటింగ్‌కి అటెండ్‌ కాని కెమికల్‌ డివిజన్‌ ఇన్‌చార్జి డి.ఈ. దగ్గరికి పంపించాడు. మెల్లగా కెమికల్‌ డివిజన్‌కి వెళ్ళి జి.యమ్‌. ఇచ్చిన లెటర్‌ డి.ఈ. రామిరెడ్డి చేతికిచ్చాడు పిట్టన్న. ఆ లెటర్‌ చూస్తూనే ''అరె.. నేను నిన్న ఫోన్‌లోనే వద్దని చెప్పాను కదా. మళ్ళీ నిన్నెందుకు పంపించాడు?'' అంటూ విసుక్కున్న డి.ఈ. ''మీరు మళ్ళీ వెళ్ళి ఆ జి.యమ్‌.నే కలవండీ!'' పిట్టన్నతో నిర్మొహమాటంగా అన్నాడు. అతని మాట తీరుకు మనస్సు చివుక్కుమంటుంటే వస్తున్న కోపాన్ని దిగమింగుకున్న పిట్టన్న అతను చెప్పినట్టే తిరిగి జి.యమ్‌.వర్క్స్‌ ఆఫీస్‌కి వెళ్ళాడు.
అప్పటికే ఫోన్‌లో జి.యమ్‌. వర్క్స్‌కి కెమికల్‌ డివిజన్‌ డి.ఈ.కి గొడవేదో పెద్దగానే జరిగినట్టుంది. అతను పిట్టన్నను చూస్తూనే ''చూడండి! ఈ వ్యవహారాలన్నీ చూడాల్సిన జి.యమ్‌. పర్సనల్‌, మ్యాటర్ని మెల్లగా నా మీదకు తోసి డ్రామా చూస్తున్నాడు. మీరేమో వచ్చి నా పీకల మీద కూర్చుంటున్నారు. ఎవ్వడూ వద్దంటుంటే నేనేం చెయ్యాలి?'' అన్నాడు కోపంగా.
బదులు మాట్లాడకుండా అరగంట పాటు అక్కడే కూర్చు న్నాడు పిట్టన్న. ఆఖరికి పిట్ట న్నను మళ్ళీ తన చాంబర్‌లోకి పిలిపించుకున్న జి.యమ్‌. వర్క్స్‌ ''ఒక పని చేస్తారా?'' అన్నాడు. ''చెప్పండేంటో?'' అన్నట్టు చూశాడు పిట్టన్న.
''కంపెనీలో వుండే అన్ని యూనియన్ల నాయకుల దగ్గరకి వెళ్ళి మిమ్మల్ని ఆఫీస్‌ సైడ్‌కి పంపిస్తే వాళ్ళకేమీ అభ్యంతరం లేదన్నట్టు ఒక లెటర్‌ రాయించుకు రండి. అప్పుడిక మిమ్మల్ని ఎటు మార్చినా అడిగేవాడుండడు.'' అంటూ సాధ్యంకాని సలహాను ఇచ్చాడు జి.యమ్‌.వర్క్స్‌.
***
''ఇదీ జరిగిన సంగతి. నాకు న్యాయం జరగాలంటే రోడ్డెక్కక తప్పని పరిస్థితి కల్పించారు.'' అంటూ తన చుట్టూ చేరినవాళ్ళకు అప్పటిదాకా జరిగిన ప్రతి విషయాన్నీ పూసగుచ్చినట్టు వివరించాడు పిట్టన్న. ఆ తరువాత మరో గంటకు
''పాల్వంచ ఫెర్టిలైజర్స్‌ కంపెనీలో అంగవైకల్యంతో బాధపడుతున్న గిరిజన కార్మికుడికి తగిన పోస్టింగ్‌ ఇవ్వకుండా ఏడిపిస్తున్న అధికారగణం. కొమరం భీమ్‌ విగ్రహం సాక్షిగా కంపెనీ గేట్‌ ముందు గిరిజనుల ఆందోళన.'' అన్న బ్రేకింగ్‌ న్యూస్‌ అన్ని చానల్స్‌లోనూ వచ్చింది.
అంతే!
ఇతర యూనియన్ల నాయకులంతా ఎక్కడివాళ్ళక్కడే గప్‌చుప్‌ అయిపోయారు.
అధికార గణం ఆగమేఘాల మీద కదిలింది.